- గోదావరి పరీవాహక ప్రజలను అప్రమత్తం చేయాలి
- జలవనరుల అధికారులకు మంత్రి నిమ్మల ఆదేశం
విజయవాడ(చైతన్యరథం): జలవనరుల అధికారులతో ఆ శాఖ మంత్రి నిమ్మల రామానా యుడు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్, వరదల నేపథ్యంలో దెబ్బతిన్న కాలువలు, డ్రెయిన్లు, చెరువులు, రిజర్వాయర్లు, ఏటిగట్లకు పడ్డ గండ్లను వెంటనే గుర్తించాలని ఆదేశించారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గండ్లను అత్యవసర పనులుగా పెట్టుకుని వెంటనే పూర్తి చేయాలని సూచిం చారు. ఏలేరు రిజర్వాయర్ చరిత్రలోనే అత్యధికంగా 45,000 క్యూసెక్కుల నీరు వచ్చినా వరద నిర్వహణ సరిగా పనిచేయడం వల్ల నష్టస్థాయిని తగ్గించగలిగామని వివరించారు. ధవళేశ్వరం నుంచి ప్రస్తుతం 7 లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి వదులుతు న్నామని సాయంత్రానికి ఇది మరింతగా పెరిగి 10 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశ ముందని వెల్లడిరచారు. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్న దృష్ట్యా గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొల్లే రు అవుట్ ఫ్లో పెంచేందుకు అడ్డంకిగా ఉన్న కిక్కిస గడ్డిని యంత్రాలు పెట్టి తొలగిం చాల్సిందిగా ఆదేశించారు. ప్రస్తుతం వరద నీటితో రాయలసీమకు సంబంధించి రిజర్వా యర్లు, చెరువులు అన్నీ నింపి ప్రతిరోజూ నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయిప్రసాద్, ఈఎన్‌సీ ఎం.వెం కటేశ్వరరావు, సీఈ, ఎస్‌ఈ, ఈఈలు పాల్గొన్నారు.