చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

కమశిక్షణే.. మన ఆయుధం!

ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో విస్తృత భేటీ

by చైతన్యరధం
Oct 19, 2024 at 6:35am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
చట్టసభల్లో సమభాగం!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రాష్ట్రం, దేశం కోసం పనిచేసే పార్టీ తెదేపా
  • అధికారం మనకు పరమావధి కానే కాదు..
  • ఐదేళ్లలో గత పాలకుల పాపాలు లెక్కలేనన్ని..
  • వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేశారు…
  • కక్ష సాధింపులతో చరిత్ర హీనులుగా మిగిలారు
  • ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మనది
  • మేనిఫెస్టో హామీల గురించి ధైర్యంగా చెప్పండి
  • అమలు చేసినవీ.. చేస్తున్నవీ వివరించండి..
  • ప్రజలు అనుమానించే పరిస్థితి తెచ్చుకోవద్దు
  • కార్యకర్తలకు అండగా ఉండాలి.. న్యాయం చేయాలి
  • ఇసుక, లిక్కర్‌లో ఎవ్వరూ జోక్యం చేసుకోవద్దు..
  • వైసీపీ నేతలు చేసిన తప్పులు మీరూ చేయొద్దు
  • పార్టీకి దిశానిర్దేశం చేసిన అధినాయకుడు చంద్రబాబు
  • ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో విస్తృత భేటీ

