అమరావతి(చైతన్యరథం): కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చి ప్రత్యేక సాయం చేస్తామని ప్రకటించడంపై జిల్లా మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి, విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, కందుల నారాయణరెడ్డి, బి.ఎన్.విజయ్‌కుమార్, ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి, ఎం.ఎం.కొండయ్య, ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చిన కేంద్ర ప్రభుత్వానికి కృత జ్ఞతలు తెలిపారు. ప్రకాశం జిల్లా అభివృద్ధికి ఎన్డీయే కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చెప్పారు.