- బీసీల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు
- గత బడ్జెట్ కన్నా అదనంగా రూ.155.32 కోట్ల నిధులు
- అమరావతిలో ఐదెకరాల్లో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు
- నామినేటేడ్ పోస్టులలో 34 శాతం కోటా హర్షణీయం
- కూటమి ప్రభుత్వ నిర్ణయాలను స్వాగతిస్తున్నాం
- గౌడ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి
విజయవాడ(చైతన్యరథం): స్థానిక సంస్థలతో పాటు నామినేటెడ్ పోస్టులలో కూడా బీసీలకు 34 శాతం కోటాను అమలు చేసి చట్టబద్ధత కల్పిస్తామని ప్రకటించి బీసీల అభ్యున్నతికి కట్టుబడిన ఏకైక ముఖ్యమంత్రిగా చంద్రబాబు మరోమారు నిరూపించుకు న్నారని గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూ ర్తి హర్షం వ్యక్తం చేశారు. బీసీలకు మేలు చేసే పలు నిర్ణయాలు తీసుకోవడాన్ని స్వాగతి స్తున్నామని తెలిపారు. ఏపీలో బీసీల కోసం ప్రీ, పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్పులకు రూ. 254.48 కోట్లు, బీసీ హాస్టల్ విద్యార్థులకు రూ.155.32 కోట్ల అదనపు చెల్లింపు, డైట్ బిల్లులకు రూ.45.52 కోట్లు, కాస్మోటిక్ చార్జీల కింద రూ.21.60 కోట్ల మంజూరుతో పాటు అమరావతిలో 5 ఎకరాల్లో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడం హర్షణీయమన్నారు. వెనుకబడిన తరగతులపై సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపిం చి 104 హాస్టళ్లలో ఎస్‌ఆర్ శంకరన్ రిసోర్స్ సెంటర్ల ఏర్పాటు, అసంపూర్తిగా నిలిచిన 5 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లకు రూ.85 కోట్లు కేటాయించడాన్ని బీసీ కుటుంబాల తరపున స్వాగతించారు.
ఇలా గత బడ్జెట్ కంటే అదనంగా 155.32 కోట్లు చెల్లిస్తూ సీఎం చంద్ర బాబు నిర్ణయం తీసుకున్నారని, దీని వెనుక బీసీ సంక్షేమ మంత్రి సవిత కృషిని కొనియా డారు. గత ప్రభుత్వ తప్పిదం వల్ల స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న కోటా 34 శాతాన్ని 24 శాతానికి తగ్గించడం వల్ల బీసీలకు 16500 పదవులు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం తిరిగి 34 శాతం కోటాను అందించడానికి సిద్ధంగా ఉందని, దీనికి కావలసిన న్యాయ ప్రక్రియను ముందుకు నడిపిస్తున్నట్లు చంద్రబాబు స్వయంగా ప్రకటించి బీసీలపై చిత్తశుద్ధిని చాటుకున్నారని ప్రశంసించారు.