- సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం
- అందరూ సంతోషంగా ఉండాలన్నదే సీఎం ఉద్దేశం
- సైనికుల కోసం ఆనాడే ఎన్టీఆర్ విరాళాలు సేకరించారు
- టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు టి.డి.జనార్దన్
- పార్టీ కేంద్ర కార్యాలయంలో రిటైర్డ్ ఉద్యోగులతో సమావేశం
- పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
మంగళగిరి(చైతన్యరథం): మాజీ సైనికోద్యోగుల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు టి.డి.జనార్దన్ తెలిపారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం రిటైర్ట్ ఆర్మీ ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. టి.డి.జనార్దన్‌తో పాటు ముఖ్యఅతిథిగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఏపీ ఎక్స్ సర్వీస్‌మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మోటూరి శంకర రావు, జనరల్ సెక్రటరీ వై.రమేష్‌కుమార్, ఆ సంఘ జిల్లా, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు 450 మంది వరకు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు మాట్లాడుతూ తమ సమస్యలను చెప్పుకున్నారు. 2004 హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో ఎక్స్ సర్వీస్‌మెన్ ఉద్యోగుల సమావేశం మొదటిసారి నిర్వహించారు. నాడు చంద్రబాబు ప్రజల కోసం పని చేయాలని సూచించారని, కూటమి గెలుపునకు తమ వంతు కృషి చేసినట్లు వివరించారు. కేంద్రీయ సైనిక బోర్డులో ఏపీ నుంచి ఒక్క ప్రతినిధి, జేసీవో లేరని ఈ సమస్యను పరిష్క రించాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులకు టీడీపీలో ప్రత్యేక సెల్ ఉండేదని విభజన తర్వాత ఆ అవకాశం లేదన్నారు. దీంతో తమ సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ఎన్టీఆర్ హయాంలో ఎక్స్ సర్వీస్ మెన్ ఉద్యోగుల కోసం 2 శాతం రిజర్వేషన్ కోటా ఉండేదని, దానిని తిరిగి కొనసాగించా లని కోరారు. 191 జీవో ప్రకారం బ్యాక్‌లాగ్ పోస్టులను ఎక్స్ ఆర్మీ ఉద్యోగులకు కేటా యించాలని కోరారు.
సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తారానికి చర్యలు
ఈ సందర్భంగా టి.డి.జనార్దన్ మాట్లాడుతూ రిటైర్డ్ సైనికోద్యోగుల సమస్యలకు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి వారి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్న శంకర్‌రావును అభినంది స్తున్నా. మీమీ ప్రాంతాల్లో ఉన్న మాజీ సైనిక ఉద్యోగులను ఏకం చేసి మీ సంఘంలో చేర్చు కోండి. ఇచ్చిన అర్జీల్లో చాలా సమస్యలు నా ముందుకు వచ్చాయి. ఒక ఉద్యోగి తనకు ఇచ్చిన స్థలాన్ని ఆక్రమించుకున్నారని నా ముందు ఆవేదన చెందాడు. గత ఐదేళ్ల పాలనలో రాక్షస ప్రభుత్వం ఉంది. వాళ్లు బతకడమే కాని ఎదుటి వ్యక్తులు బతికితే ఒప్పుకోరు. ఇలాం టి మీటింగ్‌లు పెట్టాలంటే పొద్దున్నే శంకర్‌రావును హౌస్ అరెస్టు చేసేవారు. అలాంటి చీకటి రోజుల నుంచి మనం బయటకు వచ్చాం. మాజీ సైనికుల సమస్యలను సీఎం చంద్ర బాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తాం. నియోజకవర్గాల్లో ఉండే స్థానిక ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి సమస్యలను పరిష్కరించుకోవాలి. ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా అందరి సమస్యలు పరిష్కారం కావాలి..అందరూ సంతోషంగా ఉండాలన్నదే టీడీపీ, చంద్రబాబు ముఖ్యఉద్దేశం.
సంఘం సభ్యులు లక్ష మందికి చేరుకోవాలి
అందరి సమస్యలను చంద్రబాబు పరిష్కరిస్తారు. మిగిలిన సైనిక సంఘాల్లో ఉన్న ఉద్యోగులతో కూడా స్నేహంతో ఉండి సమస్యలు పరిష్కరించుకుంటూ మళ్లీ 2029లో కూడా టీడీపీ గెలుపు కృషిచేయాలి. ఒక్క ఛాన్స్ పేరుతో జగన్‌కు అవకాశం ఇస్తే వాళ్లు దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఎంతమంది ప్రాణాలు తీశారో తెలియదు. వైసీపీ నేతలు చేసిన విధ్వంసం నేడు చంద్రబాబు సరిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. నిరం తరం 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని 800 మంది సభ్యులుగా ఉన్న సంఘం అభివృద్ధి చెంది లక్ష మందితో పెద్ద బహిరంగ సభ పెట్టుకునే స్థాయికి తెచ్చేలా పనిచేయాలని కోరుకుంటున్నానని తెలిపారు.
సైనికుల కోసం ఆనాడే ఎన్టీఆర్ విరాళాలు సేకరించారు
చైనా, భారత్ యుద్ధ సమయంలో అన్న ఎన్టీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా విరాళాలు సేకరించి సైనికుల కోసం అందించిన గొప్ప వ్యక్తి. ఎన్టీఆర్ గొప్ప మానవతావాది. ఆయన చెప్పడమే కాదు చేసి చూపించారు. నేడు పేదవాడికి ఆహార భద్రత అని ప్రపంచ దేశాలు ఘోసిస్తున్నా యి. 40 ఏళ్ల కిందటే ఎన్టీఆర్ పేదవాడికి ఆహార భద్రత కల్పిస్తూ కిలో రూ.2కే బియ్యాన్ని అందజేశారు. పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చారు. వాటినే నేడు అన్ని ప్రభుత్వాలు అమ లు చేస్తున్నాయి. మహిళలకు ఆస్తిలో సమాన వాటా కల్పించిన ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు. కోడళ్ల పేరుతో ఆస్తులు రాసి ఎన్టీఆర్ అందరికీ ఆదర్శంగా నిలిచారు. నదుల అనుసంధానం మొట్టమొదట ఎన్టీఆర్ చేశారు. కృష్ణా, పెన్నాను కలిపి రాయలసీమను సస్య శ్యామలం చేశారు. తరువాత కృష్ణా, గోదావరిని చంద్రబాబు కలిపి రాయలసీమకు నీళ్లు అందించారు. ఐటీ విప్లవంతోనే అభివృద్ధి సాధ్యమని ముందే తెలుగుజాతికి ఐటీని అందిం చిన గొప్ప నాయకుడు చంద్రబాబు అని ఉద్ఘాటించారు.