- ఫ్యాక్టరీల్లో ప్రమాదాల నివారణకు వసుధా మిశ్రా కమిటీ
- 10-15 రోజుల్లో నివేదిక రాగానే తక్షణమే చర్యలు
- పరిశ్రమల భద్రతా ప్రమాణాలపై కఠినంగా ఉంటాం
- అందాల్సిన ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తాం
- ఈఎస్ఐ ఆస్పత్రుల్లో అవినీతిపై విజిలెన్స్ విచారణ
- కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడి
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలోని కార్మికుల భద్రత, సంక్షేమం, ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్స్, ఇన్సూ రెన్స్ మెడికల్ సర్వీసెస్ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్మా గారాల్లో ప్రమాదాల నివారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా వసుధా మిశ్రా కమిటీని ఏర్పాటు చేశారన్నారు. ఈ కమిటీ రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలను పరిశీలించి ప్రభుత్వానికి త్వరలోనే నివేదిక అందజేసే అవకాశముందని, అది అందిన వెంటనే తగు చర్యలు చేపడతామని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశంతో కార్మిక శాఖపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ మందుకువెళ్లడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో 96 డిస్పెన్సరీలు, 4 ప్రాంతీయ ఆస్పత్రులు, 4 డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నా యన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే యలమంచిలి, గుణదలలో ఈఎస్ ఐ ఆస్పత్రులను ప్రారంభించామన్నారు. అదేవిధంగా రాజధాని అమరావతిలో 150, 500 పడకల ఆస్పత్రికి, కర్నూలు, నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఈఎస్ఐ ఆస్పత్రుల ఏర్పాటుకు కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందన్నారు. త్వరలోనే ఇవి అన్నీ కార్యరూపం దాల్చేలా చర్యలు చేపడతామని వివరించారు.
గత ప్రభుత్వంలో ఈఎస్ఐ ఆసుపత్రులపై నిర్లక్ష్యం
గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ఈఎస్ఐ ఆస్పత్రులను నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ఈ ఆసుపత్రుల నిర్వహణకు కేంద్రం నుంచి ఏడాదికి దాదాపు రూ.400 కోట్లు వరకూ నిధులు వస్తాయని, అయితే వాటిలో రూ.1.60 కోట్లను మాత్రమే విని యోగించుకుని మిగిలిన సొమ్మును గతంలో వెనక్కు పంపినట్లు చెప్పారు. ఈ విధంగా గత ఐదేళ్లలో దాదాపు రూ.610 కోట్లు వెనక్కు వెళ్లిపోవడం జరిగిందన్నారు. గత ప్రభు త్వంలో ఈఎస్ఐ ఆసుపత్రుల్లో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ చేయిస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈఎస్ఐ ఆస్పత్రులను అన్నింటినీ గాడినపెట్టే చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో సేఫ్టీ ఆడిటింగ్ ఏజెన్సీలు కలెక్షన్ ఏజెన్సీలుగా మారిపోయాయన్నారు. ఫ్యాక్టరీలపై తప్పుడు కేసులు పెట్టి వారి నుంచి పెద్దఎత్తున డబ్బులు గుంజుకునే ప్రయత్నం చేశారన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఎసెన్షియా ప్రమాదంలో 15 మంది చనిపోయారని తెలిపారు. అటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఫ్యాక్టరీల్లో పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా కర్మాగార, భవన నిర్మాణ కార్మికులకు అన్నివిధాలుగా సహకారం అందేలా చూస్తామని, వారికి చట్టప్రకారం అందాల్సిన ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తామని వివరించారు.