- నూతన సంఘాల ఏర్పాటుకు చర్యలు తీసుకోండి
- చేనేతల ఆర్థికాభివృద్ధికి చంద్రబాబు కట్టుబడి ఉన్నారు
- పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి
- వర్షాలతో నష్టపోయిన కార్మికుల వివరాలు ఇవ్వాలి
- బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత ఆదేశం
అమరావతి(చైతన్యరథం): త్వరలో చేనేత సహకార సంఘ ఎన్నికలు నిర్వహించనున్నట్లు బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత వెల్లడిరచారు. ఇందులో భాగంగా నూతన సహకార సంఘాలను ఏర్పాటు చేయడంతో పాటు నిద్రాణస్థితిలో ఉన్న సంఘాలను బలోపేతం చేయాలని ఆదేశించారు. మంగళగిరిలోని హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్స్ కమిషనరేట్‌లో బుధవారం వివిధ జిల్లాలకు చెందిన డీడీలు, ఏడీలతో సమీక్ష నిర్వహించా రు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ చేనేత కార్మికుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు ప్రణాళికలు అమలు చేస్తున్నారన్నారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు, లోకేశ్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా కృషి చేస్తున్నారని వివరించారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ మినహాయింపునకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. చేనేతలకు ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లుగా శిక్షణ అందజేసి తయ్యారైన వస్త్రాలకు మార్కెటిం గ్ సౌకర్యం కూడా కల్పించనున్నామని చెప్పారు. చేనేతకు నగదు రహిత వైద్యమందించేలా బీమా సదుపాయం అమలు చేయనున్నట్టు తెలిపారు. మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. నూలుపై 15 శాతం సబ్సిడీ కూడా అందజేయనున్నామని, ఇవేకాకుండా 2014-19 మధ్య అమలు చేసిన అన్ని పథకాలనూ చేనేతలకు అమలు చేస్తామని వెల్లడిరచారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు ముద్రా రుణాలపై చేనేత కార్మికులకు వ్యక్తిగత, సామూహిక రుణాలు ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతమున్న టెక్స్‌టైల్స్ పార్కులను అభివృద్ధి చేయడంతో పాటు చీరాలలో నూతన టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. రాష్ట్రంలో చేనేత రంగ అభి వృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు పథకాలపై చేనేతలకు అవ గాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా రాష్ట్రంలో నూతన సహకార సంఘాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, నిద్రాణస్థితిలో ఉన్న సంఘా లను బలోపేతం చేయాలని ఆదేశించారు. త్వరలో చేనేత సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించనున్నామని వెల్లడిరచారు. ఇందుకోసం చేనేత, జౌళిశాఖాధికారులు సమ న్వయంతో పనిచేయాలని సూచించారు. ఏయే జిల్లాల్లో ఎన్నెన్ని నూతన సంఘాలు ఏర్పాటు చేయబోతున్నారో మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో చేనేత కార్మికులు ఎంతమేర నష్టపోయారో నివేదికలివ్వాలని ఆయా జిల్లాల ఏడీలు, డీడీల ను ఆదేశించారు. అనంతరం మంత్రి సవితను చేనేత, జౌళిశాఖాధికారులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, అడిషనల్ డైరెక్టర్ శ్రీకాంత్ ప్రభాకర్, జేడీ కన్నబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.