- తప్పుడు ప్రచారం చేస్తే తాటతీస్తాం
- ఎవ్వరినీ వదలి పెట్టే ప్రసక్తి లేదు
- వివేకంతో స్పందించాలని జగన్‌కు సూచన
- సోషల్ మీడియా సైకోలకు హోంమంత్రి హెచ్చరిక
అమరావతి (చైతన్య రథం): సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ వైకాపా నేతలు ఎలాంటి వ్యక్తులకు మద్దతిస్తున్నారో ఆలోచించుకోవాలన్నారు. కొందరి పోస్టులు చూస్తే దారుణంగా ఉన్నాయన్నారు. జడ్జిలు, వారి కుటుంబ సభ్యులను కూడా నోటికి వచ్చినట్టు వాళ్లు పెట్టిన పోస్టులపై కోర్టు కూడా మొట్టికాయలు వేసింది. తిరుపతి జిల్లాలో జరిగిన ఘటనపై తప్పుడు ప్రచారం చేశారు. ఆ తర్వాత పోస్టులు డిలీట్ చేశారని అయినా, వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. కేసులు నమోదు చేస్తామన్నారు. మహిళలను ఏదైనా అంటే రాయలసీమ వాసులు ఊరుకోరు, కానీ సొంత తల్లినీ, చెల్లినీ తిట్టినవారిని జగన్ ఏంచేయలేకపోయారని ఎద్ధేవా చేశారు. మీ తల్లినీ, చెల్లినీ తిట్టిన ఉన్మాదులను మేం అరెస్టులు చేస్తున్నాం’’ అని హోం మంత్రి జగన్‌ను ఉద్ధేశించి మంత్రి పేర్కొన్నారు.
ఎలాంటి వారికి మీరు మద్దతిస్తున్నారో ఆలోచించుకోవాలన్నారు. కొందరు పోస్టులు చూస్తే దారుణంగా ఉన్నాయని, వాళ్లు పెట్టిన పోస్టులపై కోర్టు కూడా మొట్టికాయలు వేసిందని గుర్తు చేశారు. ఇలాంటి పోస్టులు పెట్టినవారిని ఏం చేయాలో ప్రజలే చెప్పాలన్నారు. గతంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అనేకమంది టీడీపీ నేతలపై కేసులు పెట్టారని గుర్తు చేశారు. ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ఎక్కడికి వెళ్లినా తాము అడ్డుకోవడం లేదన్నారు. సోషల్ మీడియా సైకోలను ఇలాగే వదిలేస్తే రేపు మీ ఇంట్లోని ఆడపిల్లలపైనా పోస్టులు పెడతారని వైసీపీ నేతలను హెచ్చరించారు. -జగన్‌కు ఉన్న పది మంది ఎమ్మెల్యేలు కూడా ఆయనకు సహకరించడం లేదన్నారు. సోషల్ మీడియా పోస్టులపై వైసీపీ నేతలు హెచ్‌ఆర్‌సీకి వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు. వర్రా రవీంద్రరెడ్డి, బోరగడ్డ అనిల్, ఇంటూరి రవి.. సమాజంలో తిరగడానికి వీల్లేదని హెచ్చారించారు.
ఇలాంటి నీచులను ప్రోత్సహించడం ఎంత ప్రమాదమో ప్రజలు ఆలోచించాలన్నారు. క్షమించరాని పోస్టులు పెట్టిన వారికి మద్దతిస్తున్న వైసీపీ నేతలను ఏమనాలని ప్రశ్నించారు. నేరంలో భాగస్వామ్యం ఉందన్నట్లు వైవీ సుబ్బారెడ్డి చొరవ తీసుకున్నారా? అని నిలదీశారు. రాజకీయ ముసుగు తీసి ప్రజల ముందు నిలబెట్టే ప్రభుత్వం కూటమిదని గుర్తంచుకోవాలని హెచ్చరించారు. పుంగనూరు, తిరుపతిలో బాలికల ఆత్మగౌరవం దెబ్బతినేలా ప్రకటనలు చేసిన వారిపై చర్యలు కఠినంగాను ఉంటాయన్నారు. ఆడపిల్లలపై నోటికొచ్చినట్లు మాట్లాడేవారిపై కేసులు పెడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ప్రత్యేక చట్టం తేవడంపైనా తమ ప్రభుత్వం దృష్టి సారించిదని వెల్లడిరచారు.