అమరావతి (చైతన్య రథం): వ్యవసాయంతోపాటు అనుబంధ సంస్థలను వైకాపా ప్రభుత్వం నాశనం చేసిందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వ్యవసాయంపై చర్చకు వచ్చే ధైర్యం వైకాపా నేతలకు ఉందా? అని ప్రశ్నించారు. గతంలో ధాన్యం సేకరించి రైతులకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదని.. ఇప్పుడు ప్రకృతి విపత్తులు, తుపానులకు దెబ్బతిన్న ధాన్యాన్ని సైతం కూటమి ప్రభుత్వం సేకరిస్తోందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.