చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

గల్ఫ్‌ బాధితుల జీవితాల్లో యువనేత వెలుగులు

జీవితాంతం రుణ పడి ఉంటామంటున్న అభాగ్యులు

by చైతన్యరధం
Nov 11, 2024 at 6:55am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
గల్ఫ్‌ బాధితుల జీవితాల్లో యువనేత వెలుగులు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఎడారిలో కష్టాల నుంచి
  • విముక్తి కల్పించిన మంత్రి లోకేశ్‌
  • జీవితాంతం రుణ పడి ఉంటామంటున్న అభాగ్యులు

అమరావతి (చైతన్యరథం) : రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి అధికారంతో సంబంధం లేకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ నేటి యువతకు కాదు కాకలు తీరిన ప్రజా ప్రతినిథులకు కూడా రాష్ట్ర విద్య, ఐటీి శాఖల మంత్రి నారా లోకేష్‌ రోల్‌మోడల్‌గా నిలుస్తున్నారు. సమస్య ఎంత పెద్దదైనా, ఎంత జఠిలమైనదైనా తన దృష్టికి వచ్చిన వెనువెంటనే స్పందించడం, పరిష్కారమయ్యే వరకు వెంటపడడంలో తనకు తానే సాటి అనిపించుకుంటున్నారు. ప్రజాసేవలో మంత్రి లోకేష్‌ నిబద్ధత, చిత్తశుద్ధికి నిలవెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. చాలీచాలని ఆదాయాలతో బతుకుభారంగా మారిన కొందరు సగటు జీవులు కష్టాల కడలి నుంచి గట్టేందుకు ఎడారి దేశాలకు వెళ్లి ఏజంట్ల చేతిలో మోసపోతున్నవారికి నేనున్నానంటూ వారికి ఆపన్నహస్తం హస్తం అందించారు యువనేత లోకేష్‌. ఏజంట్ల మోసానికి గురై గల్ఫ్‌ లో చిక్కుకున్న దాదాపు 20 మందిని స్వస్థలాలకు రప్పించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు. తాము ఇబ్బందుల్లో ఉన్నామని వాట్సాప్‌, ట్విట్టర్‌, ఫేస్‌ బుక్‌ వంటి సోషల్‌ మీడియా వేదికల ద్వారా ఇచ్చిన మెసేజ్‌ వచ్చిందటే చాలు వెంటనే మెరుపువేగంతో స్పందించారు. కేవలం ప్రభుత్వ పరంగానే గాక తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా పనిచేసే ఎన్‌ఆర్‌ఐ టీటీపీి బృందాలను రంగంలోకి దించి ఎడారి కష్టాల నుంచి గట్టెక్కించారు. అక్కడ తాము ఎదుర్కొన్న దుర్భర పరిస్థితులను తలచుకుంటున్న బాధితులు ముగిసి పోయిందనుకున్న తమ జీవితాలకు మంత్రి లోకేష్‌ ప్రాణం పోశారని మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నారు. ప్రజాసేవ చేయాలంటే కేవలం అధికారం మాత్రమే ఉంటే సరిపోదు. ప్రజల కష్టాలను తన కష్టంగా భావించే మంచి మనసుకూడా ఉండాలని నిరూపించారు మంత్రి నారా లోకేష్‌.

