- ఏర్పాట్లు చేయాలని మంత్రి కందుల దుర్గేష్ ఆదేశం
- పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో సమావేశం
- ఇటీవల సమ్మిట్‌లో వచ్చిన ప్రతిపాదనలపై చర్చ
- సాధ్యాసాధ్యాలు పరిశీలించి పట్టాలెక్కించాలని సూచనలు
- 8 బీచ్ ప్రాంతాల్లో క్లీనింగ్, వసతులకు చర్యలు చేపట్టాలి
- పర్యాటక ప్రాంతాల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశం
- అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టులపై దిశానిర్దేశం
- సినిమాటోగ్రఫీ, నూతన ఫిల్మ్ పాలసీపై విస్తృత చర్చ
అమరావతి(చైతన్యరథం): త్వరలోనే విశాఖపట్టణం, తిరుపతిలలో పర్యాటక పెట్టుబ డిదారుల సదస్సులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని పర్యాటక శాఖ అధికారుల కు పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. మంగళ వారం వెలగపూడి సచివాలయం రెండో బ్లాక్‌లోని తన చాంబర్‌లో పర్యాటక శాఖ ఉన్న తాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యాటక ప్రాంతాల్లో పనుల ప్రగతి, డిసెంబర్‌లో విజయవాడ వివంత హోటల్‌లో నిర్వహించిన ఇన్వెస్టర్ల సమ్మిట్‌లో వచ్చిన ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించారు. పర్యాటక రంగ అభివృద్ధి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం మెండుగా ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యాటక రంగంపై ప్రత్యేక శ్రద్ధ వహించారని తెలిపిన మంత్రి ఈ క్రమం లో త్వరితగతిన పనులు పూర్తి చేసి శాఖ సమర్థతను నిరూపించుకోవాలని ఆదేశించారు. త్వరలోనే పర్యాటక ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనుల తీరును స్వయంగా పర్యవే క్షిస్తానని, ఈ నేపథ్యంలో పనులపై మరింత దృష్టిసారించాలని సూచించారు. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన ఒబెరాయ్, మేఫేర్, తాజ్ గ్రూప్, హయత్, మహేంద్ర, స్టెర్లింగ్ తదితర సంస్థల ప్రతిపాదనలపై చర్చించారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల ప్రతిపాదనలు పరిశీలించారు.
కొత్త టూరి జం పాలసీలో భాగంగా వారికి కల్పించాల్సిన రాయితీలపై చర్చించారు. త్వరలోనే వారందరితో మరోసారి భేటీ అయి ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు కృషిచేయాలని సూచించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో 8 బీచ్‌లను తొలుత అభివృద్ధి చేయాలని భావిస్తు న్నామని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. బీచ్‌ల్లో సుందరీకరణ, పరిశుభ్రత, తాగునీటి సరఫరా, బాత్ రూమ్‌ల ఏర్పాటు తదితర మౌలికవసతుల అంశంపై చర్చ రాగా స్వచ్ఛభారత్‌లో భాగం గా బీచ్ ప్రాంతాల్లో క్లీనింగ్ చేసే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. స్థానికంగా ఉండే పెద్ద పారిశ్రామిక సంస్థలతో చర్చించి ఈ ప్రక్రియలో భాగ స్వామ్యం కోరాలని అధికారులకు తెలిపారు. ఈ నెలాఖరు నాటికి ఆధునికీకరణ పూర్తి చేసుకుంటున్న టూరిజం హోట ళ్లను పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. తమ తమ నియో జకవర్గాల్లో పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన ప్రాంతాల వివరాలను ఎమ్మెల్యేలు తీసు కొస్తే అధికారులు వాటిని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు విశేష ప్రాచుర్యం కల్పించే విషయంలో సినిమా రం గంలోని సెలబ్రిటీల సహాయ సహకారాలను తీసుకోవాల్సిన అంశాన్ని మంత్రి ప్రస్తావిం చారు.
కేంద్ర ప్రభుత్వ పథకం సాస్కి నిధులతో చేపట్టే అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టుల అమలు తీరుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ ఉత్సవాలపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ అధికారులు మంత్రి దుర్గేష్‌కు నూతన సంవత్సర శుభా కాంక్షలు తెలిపారు. అనంతరం హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్‌తో భేటీ అయి సినిమాటోగ్రఫీ శాఖపై విస్తృతంగా చర్చించా రు. నూతన ఫిల్మ్ పాలసీ అంశంపై మాట్లాడారు. ఏపీ కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి విశ్వజీత్ ఇటీవల అదనపు డీజీపీ నుంచి డీజీపీ ర్యాంక్ పదోన్నతి పొందిన సందర్భంగా మంత్రి దుర్గేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమీక్షలో టూరిజం శాఖ సెక్రటరీ వినయ్‌చంద్, టూరిజం ఎండీ ఆమ్రపాలి, టూరిజం శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పద్మావతి, శేషగిరి, చీఫ్ ఇంజినీర్ నర్సింహారావు, సూపరింటెండెంట్ ఇంజినీర్ ఈశ్వరయ్య, కన్సల్టెంట్ సత్యప్రభ తదితరు లు పాల్గొన్నారు.