అమరావతి (చైతన్య రథం): ‘టీడీపీ ఏనాడూ పదవుల కోసం పని చేయలేదు. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది. అత్యంత శక్తివంతమైన పార్టీగా ఆవిర్భవించింది. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు టీడీపీ కీలక పాత్ర పోషించింది’ అని పార్టీ అగ్రనేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇన్‌ఛార్జిలు, ముఖ్యనేతలతో శుక్రవారం సమావేశమయ్యారు. రాజకీయ క్రమశిక్షణే తెలుగుదేశం పార్టీ అత్యంత శక్తివతమైన ఆయుధమని ఉద్బోధిస్తూ.. వివిధ అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో చంద్రబాబు మట్లాడుతూ…‘125 రోజుల పాలనలో మనం చేసిన మంచి పనులు సమీక్షించుకుని ముందుకెళ్లాలి. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ఎన్డీయే అధికారంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి. పార్టీని సమన్వయం చేసుకోవడంతో పాటు మద్ధతిచ్చిన ప్రజల ఆశలు నెరవేర్చాలి. గత ఐదేళ్లు కార్యకర్తలు అన్ని విధాలా నష్టపోయి, త్యాగాలు చేసి కష్టపడ్డారు. కార్యకర్తలు, నేతలు గత ఐదేళ్లలో పడ్డ ఇబ్బందులు ఎప్పుడూ చూడలేదు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వ్యవస్థలను భ్రష్టుపట్టించారు. ఏ విభాగంలోనూ ఆడిట్‌ చేయలేదు. కేంద్రమిచ్చిన నిధులు దారి మళ్లించారు. ఇప్పుడు నిధులు అడుగుతుంటే గతంలో ఇచ్చిన నిధులకు యూసీలు అడుతున్నారు. పంచాయతీలకు ఇవ్వాల్సిన రూ.990 కోట్లు మళ్లించారు. దీంతో రూ.12 వందల కోట్లు రాకుండా పోయాయి. మనం వచ్చాక రూ.990 కోట్లు చెల్లించడంవల్ల రూ.12 వందల కోట్లు పంచాయతీలకు రాబోతున్నాయి. గత పాలకుల వైఫల్యాలను రాష్ట్ర ప్రజలు గ్రహించారు కనుకే.. మనకు పెద్ద మెజారిటీ ఇచ్చారు. టీడీపీ కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీ కాదు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చాం. దేశ రాజకీయాల్లో కీలక సమయాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించింది. నేషనల్‌ ఫ్రంట్‌, యునైటెడ్‌ ఫ్రంట్‌ ద్వారా ప్రభుత్వాలను ఏర్పాటు చేశాం. ఎలాంటి పదవులు ఆశించకుండా వాజ్‌పేయ్‌ ప్రభుత్వంలో పనిచేశాం. టీడీపీ ఒక విశ్వసనీయత కలిగిన పార్టీ. దేశం కోసం, రాష్ట్రం కోసం మాత్రమే పని చేసింది. ఒక నాయకుడికి, పార్టీకి విశ్వసనీయత రావాలంటే ఎంతో సమయం పడుతుంది. దాన్ని పడగొట్టుకోవాలంటే తక్కువ సమయం చాలు. అది నాకైనా మీకైనా. ప్రతి ఒక్కరం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేద్దాం’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ప్రధాని మోదీ పట్టుదల, కృషి అందరికీ ఆదర్శనీయం
‘ప్రధాని మోదీని చూసి నేర్చుకోవాల్సింది ఆయనకున్న పట్టుదల, కృషి. మూడుసార్లు ప్రధాని అయినా మళ్లీ రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలను దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్నారు. దేశంలో ఎవరికీ రాని విజయం మోదీ సాధించారంటే దాని వెనక కఠోరమైన శ్రమ, క్రమశిక్షణ ఉంది. పార్టీలో ఎవరూ తప్పు చేయకుండా చూసుకుంటున్నారు. రాష్ట్రంలో ఐదేళ్లు అరాచకం జరిగింది. దీంతో అంతా ఇబ్బంది పడ్డారు, బాధలు పడ్డారు. నన్ను కూడా అక్రమంగా జైల్లో పెట్టారు. ఆ సమయంలో పవన్‌ కళ్యాణ్‌ నన్ను కలిసిన అనంతరం కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. బీజేపీ కూడా కలిసి పోటీ చేయడానికి ముందుకొచ్చింది. ఎన్నికల్లో పొలిటికల్‌ సోషల్‌ రీ ఇంజనీరింగ్‌ చేశాం. టీడీపీకి అండగా ఉన్న బీసీలకు ప్రాధాన్యమిచ్చాం. ఒక్కసారి కూడా అసెంబ్లీకిరాని వర్గాలకు సీట్లు ఇచ్చాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడానే నినాదమిచ్చాం. ఇప్పుడు గెలిచాం కాబట్టి మన పని అయిపోయిందని అనుకోకూడదు. పార్టీని నమ్ముకున్న వారికి కూడా పొత్తువల్ల సీట్లు ఇవ్వలేకపోయాం. 65మంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చారు. యువత, చదువుకున్న వారు వచ్చారు. 18మంది కొత్త మంత్రులు ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు 80 మంది దాకా కొత్తవారు ఉన్నారు. పార్టీ కూడా కుటుంబం లాంటిదే. సమస్యలను పరిష్కరించుకుని ముందుకెళ్లాలి. అనుకున్న ఆశయం కోసం మనం పని చేయాలి. వైసీపీ చేయని తప్పు లేదు. ప్రజల్ని బెదిరించారు. అన్ని విధాలా దందాలకు పాల్పడ్డారు. అందుకే ప్రజలు 151 సీట్ల నుండి 11 సీట్లకు పరిమితం చేశారు. వైసీపీ ప్రభుత్వం చేసిన దౌర్జన్యాలు, బెదిరింపులను తట్టుకుని నిలదొక్కుకున్నాం, ఎదిరించాం. ప్రజలకు అండగా ఉన్నాం. అందుకే చరిత్రలోలేని విధంగా 93శాతం స్ట్రైక్‌ రేట్‌తో విజయం సాధించాం. మన ప్రభుత్వంలో కక్షసాధింపులు ఉండవు. అలాగని తప్పు చేసిన వారిని వదిలిపెట్టం. గత ప్రభుత్వం మాదిరి కక్ష సాధింపులకు పాల్పడితే మనకూ వారికీ తేడా ఉండదు. టీడీపీకి కొన్ని కుటుంబాలు అంకితమయ్యాయి. ప్రాణాలను ఫణంపెట్టి పార్టీకి పనిచేసిన వారిని ఎప్పటికీ మర్చిపోను’ అని వ్యాఖ్యానించారు.