మంత్రి లోకేష్‌ కు జీవితాంతం రుణపడి ఉంటా!
ఆర్థిక పరిస్థితి బాగోలేక కుటుంబాన్ని పోషించుకోవడం కోసం కువైట్‌ వెళ్లాను. కనుచూపు మేరలో ఎటువంటి జనావాసాలు లేని ఎడారి ప్రాంతంలో గుర్రాలు, ఒంటెలు, కుక్కులు వంటి పెంపుడు జంతువులకు ఆహారం, నీరు అందించే పని నాకు ఇచ్చారు. అక్కడ ఏర్పాటుచేసిన భారీ షెడ్లలో ఉండటానికి ఎటువంటి కనీస సౌకర్యాలు లేవు. 50డిగ్రీలకు పైగా మండే ఎండల్లో నీటి కోసం నేను 2కి.మీ.ల దూరం వెళ్లాల్సివచ్చేది. నాకు సరిగా భోజనం కూడా పెట్టేవారు కాదు. నా భార్య, బిడ్డలు గుర్తొచ్చి కళ్లు కాయలు కాచేలా ఏడ్చేవాడ్ని. అక్కడ నా గోడు వినే నాథుడే లేడు. నా జీవితం ఆ ఎడారిలోనే ముగిసిపోతుందని అనుకున్నాను. నా కష్టాలను సెల్‌ ఫోన్‌ లో వీడియో తీసి రాష్ట్రంలో ఉన్న నా మిత్రులకు పంపాను. సోషల్‌ మీడియా ద్వారా నా కష్టాలను తెలుసుకున్న మంత్రి లోకేష్‌ వెంటనే స్పందించారు. వారి టీమ్‌ నేను ఉన్న ప్రాంతాన్ని కనుగొన్నారు. ఏజంట్లు నన్ను మోసం చేసిన విషయాన్ని వారికి చెప్పాను. వెంటనే వారు ఎంబసీతో మాట్లాడి నన్ను స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేశారు. నన్ను కువైట్‌ ఎడారి కష్టాలనుంచి బయటకు తెచ్చి పునర్జన్మ నిచ్చిన మంత్రి లోకేష్‌ కు జీవితాంతం రుణపడి ఉంటాను.
– చింతపర్తి శివ,
వాల్మీకిపురం మండలం, అన్నమయ్య జిల్లా.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 04-02-2026

చైతన్యరధం ఈ పేపర్ 03-02-2026

చైతన్యరధం ఈ పేపర్ 02-02-2026

ముక్కు, నోట్లో నుంచి రక్తంపడినా కనికరించలేదు
ఇక్కడ చాలీచాలని ఆదాయంతో బిడ్డలను పోషించుకునే దారిలేక హౌస్‌ మెయిడ్‌ పనికోసం ఏజెంట్‌ ద్వారా ఒమన్‌ వెళ్లాను. అక్కడకు వెళ్లాక రేయింబవళ్లు పనిచేయించేవారు. ముక్కు, నోటి నుంచి రక్తం వచ్చినా నన్ను పట్టించుకునేవారు లేరు. ఆ సమయంలో బిడ్డలు గుర్తొచ్చి కుమిలికుమిలి ఏడ్చాను. ఏజంట్లు నన్ను మోసం చేసిన విషయాన్ని నా మామ, మరిదిలకు ఫోన్‌లో తెలియపర్చాను. నేను ఫోన్‌ లో మాట్లాడుతున్నానని తెలిసి నా ఫోన్‌ కూడా లాగేసుకున్నారు. మా కుటుంబసభ్యులు రాజానగరంలో టీడీపీ నాయకుల ద్వారా విషయాన్ని మంత్రి లోకేష్‌కు చేరవేశారు. వెంటనే ఆయన ఒమన్‌లోని ఎన్‌ఆర్‌ఐ టీడీపీి నాయకులకు చెప్పడంతో వారు నేను ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. తొలుత లక్ష రూపాయలు ఇస్తేగానీ నన్ను వెనక్కి పంపనని అక్కడ ఏజంట్‌ చెప్పారు. తర్వాత ఆ దేశంలోని ఎన్‌ఆర్‌ఐ టీడీపీ నాయకులు ఏజెంటు, ఎంబసీతో మాట్లాడి నన్ను స్వస్థలానికి పంపించారు. ఆ నరకం నుంచి మళ్లీ ఇంటికి రావడానికి మంత్రి లోకేష్‌ చేసిన సాయం నా జీవితాంతం గుర్తుంటుంది.
-కొత్తపల్లి ప్రియాంక,
రఘునాథపురం, రాజానగరం మండలం.

