- పల్లె పండుగతో అభివృద్ధికి శ్రీకారం
- విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అద్దంకి(చైతన్యరథం): పంచాయతీలను బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం సర్పంచులను గౌరవిస్తూ పంచాయతీ ఖాతాలలోనే నిధులు జమ చేస్తూ వారికే అధికారాలు కట్టబెట్టిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. జగన్‌రెడ్డి ప్రభు త్వం పంచాయతీ సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చిందని, 15వ ఆర్థిక సంఘం నిధులను లాగేసుకుని గ్రామాల్లో వీధిలైట్ల మరమ్మతులు, బ్లీచింగ్ పౌడర్ చల్లేందుకు కూడా డబ్బులు లేకుండా ఇబ్బందులకు గురి చేసిందని మండిపడ్డారు. పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలలో భాగంగా గురువారం అద్దంకి మండలం మోదేపల్లిలో జరిగిన కార్యక్రమా నికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రూ.30 లక్షల అంచనా వ్యయంతో సుమారు 800 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తుల నుంచి వినతులు స్వీకరించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశిం చారు. పలువురు నూతన వితంతు, వృద్ధాప్య పింఛన్లు కోరుతూ వినతులు అందించగా అతి త్వరలో నూతన పింఛన్ల అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ సందర్భం గా మాట్లాడుతూ అర్హులైన ప్రతిఒక్కరికీ సొంతింటి కల నిజం చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని గృహ నిర్మాణాలు చేపట్టి ప్రతి లబ్ధిదారుడి ఖాతాలో ప్రభుత్వం నుంచి నగదు జమ చేస్తామన్నారు. తిమ్మా యపాలెం నుంచి ఇలపావులూరు వరకు రోడ్డు మరమ్మతులకు రూ.70 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. దీపావళి నుంచి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పథóకాన్ని అమలు చేస్తామని తెలిపారు. గ్రామాలలో పారిశుధ్యంపై శ్రద్ధ చూపాలని, ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశిం చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో అటు రాష్ట్రం, ఇటు నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందన్నారు. అద్దంకి నియోజకవర్గంలో రూ.40 కోట్ల తో పనులకు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. గత జగన్‌రెడ్డి ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్‌ను మరుగునపడేసిందని, నేడు అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు పడే పేద వారికి ప్రభుత్వం దన్నుగా నిలుస్తుందన్నారు.
అలాగే రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షే మం కోసం ఏడు హామీలు అమలు చేసినట్లు తెలిపారు. అవ్వాతాతల పింఛన్ రూ.4 వేల కు పెంపు, మెగా డీఎస్సీ నోటిఫికేషన్, ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీ జీతాలు, పేద లకు రూ.5లకే కడుపునిండా అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పట్టాదారు పాసుపుస్తకంపై రాజముద్ర తదితర హామీలను అమలు చేసి ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా జగన్ రెడ్డి పట్టాదారు పాసు పుస్తకాలపై కూడా తన బొమ్మను ముద్రించుకున్నారని, అది ఆయన ప్రచార పిచ్చికి పరా కాష్ట అని పేర్కొన్నారు. ఇందుకోసం రూ.15 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారని మండిప డ్డారు. పొలాల సరిహద్దు రాళ్లపై కూడా తన బొమ్మను ముద్రించి రూ.700 కోట్ల ప్రజాధ నం దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సొమ్మును సరిగ్గా వినియోగించు కుని ఉంటే రాష్ట్రంలోని ఏదో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేదని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లే నాయకుడు చంద్రబాబు ఒక్కడే అని నమ్మి ప్రజ లు రికార్డు స్థాయిలో సీట్లు అందించారన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రా భివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.