బస్తాలకొద్దీ దోచిన సొమ్ము గుమ్మరించినా గెలవలేదు
‘ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉద్యోగాలిస్తామని చెప్పాం. ఆ విధానం ప్రారంభమైంది. డిసెంబర్‌ నాటికి పూర్తవుతుంది. దాదాపు 70 శాతం గ్రీవెన్స్‌ నాకు భూ సమస్యలపైనే వస్తున్నాయి. అందుకే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు చేశాం. యాక్ట్‌ రాకముందే ఇలా జరిగిదంటే వస్తే ఇంకేలా ఉండేదో ఆలోచించాలి. పట్టాదారు పుస్తకంపైనా వారి బొమ్మలు వేసుకున్నారు. హద్దులుదాటి ప్రవర్తించారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.1000 పెంచి పింఛన్లు ఇస్తున్నాం. రూ.6వేలు దివ్యాంగులకు, రూ.10వేలు కిడ్నీ బాధితులకు, పూర్తిగా మంచానికి పరిమితమైన వారికి రూ.15 వేలు అందిస్తున్నాం. అన్న క్యాంటీన్లను 175 ప్రారంభించాం. 203కు పెంచుతాం. ప్రతి నియోజకవర్గంలో ఒక క్యాంటీన్‌ ఏర్పాటు చేస్తాం. నైపుణ్య గణనకు శ్రీకారం చుట్టాం. స్కిల్స్‌ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. 1నే ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు అందిస్తున్నాం. గత మద్యం విధానంలో జరిగిన దోపిడీపై విచారణ చేస్తూనే నూతన మద్యం పాలసీని తెచ్చాం. నూతన ఇసుక పాలసీ తెచ్చాం. అవతలి వారు చేసిన తప్పులు మనం చేస్తే, ప్రజలు అనుమానిస్తే పార్టీ ఇమేజ్‌ దెబ్బతింటుంది. వారసత్వంగా వస్తున్న వ్యాపారం చేసుకుంటే ఏమీ కాదు. కానీ జోక్యం చేసుకుంటే ప్రతిష్ట దెబ్బతింటుంది. వైసీపీ నేతలు బస్తాలు బస్తాలు డబ్బులు దోచుకున్నారు. కోట్లు ఖర్చు పెట్టారు.. గెలిచారా? నమ్మకం లేకపోతే డబ్బుతో ఏ ఎన్నికా జరగదు. డబ్బులతో ఎన్నికలు జరిగితే 93 శాతం సీట్లు వచ్చేవి కాదు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్బోధించారు.
రోడ్లపై వాళ్లు గోతులు పెట్టారు… మనం పూడ్చుతున్నాం
‘విజయవాడద వరద సమయంలో రేయింబవళ్లు పని చేశాం. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలతో వరదలు వచ్చాయి. నీళ్లలోనే నడిచాం. అధికారులను నడిపించాం. ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో స్వచ్ఛందంగా రూ.450 కోట్లపైన విరాళాలను ప్రజలు అందించారు. ఎప్పుడు వరదలొచ్చినా క్యాంప్‌లు పెట్టి వెయ్యి లేదా రెండు వేలు ఇచ్చేవారు. కానీ మొదటిసారి దేశ చరిత్రలో ఒక్కో ఇంటికి రూ.25 వేలు ఇచ్చాం. వరద సమయంలో నీళ్లు, బిస్కెట్లు, పాలు అందించాం. ఆటోకు రూ.10 వేలు, రూ.3 వేలు బైక్‌లకు ఇచ్చాం. డ్రోన్స్‌ ద్వారా ఆహారం అందించాం. దాదాపు 10 రోజులు ఉండి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చాం. 4.15 లక్షల మందికి రూ.618 కోట్లు పరిహారం కింద అందించాం. రైతులకు గత పాలకులు రూ.1674 కోట్లు బకాయిలు పెట్టారు. రాగానే అవి విడుదల చేశాం. రైతుల నుండి ధాన్యం కొంటే 48 గంటల్లోనే డబ్బులు అందించే విధానం మళ్లీ తీసుకొచ్చాం. రూ.4,500 కోట్ల నిధులతో పల్లెపండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పనులు ప్రారంభించాం. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. చేపట్టిన పనులు జనవరికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రాష్ట్రంలోని రోడ్లన్నీ గోతులు పడ్డాయి. వాటి మరమ్మతులకు రూ.290 కోట్లు విడుదల చేశాం. మరో రూ.446 కోట్లు మళ్లీ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. రూ.700 కోట్లు దాదాపు రోడ్లపై గుంతలు పూడ్చడానికి ఖర్చవుతుంది. సంక్రాంతికి ముందే రోడ్ల మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించాం. వాళ్లు గోతులు పెట్టారు. వాటిని మనం పూడ్చే కార్యక్రమం చేపట్టాం’ అని చంద్రబాబు అన్నారు.
చరిత్రలోలేని విధంగా గత పాలకుల కక్ష సాధింపులు
