- సీఎంకు ప్రతిష్టాత్మక అవార్డుపై డిప్యూటీ సీఎం అభినందన
- సీబీఎన్ ఎంపిక.. అవార్డుకు దక్కిన గౌరవం: జనార్ధన్ రెడ్డి
- తెలుగు జాతికి దక్కిన గౌరవమిది: మంత్రి డోలా
- చంద్రబాబు సంస్కరణలకు తగిన గుర్తింపు: మంత్రి దుర్గేష్
- హృదయపూర్వక అభినందనలు ప్రకటించిన మంత్రులు..
అమరావతి (చైతన్య రథం): అభివృద్ధి సారథికి ఘనమైన గుర్తింపే టైమ్స్ సంస్థ ప్రకటించిన ‘‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’’ అవార్డని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. 5వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ఈ అంశం చర్చకు వచ్చినపుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు పవన్ అభినందనలు తెలుపుతూ.. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీ అభివృద్ధి సాధిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. ‘‘ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో మేం పనిచేస్తాం. అందరూ కలిసి ఏపీ అభివృద్ధికి కృషి చేయాలి’’ అని పవన్ ఈ సందర్భంగా ప్రభుత్వ సహచరులకు పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబుకు ‘‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’’ అవార్డు రావడం.. విజనరీ లీడర్‌ను గొప్పగా గౌరవించుకోవడమేనని రోడ్లు భవనాల మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అభినందనలు తెలిపారు. చంద్రబాబుకు దక్కిన గౌరవం.. తెలుగు వారందరికీ గర్వకారణంగా అభివర్ణించారు. ఏపీని పెట్టుబడుల హబ్‌గా తీర్చిదిద్ది.. దేశానికి ఆదర్శంగా నిలిపిన నాయకుడిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారన్నారు. చంద్రబాబు సారథ్యంలో ఏపీ సాధిస్తోన్న గణనీయ ప్రగతికి అవార్డు నిదర్శనమంటూ అభినందనలు తెలిపారు.
సీఎం చంద్రబాబుకు లభించిన ప్రతిష్టాత్మక అవార్డు యావత్ తెలుగుజాతికి దక్కిన గౌరవంగా సాంఘిక సంక్షేమ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అభివర్ణించారు. అవార్డు సాధించిన చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ.. సీబీఎన్ విజన్, పాలనా సంస్కరణలు దేశానికే ఆదర్శమన్నారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజాసంక్షేమానికి చంద్రబాబు అవిశ్రాంత కృషి సాగిస్తారంటూనే.. అలాంటి నేత దొరకడం రాష్ట్ర ప్రజల అదృష్టంగా అభివర్ణించారు. ది ఎకనామిక్ టైమ్స్ అందించే అవార్డు సీఎం చంద్రబాబును వరించడంపట్ల పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేస్తూ.. సీబీఎన్ బ్రాండ్‌తో ఏపీకి వెల్లువెత్తుతున్న పెట్టుబడులస్థాయికి అవార్డు నిదర్శనమన్నారు. విజన్ `2047కి అనుగుణంగా స్నేహపూర్వక వ్యాపార అనుకూల విధానాలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, భారీ ఇన్సెంటివ్‌లు తదితర పారిశ్రామిక సంస్కరణలు చంద్రబాబుకే సాధ్యమని చెప్పడానికి ఈ అవార్డు నిలువెత్తు నిదర్శనమన్నారు. రాష్ట్రాభివృద్ధికి సీబీఎన్ నాయకత్వం, పానలకు అధునాతన సాంకేతికతను అనుసంధానిస్తోన్న విధానం.. ఏపీ ఉజ్వల భవిష్యత్‌కు తార్కాణంగా పేర్కొంటూ.. చంద్రబాబుకు అభినందనలు తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ఏపీ సాధిస్తోన్న గణనీయ అభివృద్ధి దక్కిన గుర్తింపే `సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు అని న్యాయ, మైనారిటీ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ అభినందనలు తెలిపారు. వినూత్న విధానాలతో ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడంలో చంద్రబాబు పాత్ర అనితరసాధ్యమన్నారు. వ్యాపారానుకూల విధానాల్లో భాగంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు బదులు ఏపీ అనుసరిస్తోన్న ‘‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’’ దేశానికే ఆదర్శప్రాయమని, ఆ ఘనత చంద్రబాబుదేనని ఫరూఖ్ వ్యాఖ్యానించారు.
‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు చంద్రబాబుకి రావడంపై గర్వంగా ఉందని దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అభినందనలు తెలిపారు. పెట్టుబడిదారులకు విశ్వసనీయత, పారదర్శకత కల్పించిన గొప్ప నాయకుడిగా చంద్రబాబును అభివర్ణించారు. పాలనలో వేగం, నిర్ణయాల్లో స్పష్టతే చంద్రబాబు ప్రత్యేకతగా పేర్కొంటూ.. ఏపీని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ గౌరవం దక్కడం సముచిత పంపికగా మంత్రి ఆనం అభిప్రాయపడ్డారు.
విపత్కర పరిస్థితులను అధిగమిస్తూ రాష్ట్రాభివృద్ధి సాధిస్తూనే.. సంక్షేమం ఏపీని అగ్రపథాన నిలిపేందుకు సీఎం చంద్రబాబు చేస్తోన్న అహర్నిశల కృషికి గుర్తింపే `బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుగా పేర్కొంటూ.. పరిశ్రమలు, వాణిజ్య మంత్రి టీజీ భరత్ అభినందనలు తెలిపారు. సీబీఎన్‌కు దక్కిన గౌరవంపట్ల సంతోషంగానూ, గర్వంగానూ ఉందంటూనే.. సమర్థ విధానాలతో ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులను రాష్ట్రానికి ఆకర్షిస్తోన్న విజనరీ లీడర్ మనకు ఉండటం రాష్ట్రానికే గర్వకారణమన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధిలో దేశంలోనే టాప్‌లో ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో తిరోగమనంలోవున్న రాష్ట్రాన్ని గాడిన పెట్టి పురోగమనంవైపు పరుగు పెట్టిస్తోన్న సీఎం చంద్రబాబు సమర్థతకు దక్కిన గౌరవమే `టైమ్స్ సంస్థ ప్రకటించిన ప్రతిష్టాత్మక అవార్డుగా జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు అభివర్ణించారు. అవార్డు రావడంపట్ల హర్షం ప్రకటిస్తూ.. విజనరీ లీడర్ సాధించిన ఘనత తెలుగుజాతికి గర్వకారణమన్నారు. ఇంటికో పారిశ్రామికవేత్త, నియోజకవర్గానికో ఇండస్ట్రియల్ హాబ్ లక్ష్యంతో.. 20 లక్షలమంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న తపనతో పాలన సాగిస్తోన్న చంద్రబాబుకు.. సముచిత గౌరవం దక్కిందని నిమ్మల అభినందనలు తెలిపారు.
విజన్ `2047కి అనుగుణంగా స్నేహపూర్వక వ్యాపారానుకూల విధానాలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, భారీ ఇన్సెంటివ్‌లతో పారిశ్రామిక సంస్కరణలను కొత్త పుంతలు తొక్కించిన సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు దక్కడం.. రాష్ట్రం చేసుకున్న అదృష్టంగా హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు. ఏపీపై ఇన్వెస్టర్లలో నమ్మకం పెరుగుతోందనడానికి వెల్లువలా వస్తున్న పెట్టుబడులే నిదర్శనమైతే.. ఆ విశ్వాసానికి బలమైన బాటలు వేసిన దార్శనికుడు చంద్రబాబు నాయకత్వం.. రాష్ట్రానికి గర్వకారణమన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ సాధిస్తున్న గణనీయ ప్రగతికి ఈ అవార్డు నిలువెత్తు దర్పణంగా హోంమంత్రి అనిత అభినందనలు తెలిపారు. సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించడం రాష్ట్రానికే గర్వకారణంగా కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ హర్షం వ్యక్తం చేశారు. పెట్టుబడులకు అనుకూల వాతావరణం, పరిశ్రమల స్థాపనకు సరళీకృత విధానాలు, పారదర్శక పాలన, వేగవంతమైన అనుమతుల వ్యవస్థవంటి సీఎం చంద్రబాబు తెచ్చిన సంస్కరణలకు లభించిన గుర్తింపుగా అభివర్ణించారు. సీబీఎన్ నాయకత్వంలో ఏపీ మరింత అభివృద్ధి సాధించి, దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్న నమ్మకాన్ని మంత్రి సుభాష్ వ్యక్తం చేశారు.











