- ఆ పార్టీ నేతలు అంతటి దుర్మార్గాలు చేయగలిగిన ఘనులే
- 11 లక్షల క్యూసెక్కులు పోటెత్తినా అమరావతి చెక్కు చెదరలేదు
- కొన్ని పేటీఎం బృందాలు, పెయిడ్ చానళ్లు దుష్ప్రచారం చేస్తున్నారు
- ప్రకాశం బ్యారేజ్ గేట్ల దగ్గర నిపుణుడితో మరమ్మతులు చేయిస్తాం
- బుడమేరుకు పడిన మూడు గండ్లను పూడ్చి వేయించేందుకు చర్యలు
- జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి
విజయవాడ(చైతన్యరథం): ప్రకాశం బ్యారేజ్‌కు 4 బోట్లు కొట్టుకురావటం వెనుక వైసీపీ కుట్ర ఉండి ఉండవచ్చని మంత్రి నిమ్మల రామానాయుడు అనుమానం వ్యక్తం చేశారు. ఆ పార్టీ నేతలు అంతటి దుర్మార్గాలు చేయగలిగిన ఘనులేనని వ్యాఖ్యానించారు. అమరావతి ముంపు ప్రాంతమనే జగన్ కల సాకారానికి కొన్ని పేటీఎం బృందాలు, పెయిడ్ చానళ్లు తీవ్ర దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. 11.5 లక్షల క్యూసెక్కులు పోటెత్తినా అమరావతి చెక్కుచెదరలేదని స్పష్టం చేశారు. అమరావతిపై ఫేక్ న్యూస్ ఎవరూ నమ్మవద్దని కోరారు. అమరావతిపై విషం చిమ్మడం వైసీపీకి మొదటినుంచి అలవాటేనని తెలిపారు. రాజధాని అమరావతికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. కృష్ణా కరకట్టపై మంతెన ఆశ్రమం వద్ద షట్టర్‌కు ఐదేళ్లుగా గ్రీజ్ పెట్టలేదని, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అక్కడ వరద నీరు వచ్చాయని చెప్పారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గరకు గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడు వస్తున్నా రని చెప్పిన మంత్రి రాత్రికి మరమ్మతులు చేస్తారని వెల్లడిరచారు. బుడమేరుకు పడిన 3 గండ్లను ఈ రాత్రికి పూడ్చే ప్రయత్నం చేయిస్తామని తెలిపారు.