- రేషన్, ఆధార్ కార్డులు లేకున్నా పంపిణీ
- ఆపత్కాలంలో ప్రజలకు అండగా ప్రభుత్వం
- పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్
- వరద ప్రాంతాల్లో నిత్యావసరాల సరఫరా ప్రారంభం
విజయవాడ(చైతన్యరథం): వరద ప్రభావిత ప్రాంతాల బాధితుల్లో ధైర్యం, భరోసా నింపేం దుకు ప్రభుత్వం తరపున ఉచితంగా అందజేస్తున్న నిత్యావసర సరుకులు ప్రతి బాధిత కుటుంబానికీ అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచన మేరకు పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ సంయుక్తంగా ఈ నిత్యావస ర సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. శుక్రవారం విజయవాడ బీఆర్‌టీ ఎస్ రోడ్డులో ఉచిత నిత్యావసర సరుకులను ఇంటింటికీ పంపిణీ చేసే కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు, పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌తో కలిసి నాదెండ్ల లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత ఆరురోజులుగా ఈ విపత్తును ఎంతో ధైర్యంతో ఎదుర్కొన్నా రు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో యంత్రాంగం తక్షణం స్పందించి అద్భుతం గా సహాయక చర్యలు చేపట్టింది. ప్రభుత్వంతో పాటు ఎంతోమంది పౌరులు సేవా భావంతో ముందుకువచ్చి సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా విజయవా డ, పరిసర ప్రాంతాల్లోని వరద ముంపు బాధిత కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కిలో చొప్పున పంచదార, కందిపప్పు, వంటనూనె, రెండు కిలోల చొప్పున ఉల్లిపాయలు, బంగాళ దుంపలు సరఫరా చేయాలని నిర్ణయించాం. వీటితో పాటు మున్సిపల్ శాఖ నుంచి వచ్చిన మరికొన్ని సరుకులను అందచేస్తున్నట్టు తెలిపారు.
1100 రేషన్ వాహనాలతో పంపిణీ
1100 రేషన్ పంపిణీ వాహనాల ద్వారా అనేక జిల్లాల నుంచి యంత్రాంగం కదిలి వచ్చి ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటునట్టు చెప్పారు. ఈ ఒక్కరోజులోనే 70 వేల మంది బాధితులకు ఉచిత నిత్యావసర సరుకులు అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ ఉచిత కిట్లు వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ, ప్రతి పౌరుడికీ అందేలా ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. వివిధ జిల్లాల నుంచి 400 లారీల్లో సరుకులు తెప్పించామని పేర్కొన్నారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డులు లేని వారికి కూడా మొబైల్ నెంబర్, వివరాలు నమోదు చేసుకుని కిట్లు పంపిణీ చేయాలని ఆదేశించినట్టు చెప్పారు. ప్రతి ఇంటికీ సరుకు లను చేర్చే విధంగా కూటమి నాయకులు, కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు సహకరిం చాలని కోరారు. పండుగ పూట కూడా పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.
నిత్యావసరాల కిట్ల తనిఖీ
ముందుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పంపిణీకి సిద్ధంగా ఉంచిన నిత్యావసర సరుకుల వాహనాలను తనిఖీ చేశారు. ఉచిత కిట్లలో పేర్కొన్న వస్తువులు ఉన్నాయా లేదా అని లోడ్ చేసిన ప్రతి వాహనంలో చెక్ చేశారు. ప్రతి వస్తువు ప్రజలకు చేరే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని వాహన డ్రైవర్లు, సిబ్బందిని ఆదేశించారు. గొల్లపూడి మార్కెట్ యార్డులో నిత్యావసర సరుకుల ప్యాకింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డ్వాక్రా సంఘాల సభ్యులు స్వచ్ఛందంగా ఇక్కడకు వచ్చి సేవలు అందిస్తున్నారు. నిత్యావసర సరుకుల ప్యాకింగ్‌లో వారంతా పాలుపంచుకున్నారు. నాదెండ్ల మనోహర్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ విపత్తు సమయంలో డ్వాక్రా మహిళలు చేస్తున్న సేవలు అభినందనీ యమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పౌరస రఫరాల శాఖ ముఖ్యకార్యదర్శి వీరపాండ్యన్, ఆహార పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.