- అనంతరం వారికి శ్రీవారి దర్శన భాగ్యం
- ప్రత్యేక వాహనాల్లో సొంతూళ్లకు తరలింపు
- ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు
- ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్, కమిషనర్
తిరుపతి(చైతన్యరథం): తొక్కిసలాట ఘటనలో క్షతగాత్రులను గురువారం పరామ ర్శించిన సీఎం చంద్రబాబు వారికి శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తామని హామీ ఇచ్చిన విష యం తెలిసిందే. శుక్రవారం స్విమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారికి చెప్పిన విధంగానే శ్రీవారి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం తిరుపతి నుంచి వారి సొంత ప్రాంతాలైన విశాఖపట్నం విజయనగరం, హైదరాబాద్ కడప, తిరుపూర్, కోయంబత్తూ ర్‌లకు ప్రత్యేక వాహనాలలో పంపించారు. దాంతో వారందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మనసారా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సీఎం ఆదేశాలతో దగ్గరుండి వైద్యం, వాహన, భోజన ఏర్పాట్లు చేసి స్వగ్రామాలకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి పంపించిన కలెక్టర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్విమ్స్ ఆస్పత్రి నుంచి 32 మంది డిశ్చార్జ్ అయ్యారని, ప్రస్తుతం ఐదుగురు ఇంకా చికిత్స పొందుతున్నారని తెలిపారు.
వారి ఆరోగ్యం మెరుగ్గా ఉందని సాయంత్రం వారిని వైద్యులు డిశ్చార్జ్ చేయనున్నారని తెలిపారు. అంతకుముందు శ్రీవారి దర్శనం అనంతరం మునిసిపల్ కమిషనర్ నారపురెడ్డి మౌర్యతో కలిసి కలెక్టర్ స్వయం గా వాహనాల దగ్గరకు వచ్చి వారి బాగోగులను తెలుసుకున్నారు. వారి కుటుంబసభ్యుల తో మాట్లాడి ధైర్యం చెప్పారు. అవసరమైన వైద్యసేవలను ప్రభుత్వమే చూసుకుం టుందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. వారిని తరలిం చేందుకు ఒక బస్సు, మరో నాలుగు వాహనాలను ఏర్పాటు చేయించి ఒక్కో వాహనంలో ఒక రెవెన్యూ అధికారిని తోడుగా పంపించారు.