- ఫేజ్`1, 2 ప్రతిపాదనలు వైసీపీ ప్రభుత్వమే పంపింది
- దానినే కేంద్ర జలశక్తి కార్యదర్శి ఆమోదించారు.
ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) స్పష్టత ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టులో రెండు దశల ప్రస్తావనే లేదని తేల్చి చెప్పింది. ఆర్టీఐ కార్యకర్త ఇనుగంటి రవికుమార్ ఆర్టీఐ కింద 14 అంశాలపై అడిగిన సమాచారానికి పీపీఏ సమాధానం ఇచ్చింది. ప్రాజెక్టుకు సంబంధించి ఎత్తు అంశంలో అసలు రెండు దశల ప్రస్తావనే లేదు. అయితే ఎత్తుకు సంబంధించి 2021లో వైసీపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను కేంద్రం ఆమోదించినట్లు వెల్లడిరచింది. నిధుల రియింబర్స్‌కు ప్రాజెక్టును రెండు దశలుగా విభజించాలని కేంద్రాన్ని అప్పటి వైసీపీ ప్రభుత్వం కోరింది. నిర్వాసితుల పునరావాసం కోసం రెండు దశలుగా విభజించి పనులు చేయాలని గత ప్రభుత్వం సిఫారసు చేసింది. 41.15 మీటర్ల ఎత్తు వరకు మొదటి దశ, 45.72 మీటర్లకు రెండో దశ అని అప్పటి ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది. ఈ సిఫారసుతోనే జలశక్తి కార్యదర్శి తొలి ఫేజ్ కింద నిధులు ఆమోదించారు. దీనివల్ల ప్రాజెక్టులో తొలి ఫేజ్ అనేది తెరపైకి వచ్చిందని పీపీఏ వివరణ ఇచ్చింది.
ప్రాజెక్ట్ గైడ్‌బండ్ కుంగుబాటుకు సంబంధించి.. మట్టి తీయడం వల్లే అది కుంగిపోయిందని పీపీఏ తెలిపింది. నిపుణుల ప్యానల్ సిఫారసు మేరకు కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలని పీపీఏ స్పష్టం చేసింది. ఈ నవంబర్ నుంచి వచ్చే ఏడాది జులై మధ్య దీన్ని పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. పోలవరం ప్రాజెక్టుకు వాటిల్లిన నష్టం అంచనాతో పాటు పరిష్కార మార్గాల కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు పీపీఏ వివరించింది. కటాఫ్ వాల్, గౖౖెడ్‌బండ్, డిఫెక్ట్ లయబులిటీ కాలపరిమితి కింద ఉన్నాయని తెలిపింది. ఒప్పందం నిబంధనల మేరకు కాంట్రాక్టర్ ఖర్చుతో తిరిగి నిర్మించాలని పీపీఏ వెల్లడిరచింది.