ఢిల్లీ (చైతన్యరథం): విశాఖలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ (నేషనల్ స్కిల్స్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్`ఎన్‌ఎస్‌టీఐ) ఏర్పాటు చేయాలని కేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్ శాఖ మంత్రి జయంత్ చౌదరిని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. మంత్రి లోకేష్ సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి జయంత్ చౌదరితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ విశాఖ జిల్లా పెదగంట్యాడలోని 5 ఎకరాల స్థలాన్ని జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా గుర్తించిన విషయాన్ని జయంత్ చౌదరి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సంస్థ ఏర్పాటు ద్వారా అధ్యాపక అభివృద్ధి, పరిశ్రమ అనుసంధానిత నైపుణ్య శిక్షణ, గ్రీన్ స్కిల్స్, డిజిటల్ రూపాంతరం కోసం ప్రాంతీయ కేంద్రంగా సేవలందించడమే కాకుండా జాతీయ నైపుణ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని వివరించారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న పరిమితిని మంచి SBTET-AP ద్వారా NCVET అర్హతలను పెద్ద ఎత్తున స్వీకరించేందుకు ప్రత్యేక అనుమతి మంజూరు చేయాలని కోరారు. ఈ మానవేశంలో మంత్రి లోకేష్ వెంట కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని, ఎంపీలు పాల్గొన్నారు.















