- పోలవరంపై నీలిమీడియాలో రోత రాతలు
- పాపాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో జగన్
- తప్పులు ఎత్తిచూపిన చంద్రబాబుపైకి బురద
- జగన్మోసపు పత్రికలో అడ్డగోలు అబద్ధాలు
- సర్కారు శ్వేతపత్రంపై జనంలో మొదలైన చర్చ
- రాష్ట్ర ప్రజల ముందు దోషిగా నిలబడిన జగన్
అమరావతి (చైతన్య రథం): పచ్చి అబద్ధాలను నిఖార్సైన నిజాలుగా ప్రచారం చేయడంలో మాస్టర్స్ డిగ్రీ చేశామని `వైసీపీ మరోసారి నిరూపించుకుంది. ఐదేళ్ల పాలనను అబద్ధాల దొంతర్లపై సాగించిన జగన్ పార్టీ `పోలవరం పాపంనుంచి, ప్రాజెక్టు ద్రోహంనుంచి తప్పించుకోజూస్తోంది. జగన్ ముఠాలు పోగుచేసిన అబద్ధాలను `విషపు రాతలుగా జనంమీదకు వెదజల్లేందుకు నీలిమీడియా నానాతిప్పలూ పడుతోంది. పోలవరం విధ్వంసానికి పాల్పడిన పచ్చి పాపాన్ని కప్పిపుచ్చుతూ.. జగన్ పాతివ్రత్యాన్ని ప్రపంచానికి చాటేందుకు వేస్తోన్న పిల్లిమొగ్గలను ప్రజలు నమ్మరుగాక నమ్మరు. జాతి జీవనాడి పోలవరం ఆయువుపట్టుమీద జగన్ ఎంత బలంగా కొట్టాడో ఆధారాలు సహా చంద్రబాబు బట్టబయలు చేసిన రోజే `పచ్చి అబద్ధాలను వండివార్చటం.. నీలిమీడియాకే చెల్లింది.
దోషి.. ద్రోహి.. జగనే!
పోలవరం పనులను ఈనెల 17న క్షేత్రస్థాయిలో పరిశీలించిన సమయంలో `జాతికి జరిగిన ద్రోహాన్ని చూసి చంద్రబాబు కన్ను చెమర్చడాన్ని రాష్ట్ర ప్రజలు మర్చిపోరు. రాష్ట్ర ఆర్థిక, సామాజిక స్వరూపాన్ని సమూలంగా మార్చగల శక్తిపీఠంలాంటి పోలవరం `అసమర్థ పాలకుడి నిర్లక్ష్యానికి ఛిద్రమవడాన్ని చూసి చలించిపోయారు. ప్రజా ప్రభుత్వాధినేతగా పోలవరం నష్టాన్ని ప్రజల ముందుంచాలన్న నైతిక బాధ్యతతో `శుక్రవారం శ్వేతపత్రాన్నీ విడుదల చేశారు. ఎక్కడ నష్టం జరిగింది? ఎంతమేర నష్టం వాటిల్లింది? ఏవిధంగా నష్టం సంభవించింది? ప్రాజెక్టు పాడుపడటానికి కారణాలేంటి? ఎవరు కారకులెవరు? ఇత్యాధి విషయాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఆధారాలు సహా విశదీకరించారు. జగను చేసిన జాతిద్రోహం బట్టబయలైతే.. మరింత ప్రజాగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందన్న భయంతో నీలిమీడియా ఎదురుకోలు మొదలెట్టింది. తన తప్పులు కప్పిపుచ్చాలంటే.. ఎదుటివారిపై బురద జల్లాలన్న సహజ దుర్నీతికి దిగింది. పోలవరం వాస్తవాలు ప్రజలకు తెలుసన్న స్పృహకూడా లేకుండా.. పచ్చి అబద్ధాలనే రంగరించింది. నిజాలను రోత రాతల కింద కప్పెట్టే నిస్సిగ్గు ప్రయత్నమే అది. 2014 జూన్ 8నుంచి 2019 మే 29 మధ్య అధికారంలోవున్న చంద్రబాబు, కమీషన్ల దాహంతో చేసిన చారిత్రక తప్పిదాల వల్లే ప్రాజెక్టు విఫలమైందన్న సాక్షి తప్పుడు రాతలు ప్రజలు నమ్మబోరు. దాదాపు మూడొంతుల ప్రాజెక్టు పనులు పూర్తిచేసిన చంద్రబాబు సాహసాన్ని అంగీకరించే ధైర్యం లేక.. తప్పుడు కథనాలకు విత్తులు వేయడం తెంపరితనమే. జగను చేసిన మోసాన్ని అబద్ధపు రాతలకింద దాచాలనుకోవడం వెర్రిమొర్రితనం. చంద్రబాబు ప్రతిష్టపై నీలిమీడియా విషం చిమ్మినంత మాత్రాన `పోలవరం పాపాల నుంచి జగన్‌కు విముక్తి లభిస్తుందనుకోవడం భ్రమ!
