- అవినీతి సొమ్ము రికవరీకి ఆదేశాలు..
- ఒక్క రోజులో రైతు రుణాల మంజూరుకు చర్యలు
- రూ.38.7 వేల కోట్ల సహకార రుణాలు
- ఆప్కాబ్ `డీసీసీబీల రుణ అంచనా ప్రణాళిక
- ఆప్కాబ్, డీసీసీబీ బ్రాంచ్‌ల విస్తృతిపై దృష్టి
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రవ్యాప్త సహకార సంఘాల పరిధిలో అవినీతి నిగ్గుతేల్చడమే కాదు, అక్రమంగా మెక్కినదంతా కక్కిస్తామని రాష్ట్ర సహకార మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడిరచారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో ఆప్కాబ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో అనేకచోట్ల నకిలీ ధృవపత్రాలతో రుణాలు, రైతుల పేరుతో అదనపు రుణాలు, అధికారులే బినామీ పేర్లతో రుణాలు పొందిన విషయాలు తన దృష్టికి వచ్చాయని, సహకార వ్యవస్థను ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. రుణం కోసం రైతులు కాళ్లరిగేలా తిరిగే రోజులు పోవాలని, ఒక్క రోజులో రైతుకు రుణం అందించేలా చర్యలు తీసుకునేందుకు కసరత్తు చేసి త్వరలో ఆ దిశగా చర్యలు ప్రారంభించాలని సూచించారు.
రైతు ఆధార్ కార్డుతో మీ భూమి, ఈసీ, ఈ క్రాప్ అనుసంధానించి.. రైతులకు అత్యంత వేగంగా రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో త్వరితగతిన సహకార సంఘాలను ఆన్లైన్ చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఆప్కాబ్ `డీసీసీబీల నుంచి సహకార సంఘాల ద్వారా ఈ ఏడాది రూ.38.7వేల కోట్లు అందించేందుకు అంచనా ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడిరచారు. రుణాలు మంజూరు చేసే క్రమంలో జాప్యంలేకుండా చూడాలని, రైతులు ఇబ్బందులు పడకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ పంట రుణాలతోపాటు రైతులకు దీర్ఘకాలిక రుణాలు, రైతుల పిల్లల చదువు నిమిత్తం విద్యా రుణాలు, విదేశీ విద్యా రుణాలు మంజూరు చేసేందుకు ఆప్కాబ్ మరింత వేగం పెంచాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో డీసీసీబీ, ఆప్కాబ్ బ్రాంచ్‌ల ఏర్పాటుకు కసరత్తు వేగవంతం చేయాలని, అనుమతులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తక్షణమే దరఖాస్తు చేయాలని ఆదేశించారు.
గ్రామస్థాయిలో మహిళా మండలి (ఎస్‌హెచ్‌జీ) రుణాలు, ప్రధాన మంత్రి సూర్యఘర్ యోజన రుణాలు, ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన రుణాలు మంజూరులో ఆప్కాబ్ బ్రాంచ్‌లు, డీసీసీబీలు తమ సేవలు మరింత విస్తృతం చేయాలని సూచనలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన రాయితీ రుణాలతోపాటు హామీ లేని రుణాలు (సీజీటీఎమ్ఎస్) రుణాలు మంజూరు గురించి ప్రజలకు అవగాహనపెంచి సాధ్యమైనంత ఎక్కువమంది సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆప్కాబ్ ఎండీ శ్రీనాధ్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.