- రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి అగాధంలోకి నెట్టావు
- సంపదను సృష్టించడం రాదు..దోచేయడమే తెలుసు
- తోక పత్రికలో ప్రజలను మభ్యపెట్టేందుకే తప్పుడు రాతలు
- నాడు చంద్రబాబు విజన్ 2020 ఫలితమే నేడు సైబరాబాద్
- నేడు విజన్ 2047 పేరుతో రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు
- చంద్రబాబు ట్రేడ్‌మార్క్ సంపద సృష్టి..పేటెంట్ విజన్
- బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్‌కుమార్
మంగళగిరి(చైతన్యరథం): విజన్ డాక్యుమెంట్ 2047ను డొల్ల డాక్యుమెంట్‌గా జగ న్‌రెడ్డి కరపత్రిక సాక్షి రాయడంపై బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ మండిపడ్డారు. విజన్ అంటే తెలియని జగన్‌రెడ్డి విజన్ డాక్యుమెంట్‌పై మాట్లాడ టం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. విజన్ అనేది చంద్రబాబు పేటెంట్.. ఎకనామిక్ ప్లానింగ్ అనేది చంద్రబాబు నైపుణ్యం.. సంపద సృష్టి అనేది చంద్రబాబు ట్రేడ్ మార్క్ అని విశ్లేషించారు. ఇవేమీ జగన్‌రెడ్డికి చేతకాదు..అందుకే తోక పత్రికలో తప్పుడు రాత లతో ప్రజలను మోసం చేసేందుకు, మభ్య పెట్టేందుకు చూస్తున్నాడని ధ్వజమెత్తారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1998 జనవరి 26న చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ విడుదల చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించారు..మళ్లీ నేడు 2047 పేరుతో రాష్ట్రాభివృ ద్ధికి విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. అనాడు విజన్ 2020 అంటే నవ్వారు..ఆ విజన్ ఫలితమే నేటి సైబరాబాద్..ఆ సైబరాబాదే ఉమ్మడి రాష్ట్రంలోని 294 నియోజక వర్గాల్లో ఉన్న రైతు బిడ్డలు 34 లక్షల మందికి పైగా ఉద్యోగాలను కల్పించింది..కొన్ని వందల కంపెనీలు వచ్చాయి..నేడు తెలంగాణా మొత్తాన్ని సైబరాబాద్ పోసిస్తుందంటే అతిశయోక్తి కాదన్నారు. ఆ విజన్ 2020 వలనే స్వాతంత్య్రం వచ్చిన 50 ఏళ్ల వరకు రాష్ట్రంలో 5 వేల మెగావాట్లు ఉన్న విద్యుదుత్పత్తి.. కేవలం తొమ్మిదేళ్లలోనే 10 వేల మెగావాట్లకు చేరింది. ఈ విజన్ 2020తోనే చాలా సాగునీటి ప్రాజెక్టులు కట్టాం. ఈ విజన్ 2020 వలనే లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాం..సంపద సృష్టి జరిగింది. మహిళా సాధికారత అన్నది వచ్చింది. చంద్రబాబు సృష్టించిన విజన్ డాక్యుమెంట్ వలనే అప్పటివరకు ఒక మామూలు రాష్ట్రంగా ఉన్న ఏపీ దేశంలోనే టాప్ 5 రాష్ట్రాల్లో ఒకటి చేరిందని పేర్కొన్నారు.
రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టిన చరిత్ర జగన్‌ది
అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని చీకట్లలోకి నెట్టిన జగన్‌కు విజన్ గురించి ఏమి తెలుసు. 2047 నాటికి మనకు స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు అవుతుంది. 100 ఏళ్ల స్వాతంత్య్ర భారతావనిలో మనం ఎక్కడ ఉన్నాం, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండబోతు న్నాం అనేది క్రోడీకరిస్తూ విజన్ 2047 డాక్యుమెంట్‌ను తయారు చేశాం. అధికారంలోకి రాకముందు నుండే రాష్ట్ర శ్రేయస్సు కోసం ఎలా ముందుకు వెళ్లాలి అని ప్రణాళికలు వేసుకుని అధికారం వచ్చాక ఆ ప్రణాళికలకు మెరుగులు దిద్దాం. పేదరికం నిర్మూలించ డమే చంద్రబాబు లక్ష్యం. సీఎం పదవిపై యావ తప్ప జగన్‌రెడ్డికి రాష్ట్ర ప్రజల శ్రేయ స్సు, రాష్ట్రాభివృద్ధి పట్టదు. చంద్రబాబుకు సంపద సృష్టించే శక్తి లేదని జగన్‌రెడ్డి చెప్ప డం విడ్డూరంగా ఉంది. రాష్ట్ర విభజన తరువాత 2014లో రాష్ట్ర ఆదాయం రూ. 29,857 కోట్లు మాత్రమే 2019 నాటికి రాష్ట్ర ఆదాయం రూ.58 వేల కోట్లు పెరిగింది. ఇది నాడు వైసీపీ విడుదల చేసిన వైట్ పేపర్‌లోనే ఉంది. దాదాపు 98% వృద్ధిని మేము సాధించాం. 2019 నుంచి 2024 మధ్య మీరు సాధించిన వృద్ధి రేటు కేవలం 63% మాత్రమే.
ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేసి సంపద సృష్టించారా?
రాజధానిని స్మశానంగా మార్చి వృద్ధిని పాతాళంలోకి నెట్టిన మీరు సిగ్గులేకుండా మళ్లీ సంపద సృష్టి గురించి మాట్లాడుతున్నారు. మీ మాదిరి ఢల్లీికి వెళ్లి అప్పులు అడుక్కో వడం మా నేతలకు తెలియదు. 25 సంవత్సరాల తరువాత ఎలా ఉండాలో ఈరోజు ఆలోచించడమే మా విజన్…అది జగన్‌కు అసలు అర్థం కాదు తెలియదు. సంపద సృష్టించామని చెబుతున్నారు. వైసీపీ నేతలు తెచ్చిన కంపెనీలు ఏమిటో..ఏమి సంపద సృష్టించారో దమ్ముంటే చెప్పండి? మేము కియా, హెచ్‌సీఎల్, అశోక్ లైలాండ్ వంటి గొప్ప గొప్ప కంపెనీలను తీసుకువచ్చి ఉద్యోగ కల్పనకు, సంపద సృష్టికి కృషి చేశాం. ఒక్క సాగునీటి ప్రాజెక్టునైనా పూర్తి చేసి సంపద సృష్టించారా? మేము పూర్తి చేసిన ఒక్క పట్టిసీమ వలనే దాదాపు రూ.6 వేల కోట్ల సంపద సృష్టి జరిగింది. జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో పెట్టుబడి వ్యయం ఏమైనా ఉందా? పెట్టుబడులకోసమని అప్పులు తీసుకుని చేసింది ఏంటి? జగన్‌రెడ్డి ఆర్బీఐ ద్వారా తీసుకున్న అప్పుల నుండి 2019 -20లో పెట్టిన పెట్టుబడి 34%, 2020 -21లో 36%, 2021 -22లో 32%, 2022 -23లో 14% మాత్రమే పెట్టుబడిగా పెట్టారు. 2023 -24లో 39% ఖర్చుపెట్టారు.. ఉదా: రూ.100 అప్పు తీసుకుంటే కేవలం రూ.14 మాత్రమే పెట్టుబడిగా ఖర్చు పెట్టా రు. ఇలా అయితే ఎక్కడ నుంచి వస్తుంది వృద్ధి, సంపద? మేము అధికారంలోకి వచ్చిన 2014 -2015లో 33%, 2015 -2016లో 66%, 2016 -2017లో 51%, 2017 -2018లో 57%, 2018 -2019 లో 57% శాతం తీసుకున్న అప్పుల్లో ఖర్చు పెట్టాం. మేము తెచ్చిన డబ్బుల్లో 66% వృద్ధి, పెట్టుబడుల మీద ఖర్చు పెట్టాం. మొత్తం జీఎస్‌డీపీలో ఏనాడూ మా అప్పులు 29% మించి దాటలేదు. మీ ఐదేళ్ల పాలనలో జీఎస్ డీపీలో చేసిన అప్పు 35% ఉంది.
విద్య గురించి మాట్లాడే అర్హత ఉందా?
పిల్లల ఫీజులు కూడా కట్టకుండా రూ.4,200 కోట్లు ఎగ్గొట్టి విద్యార్థులను ఇబ్బంది పెట్టిన మీరు అసలు విద్య గురించి మాట్లాడే అర్హత ఉందా? 34 మంది ఉండే లిక్విడ్ ఇంగ్లీష్ ఎడ్జ్ ప్రైవెట్ లిమెట్ అనే సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చి దోచిపెట్టాలని చూశారు. ప్రవీణ్ ప్రకాశ్ లాంటి వ్యక్తులను అడ్డుపెట్టుకుని కాంట్రాక్టులు పిలవకుండా రూ.1000 కోట్లను విద్యా కానుకలో దోచేశారు. ఐదు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లిపోయారు. ఐదేళ్లలో ఒక్క టీచర్‌ను రిక్రూట్ చేయలేదు. స్కూళ్లకు మాత్రం రంగులు వేసి దోచుకున్నారు. బైజూస్‌కు కోట్లు కట్టబెట్టారు. ఆ బైజూ స్ రవీంద్రన్ నేడు దేశం విడిచి పారిపోయాడు. బైజూస్ దివాలా తీసింది. మళ్లీ అధికా రంలోకి వైసీపీ వచ్చి ఉంటే విద్యార్థుల బతుకు రోడ్డున పడేది. వైసీపీ చేస్తున్న పనులను ప్రచారం చేసేందుకు పీఆర్ ప్రొఫెసనల్ గ్రూప్స్‌కు రూ.40 కోట్లు కట్టబెట్టారు. ఇలాంటి మీరు విద్య గురించి మాట్లాడటం సిగ్గుచేటు. మా విజన్ డాక్యుమెంట్‌లో 20% విద్య కోసమే ఉంది.. అలాంటి డాక్యుమెంట్‌ను డొల్ల డాక్యుమెంట్ అనడం వైసీపీ నేతల విజ్ఞ తకే వదిలేయాలి.