చంద్రబాబు ప్రతిష్టపై వైసీపీ బురద
చంద్రబాబుపై బురద జల్లడానికి నీలిమీడియా మరోసారి జనంపైకి అబద్ధాలను ప్రయోగించింది. పోలవరాన్ని శరవేగంగా పూర్తి చేయడానికి చంద్రబాబు కంకణం కట్టుకోవడంతో `నిర్మాణ బాధ్యతను 2016 సెప్టెంబర్ 7న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అప్పగించింది. అప్పటికి ట్రాన్స్‌ట్రాయ్ పనులు మందకొడిగా సాగుతున్నాయి. కేంద్రం అనుమతితో పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సమావేశంలో చర్చించి.. ట్రాన్స్‌ట్రాయ్‌తోపాటు నవయుగకు పనులు అప్పగించారు. అలా, తక్కువ సమయంలో దాదాపు 72శాతం పనులు పూర్తిచేసి రికార్డు సృష్టించారు చంద్రబాబు. టీడీపీ ప్రభుత్వ పాలనలో పోలవరంలో అవినీతి జరగలేదని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, ఢల్లీి హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేయడం.. ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనం. ఈ విషయం తెలిసి కూడా అవినీతి బురదను చంద్రబాబుకు అంటించే కుట్రపూరిత ప్రచారానికి తెరలేపడం సిగ్గుచేటు.
ప్రాజెక్టుకు ఉరివేసిన మూర్ఖుడు..
కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టునే ఉరికంబమెక్కించిన నీచుడు జగన్. కమీషన్ల కక్తుర్తితో రివర్స్ టెండరింగ్‌ను తెరపైకి తెచ్చి నిర్మాణ ఏజెన్సీని మార్చిన ఫలితమే.. పోలవరానికి పెనుముప్పు వచ్చిపడిరది. ఆ విషయం 2019లో జరిగిన పోలవరం ప్రాజెక్టు అథిరిటీ సమావేశం మినిట్సే సష్టం చేస్తున్నాయి. జగన్ తన స్వార్థపూరిత ఆలోచన తెరపైకి తెచ్చినపుడు `అప్పటికి పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టరు పనితీరు సంతృప్తికరంగానే ఉందని పీపీఏ కితాబిచ్చింది. ఏజెన్సీని మార్చాల్సిన అవసరం లేదనీ స్పష్టం చేసింది. అకస్మాత్తుగా ఏజెన్సీని మారిస్తే.. 2009లో (వైయస్ సర్కారు) కాంట్రాక్టర్‌ను మార్చడంవల్ల పనులు నిలిచిపోయినట్టే.. ఇప్పుడూ ప్రమాదం తలెత్తవచ్చని హెచ్చరించింది. కాంట్రాక్టర్‌ను మార్చడంవల్ల 10 నెలలకుపైగా (ఒక సీజను) పనుల్లో జాప్యం జరుగుతుందని, నాణ్యతలో ఇబ్బందులొస్తే ఎవరిని బాధ్యులను చేయాలోకూడా అర్థంకాదని పీపీఏ సూచించింది. అయినప్పటికీ `జగన్ మూర్ఖపు నిర్ణయంతో కాంట్రాక్టర్‌ను మార్చి ప్రాజెక్టును గోదాట్లో ముంచేశారు.
