- మంత్రి నారా లోకేష్ నిర్ణయం
- విశాఖలో ప్రాంతీయ గ్రంథాలయం ఆకస్మిక తనిఖీ
విశాఖపట్నం (చైతన్యరథం): రాష్ట్రంలో పబ్లిక్ లైబ్రరీలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. విశాఖ పర్యటనలో రెండోరోజు శనివారం నెహ్రూ బజార్ ప్రాంతీయ గ్రంథాలయాన్ని మంత్రి లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 8 గంటలకు తెరవాల్సిన లైబ్రరీ… 9.45 గంటలకు కూడా మూసివేసి ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయాల బలోపేతానికి మంత్రి లోకేష్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పబ్లిక్ లైబ్రరీల పర్యవేక్షణకు ఒక స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాలని నిర్ణయించారు. విద్యార్థులు, నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి దేశంలోనే బెస్ట్ మోడల్‌ను అధ్యయనం చేసి రాష్ట్రంలో పబ్లిక్ లైబ్రరీల వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు.