- ద్వారంపూడి కాకినాడకు ఎస్కోబార్‌లా మారారు
- ఆఫ్రికా దేశాలకు బియ్యం తరలించి దండుకున్నారు
- జగన్‌రెడ్డి ముఠా అక్రమాలను బట్టబయలు చేస్తాం
- టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్
మంగళగిరి(చైతన్యరథం): జగన్‌రెడ్డి ఈ రాష్ట్రానికి ఎస్కోబార్ అయితే..కాకినాడకు ఎస్కోబార్ ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి.. ఆయన అవినీతి కార్యక్రమాల గురించి చెప్ప డం మొదలుపెడితే రోజంతా చాలదని టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్ మండిపడ్డారు. పేదల బియ్యం మాఫియాలో ద్వారంపూడి చంద్రశేఖర్ ది అందెవేసిన చెయ్యి.. తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి నుంచి అనంతపురం వరకు ఆరు లైన్ల హైవే నిర్మాణం కోసం కృషి చేస్తుంటే..రాష్ట్రం నుంచి ఆఫ్రికాకు పేదల బియ్యా న్ని రవాణా చేయడానికి వైసీపీ నాయకులు ముందుండటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. వైసీపీ పాలన ఐదేళ్ల కాలంలో రాష్ట్రానికి ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాలేదు.. పేదల బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చే పరిశ్రమలు మాత్రం అనేకం వెలిశాయన్నారు. కాకినాడ మిల్లర్లలో పెద్ద దందా జరుగుతుందన్న ఆయన ఏడాదిన్నర క్రితం టీడీపీ నాయకులు ఆ పరిసరాలను పరిశీలించడానికి వెళితే వైసీపీ గూండాలు అడ్డుపడ్డ విష యాన్ని గుర్తుచేశారు. పేదల బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసిన ఘనత వైసీపీ ప్రభు త్వానికే దక్కుతుందని వ్యాఖ్యానించారు.
కేంద్ర బియ్యాన్ని మళ్లించారు
2023లో ప్రతి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం బియ్యాన్ని ఎలాట్ చేస్తే అందులోనూ అవినీతికి పాల్పడి 89 వేల మెట్రిక్ టన్నుల బియ్యం అక్రమ రవాణా చేశారని తెలిపారు. 2020-21లో నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల పేదల బియ్యం అక్రమ రవాణా, ఆ తరువాత సంవత్సరం 5 లక్షల మెట్రిక్ టన్నుల పేదల బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తర లిందని వివరించారు. రేషన్‌బియ్యం కోసం ప్రభుత్వం రూ.11 వేల కోట్లు ఖర్చు పెడు తుంది.. ప్రతి ఏడాది 2.14 లక్షల టన్నుల బియ్యం సరఫరా అవుతోంది. .వైసీపీ నాయ కులు ప్రతి ఏడాది వాటిని బ్లాక్ మార్కెట్‌కు ఆఫ్రికాకు పంపుతూ వచ్చారు ..వందల కోట్లు దోచుకున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు బియ్యాన్ని వారికి అందించి మన్ననలు పొందింది. ఇటీవల పేదల బియ్యాన్ని ఎగుమతి చేస్తుండగా 14 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పట్టుకున్నారు. గతంలో సరళా ఫుడ్స్, విఎస్ రాజు వీరందరి వద్ద 2,500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. గోదాముల్లో 2,800 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. ఇలాంటి వ్యవహారాల్లో ఆరితేరిన వైసీపీ ప్రభు త్వాన్ని గుర్తించి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక వీటిని కట్టడి చేయాలనే ఉద్దేశంతో కాకినాడ పోర్టు వద్ద బియ్యం లోపలికి వెళ్లకుండా ఆపే కార్యక్రమం చేస్తుంటే దీన్ని వైజాగ్ పోర్టు నుంచి ఎగుమతి చేయడానికి సంసిద్ధుల య్యారు. డిప్యూటీ సీఎం వైజాగ్ చుట్టుపక్కల తనిఖీలు నిర్వహించి బియ్యం పట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. పేదలకు పంచే బియ్యాన్ని విదేశాలకు తరలిపోకుండా ఆపే ప్రయత్నం చేస్తోంది టీడీపీ ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వం చెడగొట్టిన వ్యవస్థలను గాడిలో పెట్టడానికి కూటమి ప్రభుత్వానికి ఆరు నెలలు పట్టింది. పేదల బియ్యాన్ని పంది కొక్కుల్లా మెక్కిన జగన్‌రెడ్డి ముఠా బాగోతాన్ని బట్టబయలు చేస్తామని స్పష్టం చేశారు.