అమరావతి (చైతన్య రథం): ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ 2025 డైరీ, క్యాలెండర్‌ను చీఫ్ సెక్రటరీ కే. విజయానంద్‌తో కలిసి రాష్ట్ర విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సచివాలయంలోని మూడో బ్లాక్‌లోని మంత్రి ఛాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. పునరుత్పాదక రంగానికి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఇందులో భాగంగానే ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీని రూపొందించామన్నారు. గతంలో రాష్ట్రాన్ని విడిచి వెళ్లిన పునరుత్పాదక రంగం పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నట్లు మంత్రి వివరించారు. రాష్ట్రంలో సోలార్ పవర్ కార్పొరేషన్ పనితీరును మంత్రి గొట్టిపాటి అభినందించారు. నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో కార్పొరేషన్ కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఏపీ జెన్కో ఎండీ చక్రధర్ బాబు, ట్రాన్స్ కో జేఎండీ కీర్తి చెకూరి, సీపీడీసీఎల్ సీఎండీ పఠాన్ శెట్టి రవిసుభాష్, సోలార్ పవర్ కార్పొరేషన్ ఎండీ కమలాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.