‘రాజకీయాల్లో ఎప్పుడూ చూడని విధంగా గత పాలకులు కక్ష సాధింపులకు పాల్పడ్డారు. పార్టీ కార్యకర్తల ఆస్తులు, ఆదాయ వనరులు నాశనం చేశారు. మన ప్రభుత్వంలో పనులు చేసిన వారికి బిల్లులు ఇవ్వకుండా విజిలెన్స్‌ విచారణ పేరిట నిలిపేశారు. మనం అధికారంలోకి వచ్చాక రూ.259 కోట్లు నీరు`చెట్టు, రూ.50 కోట్లు నరేగాలో పెండిరగ్‌ బిల్లులు ఇచ్చాం. కార్యకర్తలకు న్యాయం చేస్తేనే వారు మనకు అండగా ఉంటారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కార మార్గం చూపాల్సిన బాధ్యత మనపై ఉంది. జాబ్‌ ఫస్ట్‌ విధానంతో దేశంలోనే మొదటిసారిగా ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చేవారికి ప్రోత్సాహకాలు అదనంగా ఇస్తామని చెప్పాం. 10 శాతం అదనంగా ఉద్యోగాలు కల్పించే వారికి ప్రోత్సాహకాలు మరింత ఇస్తామని ప్రకటించాం. ఇండస్ట్రియల్‌ పాలసీ, ఎంఎస్‌ఎంఈ ఎంటర్‌ ప్రెన్యూర్‌ డెవలెప్మెంట్‌ పాలసీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇండస్ట్రియల్‌ పార్క్‌, గ్రీన్‌ ఎనర్జీ…. ఇలా 6 పాలసీలు తీసుకొచ్చాం. సూపర్‌ 6 హామీల్లాగే సూపర్‌ 6 పాలసీలు తెచ్చాం. ఇవి అమలైతే ఏపీ నెంబర్‌ వన్‌గా అవుతుంది. రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ కింద అమరావతిలో హెడ్‌ క్వార్టర్‌, 5 జోన్లలో 5 ఇన్నోవేషన్‌ హబ్‌లు ఏర్పాటు చేస్తాం. ప్రతి ఇంట్లో ఒక వ్యపస్థాపకులుండాలి. రతన్‌ టాటా స్ఫూర్తితోనే ఇన్నోవేషన్‌ హబ్‌ ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్‌ పార్క్‌లు ఏర్పాటు చేస్తాం. ఇందులో రైతులను కూడా భాగస్వాములను చేస్తాం’ అని చంద్రబాబు ప్రకటించారు.
మేనిఫోస్టో హామీల అమలుపై ధైర్యంగా చెప్పండి
‘ఎన్నికల మేనిఫోస్టో అమలుపై ధైర్యంగా చెప్పండి. ఇచ్చిన మాట ప్రకారం చెత్తపన్ను రద్దు చేశాం. మత్య్సకారుల పొట్టగొట్టే 217 జీవో రద్దు చేశాం. స్వర్ణకారులు కార్పొరేషన్‌, గౌడలకు మద్యం షాపుల్లో రిజర్వేషన్లు, అర్చకుల జీతాలు రూ.10 వేలకు పెంపు, నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేలకు వేతనం పెంపు, దీపదీప నైవేద్యాలకు రూ.5 వేల నుండి 10 వేలకు పెంచాం. వేద పాఠశాలల్లో చదువుకున్న వారికి నిరుద్యోగ భృతి రూ.3 వేలు కూడా అందిస్తాం. చేనేత వస్త్రాలకు జీఎస్టీ ఎత్తేయాలని కేంద్రాన్ని కోరతాం. కేంద్రం ఇవ్వకుంటే రీయింబర్స్‌ చేస్తాం. చేనేత కార్మికుల ఇళ్ల నిర్మాణాలకు అదనంగా రూ.50 వేలు అందిస్తాం. పారదర్శక పాలనలో భాగంగా జీవోలు కూడా ఆన్‌లైన్‌లో పెట్టాం. రాజధాని ఒక్కటే ఉంటుంది. అది అమరావతే. విశాఖ ఆర్థిక రాజధానిగా ఉంటుంది. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తాం. ఓర్వకల్లు, ఇండస్ట్రియల్‌ పార్క్‌ అభివృద్ధి చేస్తాం. పోలవరానికి రూ.12,517 కోట్లు మంజూరయ్యాయి. ఫేజ్‌-1ను రెండేళ్లలో పూర్తి చేస్తాం. నదుల అనుసంధానం కూడా మళ్లీ ప్రారంభిస్తాం. 95 శాతం చెరువులు, ప్రాజెక్టులు నీళ్లతో కలకలాడుతున్నాయి. ఎప్పుడూ నిండని రిజర్వాయర్లు నీళ్లతో నిండాయి. ప్రతి ఎకరాకూ నీళ్లిచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం. గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానిస్తాం. ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఎన్టీపీసీ గ్రీన్‌ హైడ్రోజన్‌ కోసం రూ.లక్ష కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు. దీనికి జెన్‌కోను కూడా భాగస్వామ్యం చేస్తున్నాం. రైతులకు డ్రిప్‌లు అందిస్తున్నాం. పాడి రైతులకు 90 శాతం సబ్సీడీతో షెడ్లు నిర్మిస్తున్నాం. రాజధాని రైతులకు రూ.400 కోట్లు బకాయిలు చెల్లించాం. శాంతిభద్రతల విషయంలోనూ ఉక్కుపాదం మోపుతున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీలకు జనాభా దామాషా ప్రకారం పదవులు అందిస్తున్నాం. ఇంటి నిర్మాణానికి రూ.4.30 లక్షలు ఇవ్వడంతోపాటు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడుసెంట్ల స్థలం అందిస్తాం. దీపావళి నుంచి ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకాన్ని అమలు చేస్తాం. ఆదాయంపెంచి సంక్షేమాన్ని అందిస్తాం. వైసీపీ చేసిన అరాచకం భరించలేక ప్రజలు మనల్ని గెలిపించారు. మనల్ని ప్రజలు గెలిపించారు. మళ్లీ గెలవాలంటే ఎన్డీయే చేసే పనులు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రజల సమస్యలకు పరిష్కార మార్గం చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ప్రజాప్రతినిధులకు ఉద్బోధించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 29-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 28-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 27-03-2026

