- హాజరైన మఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం
- కన్నీటిపర్యంతమైన బంధువులు, అభిమానులు
చంద్రగిరి (చైతన్య రథం): భవబంధాలను తెంచుకుని నారా రామ్మూర్తినాయుడు దిగ్దిగంతాలకు వెళ్లిపోయారన్న సమాచారాన్ని నారావారిపల్లె ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. నారావారిపల్లెలో గురువారం రామ్మూర్తినాయుడి కర్మక్రియలు గంభీర వాతావరణంలో సాగాయి. శోకతప్త హృదయాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం సమక్షంలో `రామ్మూర్తినాయుడి కుమారుడు నారా రోహిత్ కర్మక్రియలు నిర్వహించారు. సోదరుడి కర్మక్రియలకు చంద్రబాబు సహా ఆయన సతీమణి భువనేశ్వరి, ఐటీ మంత్రి లోకేశ్‌తోపాటు నారా కుటుంబసభ్యులు హాజరయ్యారు. మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్‌తో పాటు పలువురు తెదేపా ఎమ్మెల్యేలు, నేతలు కర్మక్రియలకు హాజరై ఘన నివాళి అర్పించారు.
నారా ఖర్జూరనాయుడు, అమ్మణ్ణమ్మ దంపతులకు 1952లో జన్మించిన మలిచూరు బిడ్డ నారా రామ్మూర్తినాయుడు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి చంద్రగిరి ఎమ్మెల్యేగా ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజాభిమానం సంపాదించుకున్న రామూర్తినాయుడు `గత 14న అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటూ కన్ను మూసిన విషయం తెలిసిందే. కర్మక్రియలకు హాజరైన బంధుజనం, అభిమానవర్గం.. పెద్దదిక్కును కోల్పోయామన్న బాధను వ్యక్తం చేయడం గమనార్హం.