మెడికల్ కాలేజీలు కట్టకుండా అబద్ధాలు
మేము 17 మెడికల్ కాలేజీలు పెట్టామని డప్పుకొట్టారు. అవి ఎక్కడ ఉన్నాయో చూపించాలి. మీరు కట్టింది ఐదు మెడికల్ కాలేజీలు మాత్రమే. అవి కూడా అరకొరగా చేశారు. 12 మెడికల్ కాలేజీలకు ఫౌండేషన్ కూడా వేయకుండా కట్టామని నిస్సిగ్గా ఎలా అబద్ధాలు చెబుతున్నారు? అసలు విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసింది మీరే. నా ఎస్టీ, నా బీసీ అంటూ మాయమాటలు చెప్పి ఆయా వర్గాలకు విద్యను దూరం చేసి పైస లు ఇచ్చిన వారికే మెడికల్ సీట్లు ఇచ్చారు. రూ.1100 కోట్లతో మంగళగిరిలో కేంద్రం ఎయిమ్స్‌ను 17 నెలల్లో పూర్తి చేసినప్పుడు మీరు 17 మెడికల్ కాలేజీలను ఎందుకు కట్టలేకపోయారు డప్పు కొట్టుకోవడం తప్ప. 17 మెడికల్ కాలేజీలకు మీరు చెప్పిన అంచనా మొత్తం రూ.8,480 కోట్లు. ఇందులో రూ.3,672 కోట్లు నాబార్డ్ రుణంగా ఇచ్చింది. కేంద్రం రూ.975 కోట్లు ఇచ్చింది. అలాగే ఆరోగ్య శ్రీ నిధులను కూడా మళ్లించారు. ఇందులో జగన్‌రెడ్డి కాలేజీల నిర్మాణం కోసం చేసిన ఖర్చు కేవలం రూ.2,125 కోట్లు మాత్రమే. అందులో కూడా రూ.1400 మాత్రమే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారు. మిగిలిన డబ్బులు ఎగ్గొట్టారు. అందులో కూడా పీజీ సీట్లు ఉన్న కాలేజీలకు కేంద్రం రూ.700 కోట్లు ఇచ్చింది అంటే నికరంగా జగన్‌రెడ్డి కాలేజీల నిర్మాణానికి ఖర్చు పెట్టింది కేవలం రూ.700 కోట్లు మాత్రమే. పదే పదే అబద్ధాలు చెబితే జనాలు నమ్ముతారు అనుకుంటున్నారా జగన్‌రెడ్డి? ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్ల మెరిట్ కోటా భర్తీకి తిలోదకాలు ఇచ్చి ఏ,బీ,సీ కేటగిరీలు అంటూ సెల్ఫ్ ఫైనాన్స్‌కు తెచ్చి సీట్లు అమ్ముకున్నది మీరు కాదా? అని ప్రశ్నించారు.
రైతులను నెలల తరబడి తిప్పుకున్నారు..
ఆర్బీకేల ద్వారా ఏదేదో చేశామని బీరాలు పలుకుతున్నారు. గత సంవత్సరం వైసీపీ ప్రభుత్వం కొన్న ధాన్యం కేవలం 8 లక్షల టన్నులు మాత్రమే. నిన్నటివరకు మేము కొనుగోలు చేసిన ధాన్యం 18 లక్షల టన్నులు. మేము 48 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేశాం. జగన్ పాలనలో ధాన్యం డబ్బుల కోసం రైతులు నెలల తరబడి ఎదురు చూసేవారు. విజన్ 2047 ప్రణాళిక అంటూ బహిరంగంగా పెట్టాం. చేతిలో పేపర్ ఉందని ఏది పడితే అది రాయడం.. అది నిజమో కాదో కూడా తెలియకుండా జగన్‌రెడ్డి మాట్లాడటం అనైతిక చర్య. జగన్ రెడ్డి ఇప్పటికైనా అసెంబ్లీకి రావాలి. ప్రజల సమస్యలపై చర్చించాలి. కాని అబద్ధపు రాతలు, అబద్ధపు మాటలు మానుకోవాలని హితవుపలికారు.