చీకటిగదిలో బంధించారు
వారం రోజుల పాటు నరకం చూశా
దుబాయ్‌ సేట్‌ ఇంటిలో వంట పనికోసమని చెబితే ఏజంటు ద్వారా మస్కట్‌ వెళ్లాను. అక్కడకు వెళ్లగానే నా ఫోను, పాస్‌ పోర్టు లాగేసుకున్నారు. మూడు రోజులకు ఒకసారి మాత్రమే నా కుటుంబ సభ్యులతో ఫోన్‌ మాట్లాడనిచ్చేవారు. భారీ బిల్డింగ్‌ మూడు ఫ్లోర్లను శుభ్రం చేయడం, వంటపని, పిల్లలను చూసుకునే పనులన్నీ నా ఒక్కదానితోనే విశ్రాంతి లేకుండా చేయించేవారు. సమయానికి సరైన భోజనం కూడా ఉండేది కాదు. నేను పడుతున్న కష్టాలను కుటుంబ సభ్యులకు తెలియజేయగా, వారి ద్వారా మస్కట్‌లోని ఎంబసీకి ఫిర్యాదు చేశాను. ఈ విషయం తెలుసుకొని వారంరోజుల పాటు నన్ను చీకటిగదిలో బంధించారు. అక్కడి ఏజంట్‌ నాపై చేయికూడా చేసుకున్నారు. నా కుటుంబసభ్యులు నా సమస్యను మంత్రి లోకేష్‌ దృష్టికి తీసుకెళ్లడంతో, అక్కడ ఉన్న వాళ్ల టీమ్‌ సభ్యులు ఎంబసీద్వారా ఏజంటుతో మాట్లాడి నన్ను విడిపించి స్వదేశానికి రప్పించారు. నేను స్వస్థలానికి వచ్చి రెండు నెలలైంది. భీమవరంలోని ఒక హాస్పటల్‌ లో నర్సుగా పనిచేస్తున్నాను. మంత్రి లోకేష్‌ చేసిన సాయాన్ని నేను, నా కుటుంబసభ్యులు ఎప్పటికీ మర్చిపోము. ఆయనకు మా కృతజ్ఞతలు.
-చిగురుపాటి బేబి,
భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా.

మళ్లీ తిరిగి వస్తానని అనుకోలేదు
వంట పనికోసమని చెబితే ఏజంట్‌ ద్వారా కువైట్‌ వెళ్లాను. తీసుకెళ్లేటపుడు నెలకు రూ.52వేల జీతం అని చెప్పారు. అక్కడకు వెళ్లాక హౌస్‌ మెయిడ్‌ పని అప్పగించారు. నేను మోసపోయానని అర్థమైంది. రోజుకు 20గంటలకు పైగా పనిచేయించేవారు. నెలరోజులు గడిచాక 22వేలు మాత్రమే ఇచ్చారు. మోసపోయిన విషయాన్ని నా భర్తకు తెలియజేశాను. కారిడార్‌, లాన్లు శుభ్రం చేయడంతోపాటు ప్రతిరోజూ 13 బాత్రూమ్‌ లు కడిగించేవారు. విరామం లేకుండా పనిచేయడంతో ఎడమ చేయి నరం దెబ్బతింది. అక్కడ 3సార్లు హాస్పటల్‌ కు తీసుకెళ్లినా నయం కాలేదు. నేను పడుతున్న ఇబ్బందులను నా భర్తకు చెప్పడంతో ఆయన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిగారి ద్వారా మంత్రి లోకేష్‌బాబు దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న వెంటనే ఆయన ఎపి ఎన్‌ఆర్‌ఐ టీడీపీ నాయకులను అలర్ట్‌ చేశారు. కువైట్‌ లో ఉన్న ఎన్‌ఆర్‌ఐ టీడీపీ వారు ఎంబసీ, ఏజెంట్లతో మాట్లాడి నన్ను స్వస్థలానికి పంపించే ఏర్పాట్లు చేశారు. అక్కడ తీవ్ర అనారోగ్యం పాలైన నేను ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉండి ట్రీట్‌ మెంట్‌ తీసుకుంటున్నాను. మళ్లీ తిరిగి వస్తానో, రానోనని తీవ్ర ఆందోళనకు గురైన నన్ను ఇక్కడకు రప్పించడానికి చొరవ చూపిన మంత్రి లోకేష్‌ బాబుకు మా కుటుంబం రుణపడి ఉంటుంది.
-నమిడి ప్రమీల,
అనపర్తి, తూర్పుగోదావరి జిల్లా.

