- గత ప్రభుత్వం రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టింది
- రూ.1674 కోట్ల బకాయిలు చెల్లించలేదు
- కూటమి ప్రభుత్వం వాటిని పూర్తిగా చెల్లించింది
- పౌరసరఫరాల శాఖనూ అప్పుల్లో ముంచేసింది
- కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది
- రైతు సహాయక కేంద్రాలుగా రైతు భరోసా కేంద్రాలు
- రైతులకు 50 శాతం సబ్సిడీతో టార్ఫాలిన్ పట్టలు
- ప్రతి కౌలు రైతుకూ గుర్తింపు కార్డు అందజేస్తాం
- పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్
- రూ.674 కోట్ల ధాన్యం బకాయిల విడుదల
ఏలూరు(చైతన్యరథం): కూటమి ప్రభుత్వం రైతుకు ఎలాంటి నష్టం జరగకుండా అండగా నిలబడుతుందని పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతు ఖాతాలో డబ్బులు వేస్తామని స్పష్టం చేశారు. పంటల బీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించే ఏర్పాటు చేస్తామని తెలిపారు. సోమవారం ఏలూరు జిల్లా కేంద్రంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రైతులకు గత ప్రభుత్వంలో చెల్లించాల్సిన ధాన్యం బకాయిలను విడుదల చేశారు.
గత ప్రభుత్వం రైతులకు రూ.1674 కోట్ల ధాన్యం బకాయిలు పెట్టగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే రూ.వెయ్యి కోట్లు విడుదల చేసిందన్నారు. మిగిలిన రూ.674 కోట్లను సోమవారం విడుదల చేయడం జరిగిందన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రైతులకు రూ.472 కోట్లు ఒకేసారి రైతుల ఖాతాల్లో వేసే ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వం రైతాంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందని, ధాన్యాన్ని అమ్ముకున్నా చేతికి డబ్బు ఇవ్వలేదన్నారు. నిబంధనలకు లోబడి రైతులు ధాన్యం అమ్ముకున్నా ప్రతి అడు గులో అక్రమాలు చోటు చేసుకున్నాయని, గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల వల్ల ఎంత నష్టం వాటిల్లిందో చూశామన్నారు.
గత ప్రభుత్వ తప్పులకు బ్యాంకర్లు ఫోన్లు కూడా ఎత్తడం లేదు
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల ఆవేదన గురించి సమీక్ష జరిపితే అధికారులు చెప్పిన లెక్కలు చూసి భయం వేసిందని, పౌరసరఫరాల కార్పొరేషన్‌ను రూ.40,550 కోట్ల రుణాల్లో ముంచేశారని తెలిపారు. రైతులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.1674 కోట్ల ఉన్నాయని చెబితే వారిని ఎలా ఆదుకుంటామో అర్థం కాలేదని, నెలరోజుల్లోపే నిధులు సమకూర్చుకుని వారికి ఇవ్వాలని అధికారులను ఢల్లీికి పంపి నాబార్డు, ఎన్సీడీసీ అధికా రులతో మాట్లాడి రుణాలు తెచ్చే ప్రయత్నాలు చేసినట్టు వివరించారు. గత ప్రభుత్వం చేసిన ఆర్ధిక అరాచకాలకు బ్యాంకర్లు ఫోన్లు ఎత్తడం మానేశారన్నారు. పరిస్థితిని చంద్రబాబు దృష్టికి తీసుకువెళితే రైతులకు వెంటనే బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు.
రైతులకూ ఈజ్ ఆఫ్ డూయింగ్ వర్తింపు
కూటమి ప్రభుత్వంలో కౌలు రైతులకు గౌరవం దక్కే ఏర్పాటు చేస్తామని, పండిరచిన పంటకు సకాలంలో చెల్లింపులు చేయాలన్న ఆలోచనను ఈ రోజు అమలు చేస్తున్నామని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలను రైతు సహాయ కేంద్రాలుగా మార్చినట్టు తెలిపారు. ఈ పంట ద్వారా సీసీఐసీ కార్డులు ఇచ్చే ఏర్పాటు చేసి కౌలు రైతులందరినీ ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వ్యాపారవేత్తలతో పాటు రైతులకు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సౌకర్యం కల్పిస్తామని, రైతు సహాయక కేంద్రాలకు వెళితే సంతృప్తి కలిగే విధంగా వ్యవస్థలో మార్పులు తీసుకువస్తామని వివరించారు. గత ప్రభుత్వం గోతాలు, ధాన్యం రవాణా, వ్యవసాయ పరికరాల పంపిణీని విస్మరించిందని, కూటమి ప్రభుత్వంలో పౌరసరఫరాల శాఖ నుంచి రైతులకు 50 శాతం సబ్సిడీపై టార్ఫాలిన్ పట్టలు సరఫరా చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.
ప్రతి గింజా కొనుగోలు చేస్తాం
గత ప్రభుత్వం కంప్యూటర్ చీటీ పేరిట దొంగ ప్లాన్ వేసి కొంతమంది మిల్లర్లకే రైతులు అమ్మే విధంగా పథకం వేసిందని..కూటమి ప్రభుత్వంలో రైతులు దగ్గరలో ఉన్న మిల్లర్లకే ధాన్యం అమ్మే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పౌరసరఫరాల శాఖ రుణాలు రూ.40 వేల కోట్లలో వచ్చే మార్చి 31 నాటికి రూ.10 వేల కోట్లు బ్యాంకర్లకు చెల్లించేం దుకు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. చంద్రబాబు, పవన్ నాయకత్వంలో రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చేందుకు కష్టపడుతున్నామని వివరించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో అద్భుతమైన వేర్ హౌస్‌లు ఏర్పాటు చేస్తామని, ప్రతి గింజా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యవసాయ శాఖ, మార్కెంటింగ్ శాఖ, పౌరసరఫరాల శాఖలు సమన్వయంగా పనిచేసి ఈ క్రాప్ ద్వారా నష్టపోయిన ప్రతి గింజకుి పరిహారం అందే ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణ, చింతమనేని ప్రభాకర్, కామినేని శ్రీనివాస్, బొలిశెట్టి శ్రీనివాస్, పత్సమట్ల ధర్మరాజు, చిర్రి బాలరాజు, రోషన్‌కుమార్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గంటా పద్మశ్రీ, పౌరసరఫరాల శాఖ ఎండీ వీర పాండియన్, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పాల్గొన్నారు.