- సంపద సృష్టి అంటే రూ.11 లక్షల కోట్ల అప్పా?
- విధ్వంస పాలనతో భ్రష్టు పట్టించి నీతులు చెబుతారా?
- కూటమి ప్రభుత్వంలో శరవేగంగా పోర్టుల నిర్మాణం
- తీరప్రాంత అభివృద్ధి కోసం పెద్దఎత్తున ప్రాజెక్టులు
- మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తిచేసి చూపిస్తాం
- గృహనిర్మాణ, ఐపీఆర్ మంత్రి కొలుసు పార్థసారథి
అమరావతి(చైతన్యరథం): సంపద సృష్టి అటుంచి రాష్ట్రాన్ని ఐదేళ్లలో విధ్వంసం వైపు తీసుకెళ్లిన వైసీపీ నేతలు ఇప్పుడు నీతులు వల్లించడం హాస్యాస్పదంగా ఉందని గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల మంత్రి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తా రు. ఐదేళ్లలో రాష్ట్రానికి సాధించిందేమి లేదు..రూ.11 లక్షల కోట్ల అప్పు తప్ప అని మం డిపడ్డారు. కూటమి ప్రభుత్వం పోర్టుల నిర్మాణం కోసం పట్టుదలగా ఉందని, 2025 డిసెంబరుకు బందరు పోర్టు నిర్మాణం పూర్తి అవడం ఖాయమని తెలిపారు. తమ ప్రభుత్వ ప్రయత్నాల గురించి కేంద్రమంత్రి సోనోవాల్ స్వయంగా పార్లమెం టులో ప్రస్తావించిన విషయాన్ని గుర్తుచేశారు. మీ హయాంలో ఒక్క చిన్న పోర్టు పని అయినా అయిందా? అని ప్రశ్నించారు. ఆరు పెద్ద పోర్టుల పనులు వేగంగా పుంజు కున్నాయి..నాలుగు కొత్త పోర్టులు సిద్ధమవుతున్నాయి..తీరప్రాంత ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. నాలుగు కొత్త ఓడరేవుల నిర్మాణం వేగవంతం కావడం, ప్రస్తుతం ఉన్న ఆరు ఓడరేవుల నుంచి ఎగుమతులు గణనీయం గా పెరగడంతో రాష్ట్రం మెరైన్ లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని బలోపేతం చేసుకునే ప్రయత్నం కొనసాగుతోందన్నారు. నాలుగు కొత్త పోర్టులు వివిధ దశల్లో ఉన్నాయని వివరిం చారు.
రూ.2,123 కోట్లతో స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)కి అప్పగించిన కాకినాడ సెజ్ పోర్టు అభివృద్ధి ప్రాజెక్టులో డ్రెడ్జింగ్, బ్రేక్ వాటర్ రివిట్‌మెంట్, బెర్తులు, పోర్టు భవనాలు, రోడ్లు, రైల్వేలైన్, పోర్ట్ క్రాఫ్ట్ బెర్త్ తదితర సౌకర్యాలను కల్పించారు. నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్టును రూ.3,736 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో రూ.5,155 కోట్లతో చేపట్టిన మచిలీపట్నం పోర్టు అభివృ ద్ధి ప్రాజెక్టు మొదటి దశ, శ్రీకాకుళం జిల్లాలో రూ.4,362 కోట్లతో మూలపేట పోర్టు (గతంలో భావనపాడు పోర్టు) అభివృద్ధి ప్రాజెక్టు పనులు కూడా కొనసాగుతున్నాయి. సాగరమాల ప్రాజెక్టు కింద కాకినాడ యాంకరేజ్ పోర్టులో రూ.91 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సాగర్‌మాల నుంచి సుమారు రూ.43 కోట్లు, ఏపీఎంబీ నుంచి రూ.48 కోట్లు వస్తున్నాయి.
మొదటి దశలో రూ.1,523 కోట్లతో నాలుగు ఫిషింగ్ హార్బర్లు, రూ.1,595 కోట్లతో రెండో దశలో ఆరు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి పెట్టుబడులు పెడుతున్నట్లు తెలియదా? అని ప్రశ్నించారు. ఓడరేవుల అభివృద్ధి, తీరప్రాంత బెర్తులు సహా వివిధ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రం నుంచి రూ.3,300 కోట్ల విలువైన 29 కొత్త ప్రతిపాదనలు పోర్టులు, షిప్పింగ్, జలరవాణా మంత్రిత్వ శాఖకు అందాయని స్వయంగా కేంద్రమంత్రి సోనోవాల్ పార్ల మెంటుకు తెలిపిన విషయం తెలియదా అని ప్రశ్నించారు. వీటిలో రో-పాక్స్, ప్యాసింజర్ జెట్టీ లు, ఫిషింగ్ హార్బర్లు, పోర్టుల ఆధునికీకరణ, నైపుణ్యాభివృద్ధి తదితర ప్రాజెక్టులు ఉన్నాయని, ఈ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం మంత్రిత్వ శాఖ ఇప్పటికే రూ.450 కోట్లు మంజూరు చేసిందని సోనోవాల్ చెప్పారన్నారు. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ, ఇన్ లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యూఏఐ) సంయుక్తంగా రూ. 4,600 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో 36 ప్రాజెక్టులను చేపట్టాయని తెలిపారు.
2025 డిసెంబరు నాటికి బందరు పోర్టు పూర్తి
మచిలీపట్నం పోర్టు నిర్మాణం 2025 డిసెంబర్‌ు నాటికి పూర్తవుతుంది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మచిలీపట్నంలో పోర్టు పనులను పరిశీలిం చారు. రాజధాని అమరావతికి దగ్గరగా ఉన్న దృష్ట్యా ఈ పోర్టును ‘క్యాపిటల్ పోర్టు’గా అభివృద్ధి చేయడం మా ప్రభుత్వ విజన్‌కు సంకేతం. మచిలీపట్నం మంగినపూడి వద్ద సుమారు 1,145 ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణ పనులను 2014-19లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రారంభించగా, వైసీపీ ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టింది. కానీ కూట మి ప్రభుత్వం పోర్టులను పూర్తి చేసి చూపిస్తుందని స్పష్టం చేశారు. సంపద సృష్టిం చడం ఎలాగో చూడండి..మేం త్వరలో మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేసి చూపిస్తా మని తెలిపారు. మీది ఆరంభ శూరత్వం.. మాది పనిచేసే మంచి ప్రభుత్వం ..ప్రజలకు మీరే సమాధానం చెప్పుకోవాలి..సిద్ధంగా ఉండాలి మరి అని హితవు పలికారు.