లోకేష్‌ బాబు చొరవ వల్లే తిరిగి రాగలిగాను
ఇంట్లో పని కోసమని చెప్పి సౌదీ తీసుకెళ్లారు. అక్కడకు వెళ్ళాక ఎడారిలోకి గొర్రెలు, ఒంటెలకు కాపలా పెట్టారు. సరైన భోజనం ఉండేదికాదు. నోటివెంట రక్తం పడిరది, పట్టించుకునే దిక్కులేదు. నా దుస్థితిని సెల్‌ ఫోన్‌లో వీడియో తీసి మిత్రులకు పంపాను. వారు ట్విట్టర్‌ ద్వారా మంత్రి లోకేష్‌ బాబుకు తెలియజేశారు. వెంటనే ఆయన స్పందించి ఎన్నారై టీడీపీి వారిని నా వద్దకు పంపారు. ఎంబసీతో మాట్లాడి నన్ను మళ్ళీ స్వస్థలానికి రప్పించారు. లోకేష్‌ బాబు చొరవ చూపకపోతే తిరిగి వచ్చేవాడిని కాదు. ఆయన మేలు జీవితంలో మర్చిపోలేను.
-సరెళ్ళ వీరేంద్ర కుమార్‌,
ఇసుకపూడి, అంబాజీపేట మండలం.

Previous Post

జగన్‌ ట్వీట్లు… నిజాలకు తూట్లు

Next Post

మరో అడుగు ముందుకి..!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 04-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 04-02-2026

కార్యకర్త
@ February 4, 2026
చైతన్యరధం ఈ పేపర్ 03-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-02-2026

కార్యకర్త
@ February 3, 2026
చైతన్యరధం ఈ పేపర్ 02-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-02-2026

కార్యకర్త
@ February 2, 2026
గంగజాతర ముందే మొదలైంది!
ఆంధ్రప్రదేశ్

గంగజాతర ముందే మొదలైంది!

చైతన్యరధం
@ February 2, 2026
ఈ ఏడాదిలో రాష్ట్రమంతటా సంజీవని
ఆంధ్రప్రదేశ్

ఈ ఏడాదిలో రాష్ట్రమంతటా సంజీవని

చైతన్యరధం
@ February 2, 2026
టీటీడీ ఇవోగా ముద్దాడ రవిచంద్ర
ఆంధ్రప్రదేశ్

టీటీడీ ఇవోగా ముద్దాడ రవిచంద్ర

చైతన్యరధం
@ February 2, 2026
యువరక్తంతో..పార్టీ మరింత బలోపేతం
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర పునర్నిర్మాణాన్ని జీర్ణించుకోలేకనే  వైసీపీలో ఫ్రస్టేషన్ 

చైతన్యరధం
@ February 2, 2026
పార్టీ కోసం పనిచేస్తే.. అండగా ఉంటా!
చైతన్యరధం

పార్టీ కోసం పనిచేస్తే.. అండగా ఉంటా!

చైతన్యరధం
@ February 2, 2026
Load More

ముఖ్య వార్తలు

పార్టీ కోసం పనిచేస్తే.. అండగా ఉంటా!

పార్టీ కోసం పనిచేస్తే.. అండగా ఉంటా!

చైతన్యరధం
@ February 2, 2026
సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రీఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు

కేంద్ర బడ్జెట్.. వికసిత భారతానికి ఊతం

చైతన్యరధం
@ February 2, 2026
అన్ని రంగాల్లో నెం.1గా ఏపీ..అదే మా లక్ష్యం

అన్ని రంగాల్లో నెం.1గా ఏపీ..అదే మా లక్ష్యం

చైతన్యరధం
@ January 31, 2026
ప్రాజెక్ట ల  పూర్తిలో..దేశంలోనే మేటిగా ఏపీ నిలవాలి

ప్రాజెక్ట ల పూర్తిలో..దేశంలోనే మేటిగా ఏపీ నిలవాలి

చైతన్యరధం
@ January 30, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మానవతామూర్తికి మహాసత్కారం!

మానవతామూర్తికి మహాసత్కారం!

చైతన్యరధం
@ November 4, 2025 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

గంగజాతర ముందే మొదలైంది!

గంగజాతర ముందే మొదలైంది!

చైతన్యరధం
@ February 2, 2026
ఈ ఏడాదిలో రాష్ట్రమంతటా సంజీవని

ఈ ఏడాదిలో రాష్ట్రమంతటా సంజీవని

చైతన్యరధం
@ February 2, 2026
టీటీడీ ఇవోగా ముద్దాడ రవిచంద్ర

టీటీడీ ఇవోగా ముద్దాడ రవిచంద్ర

చైతన్యరధం
@ February 2, 2026
యువరక్తంతో..పార్టీ మరింత బలోపేతం

రాష్ట్ర పునర్నిర్మాణాన్ని జీర్ణించుకోలేకనే  వైసీపీలో ఫ్రస్టేషన్ 

చైతన్యరధం
@ February 2, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist