- పేద విద్యార్థుల చదువుకు వైసీపీ తిలోదకాలు
- భూమి సాగుచేసుకోన్వికుండా వైసీపీ నేతల బెదిరింపులు
- టీడీపీ కేంద్ర కార్యాలయంలో పెద్దఎత్తున బాధితుల అర్జీలు
- వినతులు స్వీకరించిన మంత్రి కొండపల్లి, నేతలు
అమరావతి (చైతన్యరథం): గతంలో వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అండతో న్యాయవాదిగా ఉన్న తనపై అక్రమ కేసులు పెట్టి ఆ పార్టీ నేతలు ఇబ్బంది పెట్టారని, పోలీసులు వారికి సహకరిస్తూ.. తననే బెదిరిస్తున్నారని కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం మేకడోణ గ్రామానికి చెందిన అడ్వకేట్ డి. చంద్రయ్య…టీడీపీ నేతలకు ఫిర్యాదు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి పీతల సూజాత, టీడీపీ వాణిజ్యవిభాగం అధ్యక్షుడు డూండి రాకేష్‌లు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అర్జీ ఇచ్చిన చంద్రయ్య.. తనపై పెట్టిన అక్రమకేసులను పరిశీలించి తొలగించేలా చూడాలని.. అక్రమార్కులకు సహకరిస్తున్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
వైసీపీ నేతలు తన స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతూ.. తమపై దాడులు చేస్తున్నారని, గొడవలకు దిగుతున్నారని.. వైసీపీ నేతల నుండి తమ స్థలాన్ని విడిపించి తల్లిదండ్రులు లేని తమకు న్యాయం చేయాలని విజయవాడకు చెందిన దాసరి కుమారి విజ్ఞప్తి చేశారు.
సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా.. పేదల చదువులకు, వారి ఉన్నతికి ఉపయోగపడే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని గత ప్రభుత్వం రద్దు చేసి పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేసిందని.. తిరిగి పథకాన్ని ప్రారంభించి పేద విద్యార్థుల చదువుకు ప్రభుత్వం సహకరించాలని దళిత హక్కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చింతాడ జోగారావు..నేతలకు అర్జీ ఇచ్చి విన్నవించారు.
కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం భూడుగుంటపల్లి గ్రామానికి చెందిన మురళి బాబురావు విజ్ఞప్తి చేస్తూ.. తనకు తన పిత్రార్జితంగా వచ్చిన భూమిని సాగు చేసుకోనివ్వకుండా వైసీపీ నేతలు కొలవల సుబ్బరామిరెడ్డి, కొలవల సుబ్రహ్మణ్యం రెడ్డి, మావిల్ల విజయ్ కుమార్ రెడ్డి అడ్డుకుంటున్నారని.. ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని నేతలకు ఫిర్యాదు చేశాడు.
తన కొడుకు, కోడలు వెళ్లగొడితే రోడ్డుమీద గుడిపక్కన బతుకుతున్నానని.. తనవద్ద ఉన్న బ్యాగ్‌ను ఇద్దరు మహిళలు కొట్టేశారని.. దానిలో మూడు లక్షల డబ్బులు, నాలుగు సవర్ల బంగారం ఉందని. తనను కొట్టి బ్యాగ్ తీసుకెళ్లిన మహిళలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని.. తనకు న్యాయం చేయాలని చిలకలూరిపేటకు చెందిన గోపుదేశి కోటేశ్వరమ్మ విజ్ఞప్తి చేశారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 2021, మార్చి 21న వీఆర్‌ఏల నుండి వీఆర్‌ఓ`జీఆర్ 2 ప్రమోషన్ నిమిత్తం కౌన్సిలింగ్ పూర్తి చేసుకున్న తమకు ఇంకా పదోన్నతి కల్పించలేదని.. అర్హులైన తమకు ప్రమోషన్ ఇప్పించాలని పలువురు వీఆర్‌ఏలు గ్రీవెన్స్ లో విజ్ఞప్తి చేశారు.
ప్రకాశం జిల్లాకు చెందిన దాదాపు 25 వేల మంది ణ.వస(ూGు) అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తూ.. తాము దాదాపు 4 సంవత్సరాల నుండి ణూజ కోసం ఎదురు చూస్తూ సన్నద్ధమవుతున్నామని.. తీరా జిల్లాలో 80 పోస్టులకు మించి ఖాళీలు లేవని చూపిస్తున్నారని.. మిగతా జిల్లాల్లో పోలిస్తే.. ప్రకాశం జిల్లాలో చాలా తక్కువ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారని, ఎక్కువ టీచర్ పోస్టులను ప్రకటించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సంస్కృత ఉపాధ్యాయ పోస్టులు మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని పలువురు విన్నవించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయితీలో ఈ-పంచాయతీ డేటా ఏంట్రీ ఆపరేటర్లుగా పనిచేస్తున్న తమకు మినిమం టైం స్కేల్ అమలుచేయాలని.. జీతం నేరుగా ప్రభుత్వం ద్వారా ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని వారు నేతలకు అర్జ్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశారు.
తమకు 2022 నుండి రావాల్సిన రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, పీఆర్సీ, డీఏ, టెర్మినల్ బెనిఫిట్స్ ఇప్పించి తమను ఆదుకోవాలని AూజుఔIణజకి చెందిన పలువురు రిటైర్డ్ ఉద్యోగులు గ్రీవెన్స్‌లో నేతలను అర్జీ ఇచ్చి విన్నవించుకున్నారు.
కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం ఆముదార్లంక గ్రామానికి చెందిన పలువురు మత్స్యకారులు విజ్ఞప్తి చేస్తూ.. ఇటీవల వచ్చిన వరదల్లో తమ వలలు, పడవలు కృష్ణానదిలో కొట్టుకుపోవడంతో తాము తీవ్రంగా నష్టపోయి తమ జీవనాధారం కోల్పోయామని.. తమను ప్రభుత్వం ఆదుకోవాలని విన్నవించుకున్నారు
ఎస్సీ మాల నిరుపేద కుటుంబానికి చెందిన తనకు జీవన భృతికోసం ప్రభుత్వ భూమి రెండు ఎకరాలు కేటాయించాలని గత 20 సంవత్సరాల నుండి తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని.. తనకు భూమిని కేటాయించాలని బాపట్ల జిల్లా అద్దంకికి చెందిన రామయోగి..మంత్రికి వినతి ఇచ్చి అభ్యర్థించారు.
ప్రశ్నాపత్రంలో ఉన్న పొరపాట్ల వలన తమకు మార్కులు తగ్గి.. ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న కానిస్టేబుల్ నియామక దేహదారుఢ్య పరీక్షల్లో తమకు అర్హత లభించలేదని.. మార్కులను కలిపి తమను కూడా దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని పెద్దఎత్తున తరలివచ్చిన బాధిత అభ్యర్థులు.. నేతలకు విన్నవించారు.