Previous Post

విలువలు వల్లిస్తున్న జగన్జెంత్రీ!?

Next Post

మంత్రి లోకేష్‌ చొరవ పాఠశాలలకు వీడిన నిధుల గ్రహణం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 29-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-03-2026

కార్యకర్త
@ March 29, 2026
చైతన్యరధం ఈ పేపర్ 28-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-03-2026

కార్యకర్త
@ March 28, 2026
చైతన్యరధం ఈ పేపర్ 27-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-03-2026

కార్యకర్త
@ March 27, 2026
ఏలూరు జిల్లా పురోగతిపై
ఆంధ్రప్రదేశ్

ఏలూరు జిల్లా పురోగతిపై

చైతన్యరధం
@ March 26, 2026
చైతన్యరధం ఈ పేపర్ 26-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-03-2026

కార్యకర్త
@ March 26, 2026
పర్యాటక శాఖ చారిత్రాత్మక ఒప్పందం
ఆంధ్రప్రదేశ్

పర్యాటక శాఖ చారిత్రాత్మక ఒప్పందం

చైతన్యరధం
@ March 26, 2026
కుప్పం మున్సిపల్ చైర్మన్ నివాసానికి భువనమ్మ
ఆంధ్రప్రదేశ్

కుప్పం మున్సిపల్ చైర్మన్ నివాసానికి భువనమ్మ

చైతన్యరధం
@ March 26, 2026
శరవేగంగా పర్యాటక ప్రాజెక్టులు
ఆంధ్రప్రదేశ్

శరవేగంగా పర్యాటక ప్రాజెక్టులు

చైతన్యరధం
@ March 26, 2026
Load More

ముఖ్య వార్తలు

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
మాట ఇచ్చాం… అమలు చేశాం!

మాట ఇచ్చాం… అమలు చేశాం!

చైతన్యరధం
@ March 20, 2026
అగ్రస్థానం.. నా సంకల్పం

అగ్రస్థానం.. నా సంకల్పం

చైతన్యరధం
@ March 20, 2026
పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

చైతన్యరధం
@ March 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఏలూరు జిల్లా పురోగతిపై

ఏలూరు జిల్లా పురోగతిపై

చైతన్యరధం
@ March 26, 2026
పర్యాటక శాఖ చారిత్రాత్మక ఒప్పందం

పర్యాటక శాఖ చారిత్రాత్మక ఒప్పందం

చైతన్యరధం
@ March 26, 2026
కుప్పం మున్సిపల్ చైర్మన్ నివాసానికి భువనమ్మ

కుప్పం మున్సిపల్ చైర్మన్ నివాసానికి భువనమ్మ

చైతన్యరధం
@ March 26, 2026
శరవేగంగా పర్యాటక ప్రాజెక్టులు

శరవేగంగా పర్యాటక ప్రాజెక్టులు

చైతన్యరధం
@ March 26, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist