- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం
- యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలు
- కృష్ణవేణి సంగీత నీరాజనం అభినందనీయం
- కేంద్ర పర్యాటక శాఖ ఏడీజీ వెంకటరామన్ హెగ్దే
విజయవాడ(చైతన్యరథం): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యాటక రంగం పురోభివృద్ధికి ఊతమివ్వడం యువతకు ప్రత్యక్షంగా, పరో క్షంగా ఉద్యోగావకాశాలు పొందే వీలు ఏర్పడుతుందని కేంద్ర పర్యాటక శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ వెంకట్రామన్ హెగ్దే తెలిపారు. స్థానికి తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఆదివారం రెండో రోజు నిర్వహించిన కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమానికి గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకట్రామన్ హెగ్దే మాట్లాడుతూ రెండురోజుల పాటు నిర్వహించిన కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమంలో ఎంతోమంది ప్రముఖ కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ ఇప్పటివరకు ఐదు ఈవెంట్లను నిర్వహించగా మైసూర్లో రెండు, విజయవాడలో జరుగుతున్న ఈ కార్యక్రమం మూడవది అన్నారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వశాఖ, ఏపీ ప్రభుత్వం, సంగీత నాటక అకాడమీ, స్థానిక సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా మెడికల్ టూరి జం. బిజినెస్ టూరిజం, ఇటీవల హెరిటేజ్ అండ్ కల్చర్ పాటు రిలీజియస్ టూరిజం వంటి వివిధ రంగాలలో పర్యాటకాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. సాంస్కృతిక పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా ప్రజల మధ్య సంబంధాలు పెరుగుతాయని పేర్కొన్నారు. సంగీత కళాకారులు విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి నప్పుడు అది. గురు-శిష్య సంబంధాలను పెంచటంతో పాటు, విదేశీయులు భారతదేశానికి వచ్చి ఇక్కడ బస చేసి నగదు ఖర్చు చేయడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం వస్తుందన్నారు. గత సంవత్సరంలో సుమారు కోటి మంది విదేశీయులు భారతదేశాన్ని సందర్శించటం వల్ల 2.93 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. కృష్ణవేణి సంగీత నిరంజనం కార్యక్రమానికి కేరళ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు వచ్చి ప్రదర్శనలు ఇచ్చినట్లు వివరించారు.
సంగీత నీరాజనం గుండెచప్పుడు
కేంద్ర పర్యాటక శాఖ సంచాలకులు (సౌత్) ఆర్.వెంకటేశన్ మాటాడుతూ కృష్ణవేణి సంగీత నిరాజనం యొక్క మూడవ ఎడిషన్ ముగింపు కార్యక్రమానికి స్వాగతం పలకడం ఆనందంగా ఉందన్నారు. జాతీయ సాంస్కృతిక మైలురాయిగా దీని గుర్తింపును బలోపేతం చేసింది. పవిత్రమైన కృష్ణానది, కనకదుర్గాదేవి దివ్య ఉనికితో ఆశీర్వదించబడిన విజయవాడ నగరం కేవలం ఈ ఉత్సవానికి ఆతిథ్యం ఇవ్వడమే కాదు.. ఇది ఈ నగరానికి గుండె చప్పుడు అని పేర్కొన్నారు. ఈ నగర చరిత్ర, ఆధ్యాత్మికత, శక్తి, కళాత్మక వారసత్వం ఇలాంటి ఉత్సవాల వేడుకకు పరిపూర్ణ కేంద్రంగా మార్చాయన్నారు.
సంగీతం, నృత్యం, కథాకథనం, హస్తకళలు ఇవన్నీ సంస్కృతి యొక్క జీవన స్వరాలు.. ఈ ఉత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ పర్యాటక వార్షిక ఉత్సవాల క్యాలెండర్లో అధికారి కంగా చేర్చినందుకు సంతోషంగా ఉందన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ మాట్లాడుతూ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ రావడం దీనికి మరింత గుర్తింపును ఇస్తుందన్నారు. సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లిఖార్జునరావు కర్ణాటక సంగీతంపై చిత్రించిన పెయింటింగ్స్ , గవర్నర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టార్ హెూటల్స్ అసోసియేషన్(ఆశా) అధ్యక్షుడు రామిశెట్టి వీరాస్వామి, సాంస్కృతికశాఖ సంచాలకులు రేగుళ్ల మల్లికార్జునరావు, ప్రముఖ సంగీత విద్వాంసులు మల్లాది రవికు మార్, తదితరులు పాల్గొన్నారు.