తప్పుడు లెక్కలతో చెత్త రాతలు
ఇక 2005నుంచి 2019 వరకు 24.85 శాతం పనులు జరిగితే.. 2019-24 మధ్య 24.94 శాతం పనులు పూర్తైనట్టు సాక్షి కట్టుకథలు రాయడం.. రాష్ట్రాన్ని మోసం చేయడమే. 2005 నుంచి 2014 వరకు జలయజ్ఞం పేరిట సాగిన పనులు కేవలం 5 శాతంలోపు. అదీ కాల్వల పేరుతో మట్టి పనులు చేసి కమీషన్లు దండుకున్నారన్న విమర్శలు తలెత్తాయి. పునాదిరాళ్లు, శిలాఫలకాల దగ్గరే ఆగిపోయిన పోలవరం.. రాష్ట్ర విభజన తరువాతే పరుగులు పెట్టింది. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు పాలనలో 72 శాతం పనులు పూర్తయ్యాయి. జగన్ ఐదేళ్ల ఏలుబడిలో కేవలం 3.84 శాతం పనులు మాత్రమే ముందుకెళ్తే.. 24.95 శాతం పనులు పూర్తి చేసినట్టు ప్రకటించుకోవడం ఆత్మవంతన చేసుకోవడమే. 2019-24 మధ్య పోలవరం ప్రాజెక్టు మీద 8,629 కోట్లు వైసీపీ వెచ్చించినట్టు సాక్షి లెక్కలు చూపడం దారుణం. దారిమళ్లించిన నిధులను సైతం ప్రాజెక్టుకు ఖర్చు పెట్టినట్టు నీలిమీడియా రాసిన రాతలు పెద్ద రోత. వాస్తవాలు పరిశీలిస్తే.. మునుపటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేపట్టిన పోలవరం పనుల విలువ రూ.11,762 కోట్లు. అప్పటికి కేంద్రం నుంచి విడుదలైంది రూ.6,764 కోట్లే. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించింది. జగన్ హయాంలో పోలవరానికి వెచ్చించిన వ్యయం రూ.4,167 కోట్లు మాత్రమే. తెదేపా ప్రభుత్వం భరించిన భారాన్ని కేంద్రం రీయింబర్స్ చేస్తే.. అలా వచ్చిన రూ.8వేల కోట్ల నిధుల్లో రూ.3,385 కోట్లు దారి మళ్లించింది వైకాపా సర్కారు. ఆ విషయాన్ని దాచ్చిపెట్టి, నిస్సిగ్గుగా అబద్ధాల రాతలకు తెగబడటం నీలిమీడితా తెంపరితనమే.
ఇది కదా వాస్తవం..
చంద్రబాబు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టకపోవడంవల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిందన్న పచ్చి అబద్ధాన్ని రాసుకొచ్చింది నీలిమీడియా. నిజానికి `అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే పనులు నిలిపేసింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టకుండానే ఏజెన్సీలను తొలగించారు జగన్. అలా, 2020 నవంబరు వరకు పనులు చేపట్టలేదు. కాఫర్ డ్యాంలలో గ్యాప్‌లు పూర్తి చేయలేదు. అప్పటికే సమర్థులైన, అనుభవమున్న అధికారులను బదిలీ చేశారు. అలాంటి పరిస్థితుల్లో 2020 ఆగష్టులో భారీ వరదలు సంభవించి `డయాఫ్రం వాల్ దెబ్బతింది. ఆ విషయాన్ని హైదరాబాద్ ఐఐటీ నిపుణుల బృందం స్పష్టం చేయడం గమనార్హం. డయాఫ్రం వాల్ దెబ్బతిన్న విషయాన్ని రెండేళ్ల తరువాత గ్రహించిన గుడ్డి ప్రభుత్వం జగన్‌ది. ఈ విషయాలను దాచిపెట్టి `2019 జూన్‌లోనే భారీ వరదలు సంభవించాయని, ఆ వరదకే డయాఫ్రం వాల్ దెబ్బతిన్నట్టు కొత్త అబద్ధాన్ని తెరపైకి తెచ్చింది నీలిమీడియా. 2019 మే 30న ప్రమాణ స్వీకారం చేసిన ప్రభుత్వం.. జూన్ నాటికి అంటే నెల రోజుల వ్యవథిలో కాఫర్ డ్యాంలలో గ్యాప్‌లు ఎలా ఫిల్ చేస్తుందని అబద్ధాల వాదనకు దిగడం.. చేసిన నేరంనుంచి తప్పించుకునే సాహసమే.