- గ్రామం మొత్తానికి టీడీపీ సభ్యత్వం
- రికార్డు సృష్టించిన మాజీమంత్రి పరిటాల సునీత
అనంతపురం (చైతన్యరథం): ఎన్ని కష్టాలు ఎదురైనా ఎత్తిన పసుపు జెండా దించకుండా నాలుగు దశాబ్దాలుగా ప్రజాసేవలో నిమగ్నమైంది పరిటాల కుటుంబం. అరాచక శక్తులకు ఎదురొడ్డి ప్రాణాలను ఫణంగా పెట్టిన దివంగత మాజీ మంత్రి పరిటాల రవి స్వగ్రామం.. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని వెంకటాపురం. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో సరికొత్త రికార్డు దిశగా ముందుకు దూసుకు వెళుతోంది. ఈ నేపథ్యంలో వెంకటాపురంలో పరిటాల రవి సతీమణి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సరికొత్త రికార్డు సృష్టించారు. వెంకటాపురం గ్రామంలో మొత్తం 581 ఓట్లకు గాను 13 మంది అనారోగ్యం, ఇతర కారణాలతో చనిపోయారు. గ్రామంలో ప్రస్తుతం ఓటర్లుగా ఉన్న 568 మంది సునీత నేతృత్వంలో టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. గ్రామంలో ఉన్న ప్రజలంతా టీడీపీ సభ్యత్వం తీసుకోవడంపై పార్టీ అధిష్టానం అభినందనలు తెలిపింది. వెంకటాపురం స్ఫూర్తిగా రాష్ట్రవ్యాప్తంగా కేడర్ యావత్తు ఉత్సాహంగా సభ్యత్వ నమోదులో పాలుపంచు కోవాలని తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి చేసింది.