- వారం, పదిరోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తాం
- ప్రభుత్వ నిర్ణయానికి అధికారులు సహకరించాలి
- ఆన్‌లైన్‌లో రాకపోతే ఆఫ్‌లైన్‌లో అందించాలి
- బోట్స్‌మ్యాన్ సొసైటీ సభ్యులకు బిల్లులు చెల్లిస్తాం
- గత ప్రభుత్వ పెండిరగ్ బిల్లులపై చర్చించి నిర్ణయం
- జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు
- వాడపల్లి, ఔరాంగాబాద్ రీచ్‌లలో ఆకస్మిక తనిఖీలు
కొవ్వూరు(చైతన్యరథం): ప్రజలకు పూర్తిస్థాయిలో ఉచిత ఇసుక అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి, తూర్పుగోదావరి జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మండలంలో వాడపల్లి, ఔరాంగాబాద్ ఇసుక రీచ్‌లను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. బోట్స్ మ్యాన్ సొసైటీ సభ్యులతో సమస్యల పై చర్చించారు. త్వరితగతిన చెల్లింపుల కోసం ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. నదీ ప్రవాహం తగ్గిన వెంటనే ఓపెన్ రీచ్‌లు అందుబాటులోకి తీసుకురావడం జరుగు తుందని వివరించారు. ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే ఇసుకను ఉచితంగా ప్రజలకు అందించే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. గత ప్రభు త్వంలో ఇష్టానుసారం ఇసుక దోపీడీ చేసిందన్నారు. నేషనల్ ట్రిబ్యునల్, పొల్యూషన్ కం ట్రోల్ బోర్డ్ అభ్యంతరాలు ఉండటం వల్ల కొన్ని ఇసుక ర్యాంపులను ప్రారంభించలేకపో యామని చెప్పారు. ఆ కారణంగానే ప్రారంభించిన ఇసుక ర్యాంపులపైనే ఒత్తిడి ఉండటం క్షేత్రస్థాయి పరిశీలనలో గమనించడం జరిగిందని పేర్కొన్నారు. బోట్స్‌మ్యాన్ సొసైటీ సభ్యు లతో తీసుకువచ్చే ఇసుకను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండే విధంగా, సమస్యను పరిష్కరించి వినియోగదారులకు అందించే విధంగా చర్యలు తీసుకోవ డం జరుగుతుందన్నారు. ఇంకా గోదావరిలో, అటు కృష్ణానదిలో వరద ప్రభావం ఉందని దీనిని అధిగమించి వినియోగదారులకు పూర్తిస్థాయిలో ఇసుకను అందజేస్తామన్నా రు. ఓపెన్ రీచ్‌లు కూడా ప్రారంభమైతే వినియోగదారుల డిమాండ్ తగ్గట్టుగా అందరికీ అందుబాటులో ఇసుక ఉంటుందనే విషయాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. వినియోగ దారులకు డిమాండ్‌కు అనుసరించి ఇసుకను అందుబాటులో ఉండేలా రెవెన్యూ, ఇరిగేషన్, మైన్స్ అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని ఆదేశించడం జరిగిందని చెప్పారు.
అందుబాటులో ఇసుక రీచ్‌లు
గత ప్రభుత్వం రూ.30 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్లను ఇసుకపై అక్రమ ఆదా యాన్ని సమకూర్చుకుందన్నారు. నేడు ఉచిత ఇసుక అందించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అందరూ సహకరించాలని మంత్రి కోరారు. వినియోగదారులు వారి అవసరాలకు అనుగు ణంగా ట్రాక్టర్లు, ఎడ్లబండ్లపై ఇసుకను ఉచితంగా తీసుకువెళ్లొచ్చని, ఈ విధానానికి అను గుణంగా క్షేత్రస్థాయిలో అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరద నీరు తగ్గిన తర్వాత మరో వారం, పదిరోజుల్లో ఓపెన్ రీచ్‌లను పూర్తిస్థాయిలో ఇసుకను అందుబాటు లోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. సముద్ర తీరప్రాంతంలో 50 కి.మీ దూరంలో ఇసుకను తవ్వేందుకు ఎన్జీటీ వారి ఉత్తర్వుల మేరకు అనుమతులు లేవన్నారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు అవసరమైన ఇసుక కొవ్వూరు, రాజమండ్రి నుంచి వినియోగదా రులకు అందుబాటులో ఉందని తెలిపారు. ఇసుక రీచ్‌లను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చేలా కలెక్టర్, మైన్స్ శాఖకు ఆదేశాలు జారీచేయడం జరిగిందని చెప్పారు. ప్రజలకు పూర్తిస్థాయిలో ఉచిత ఇసుకను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆ దిశగా ప్రతిరోజు ఇసుక ర్యాంపులను పరిశీలించడం జరుగుతుందని వివరించారు.
పెండిరగ్ బిల్లులపై చర్చించి నిర్ణయం
గత ప్రభుత్వంలో తవ్విన ఇసుకకు సంబంధించి పెండిరగ్‌లో ఉన్న బిల్లులను ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బోట్స్ మ్యాన్ సొసైటీలకు అక్టోబర్ 13 నుంచి రావాల్సిన పెండిరగ్ బిల్లులు చెల్లించేలా అధికారులను స్పష్టంగా ఆదేశించడం జరి గిందన్నారు. ఇసుకను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే వారు రాకపోతే ఆఫ్‌లైన్‌లో వచ్చిన వారికి అందించేలా అధికారులు సహకరించాలన్నారు. వాడపల్లి ఇసుక ర్యాంపు ద్వారా ప్రతిరోజు 5 వేల టన్నులు బయటకు వెళ్లే పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈ ప్రక్రియను కొనసాగించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. దీనివల్ల డిమాండ్ తగ్గి సరఫరా పెరుగుతుంద ని మంత్రి స్పష్టం చేశారు. అన్ని రీచ్‌లలో ఇసుకను మార్కెట్‌లోకి పంపించడం వల్ల డిమాం డ్ తగ్గి సరఫరా పెరుగుతుందని, తద్వారా బ్లాక్ మార్కెటింగ్‌ను కూడా నిరోధించవచ్చునని పేర్కొన్నారు. తనిఖీల్లో ఆయన వెంట జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, ఎమ్మెల్యేలు ముప్పిడి వెంక టేశ్వరరావు, బత్తుల బలరామకృష్ణ, జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్న రాముడు, ఆర్డీవో కృష్ణ నాయక్, రాణి సుస్మిత, మైన్స్ ఏడీ డి.ఫణిభూషణ్ రెడ్డి, పోలవరం సీఈ నరసింహమూర్తి, ఇరిగేషన్ ఎస్‌ఈ జి.శ్రీనివాసరావు, కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.