శాన్‌ఫ్రాన్సిస్కో/యూఎస్‌ఏ (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని ఏఎండీ సంస్థను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. ఆమెరికా పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ శాన్‌ఫ్రాన్సిస్కోలో ఏఎండీ (Aఎస) సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ విభాగం) వంశీ బొప్పనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా తయారవుతోందన్నారు. ఏపీలో ఎలక్ట్రానిక్స్ రంగ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్ పాలసీని ప్రకటించారు. ఏపీలోని ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లలో (శ్రీసిటీ, కొప్పర్తి,) ఏఎండీ ఉత్పత్తుల అసెంబ్లింగ్, టెస్టింగ్, ప్యాకేజింగ్ యూనిట్ ఏర్పాటు చేసి, సప్లయ్ చెయిన్‌లో భాగస్వామ్యం వహించాలని కోరారు. దీనిపై ఏఎండీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వంశీ బొప్పన మాట్లాడుతూ… యూఎస్ వెలుపల ఏఎండీ అతి పెద్ద ఆర్ అండ్ హబ్ భారత్ లోనే నిర్వహిస్తున్నామన్నారు. బెంగళూరు, హైదరాబాద్, ఢల్లీి క్యాంపస్‌ల్లో సిలికాన్ డిజైన్, సాఫ్ట్‌వేర్, ఏఐ ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. అధునాతన చిప్ ఉత్పత్తి కోసం టిఎస్‌ఎంసి, గ్లోబల్ ఫౌండ్రీస్, ప్యాకేజింగ్ భాగస్వామ్యాలతో కలిసి పనిచేస్తున్నాం. ఏఐ ఆధారిత డేటా సెంటర్ ట్రాన్స్‌ఫర్మేషన్, అధిక పనితీరు గల కంప్యూటింగ్, నెక్స్‌ట్ జెన్ గేమింగ్ లో కీలకపాత్ర పోషిస్తున్నాం. భారతీయ టెక్ దిగ్గజాలు, స్టార్టప్ లు, ప్రభుత్వ విభాగాలతో కలిసి సూపర్ కంప్యూటింగ్, క్లౌడ్ అడాప్షన్ వంటి డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. (ఏఎండీ సంస్థ గత ఏడాది అధిక పనితీరుగల సీపీయూ, జీపీయూ, అడాప్టివ్ ఎస్‌ఓసిలు, డేటా సెంటర్ సొల్యూషన్స్ అమ్మకాల ద్వారా గత ఏడాది సుమారు 27 బిలియన్ డాలర్ల వార్షికాదాయం సాధించింది.












