- ప్రజల జీవన ప్రమాణాల పెంపే లక్ష్యం
- పీ-4తో ఆర్థిక అసమానతల తగ్గింపు
- హెల్తీ, వెల్తీ, హ్యాపీ రాష్ట్రంగా ఏపీ
- 2027కి రెవెన్యూ సమస్యల పరిష్కారం
- నారావారిపల్లెలో మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు
నారావారిపల్లె (చైతన్యరథం): గతంలో గ్రామాలకు వెళ్లడానికి ప్రజలు భయపడేవారని, ఈ ఏడాది చాలా ఉత్సాహంగా స్వగ్రామాలకు వెళ్లి పండగ చేసుకున్నారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతి జిల్లా నారావారిపల్లెలో గురువారం మీడియాతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ జన్మభూమిని ఎవరూ మర్చిపోకూడదన్నారు. ప్రభుత్వ పాలసీలతో చదవుకుని పలువురు ఉన్నత స్థితికి చేరుకుంటున్నప్పటికీ, అయినా చాలామంది ప్రజల్లో ఇప్పటికీ సరైన జీవన ప్రమాణాలు లేవు. టెక్నాలజీ, ఆర్థిక సంస్కరణలు వచ్చినా ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. సంపద సృష్టి కంటిన్యూగా పెరుగుతోంది. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందే దేశాల్లో భారత్ ఉంది. బిలియనర్స్ పెరుగుతున్నారు… అదే సమయంలో ఆర్థిక అసమానతలు కూడా పెరుగుతున్నాయి. అసమానతలు తగ్గకుంటే సంతృప్తి ఉండదు. అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిస్తేనే నిజమైన సమసమాజం అవుతుంది. అందుకే పీ4 తీసుకొచ్చి 10 లక్షల కుటుంబాలను దత్తత తీసుకున్నాం.
పీ4 లోభాగంగా మార్గదర్శి, బంగారు కుటుంబాల వ్యవస్థ ద్వారా పేదరికం తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నాం. 2026లో దీనిపై మరింత ఫోకస్ పెడతాం. ఒక్క డబ్బే కాదు… మేనేజ్మెంట్ స్కిల్ కావాలి. 3 రోజులుగా స్వగ్రామంలోనే ఉండి. సమస్య పండుగ, పంటలు ఇంటికి వస్తాయి. పంటలు, పిండి వంటలతో ఆనందంగా గడుపుతారు. ధాన్యం కొనుగోలు చేసి రూ.10 వేల కోట్లు చెల్లించి రైతులు ఆనందంగా ఉండేలా చూశాం. సంక్రాంతి రోజున పెద్దలను తలచుకుని నివాళులు అర్పిస్తాం. మన పెద్దలను మనం గుర్తు పెట్టుకోకపోతే వారసత్వం లేదు.. మనుషులకు జంతువులకు తేడా ఉండదు. కనుమ పండగ సందర్భంగా ప్రకృతిని ఆరాధించుకుని పశువులను పూజించుకుంటాం. కోడి పందేలను కూడా నిర్వహించుకుని సాంప్రదాయంగా గడిపేవాళ్లమని సీఎం చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.
జీవన ప్రమాణాల పెంపే లక్ష్యం
2047 స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ 2047.. దానికి అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ రూపొందించుకుని 2029కి, 2039కి ఏం చేయాలో టార్గెట్ పెట్టుకుని పని చేస్తున్నాం. జీవన ప్రమాణాలు పెరగాలనే ఉద్దేశ్యంతోనే పని చేస్తున్నాం. హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీని నిర్మించాలి. ప్రతి ఒక్కరి ఆదాయం పెరగాలి. అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి. స్వర్ణ నారావారిపల్లెకు గతేడాది శ్రీకారం చుట్టాం. ఇక్కడ జీవన ప్రమాణాలు, ఆదాయం పెంచాలని ప్రణాళికలు అమలు చేశాం. రంగంపేట,లు కూడా తెలుసుకున్నాను. భోగి, సంక్రాంతి వేడుకలు నిర్వహించుకున్నాం. సంక్రాంతి రైతుల కందులవారిపల్లె, చిన్నరామపురం 3 పంచాయతీలను పైలట్ గా తీసుకున్నాం.
స్పెషల్ ఆఫీసరు పెట్టుకుని గ్రామాల్లో ఏం చేయాలో అన్నీ చేస్తున్నాం. మరుగుదొడ్లు, దీపం, పింఛన్లు అందిస్తున్నాం. ఇల్లు లేని వారిని గుర్తించాం.
ఇంటి స్థలాలున్నా కొందరికి సొంతిల్లు లేదు. అందుకే ఏడాదిలో ప్రతి ఒక్కరికీ ఇల్లు ఏర్పాటు చేస్తాం. ఇంటింటికీ నీటి సరఫరాను కూడా అందించే కార్యక్రమం చేపడుతున్నాం. రోడ్ల నిర్మాణం కూడా చేపడుతున్నాం. రంగంపేటను జాతీయ రహదారికి అనుసంధానం చేస్తాం. చెత్తను వంద శాతం సేకరించి శాగ్రిగేషన్ చేస్తున్నాం. తడి చెత్త నుంచి కంపోస్ట్, పొడి చెత్తను సర్య్కులర్ ఎకానమీకి పంపుతున్నాం. పరిశుభ్రమైన గ్రామాలుగా తీర్చిదిద్దుతున్నాం. హంద్రీనీవా నీరు పైప్ లైన్ ద్వారా మూలపల్లి రిజర్వాయర్కు తీసుకొస్తాం. అన్ని రిజర్వాయర్లు నీళ్లతో కళకళలాడుతున్నాయి. హెల్త్ విషయంలో సంజీవని తీసుకొచ్చాం. ఆరోగ్య కరమైన సొసైటీని తయారు చేస్తాం. కుప్పంలో సంజీవని సక్సెస్ అయింది… ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో అమలు చేస్తున్నాం. ఈ ఏడాదే రాష్ట్రమంతా సంజీవని అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తాం
ప్రకృతి వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహిస్తాం. డెయిరీ పరిశ్రమకు పెద్దఎత్తున ప్రోత్సాహం అందిస్తు న్నాం,స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్్కూడా ప్రారంభించాం. స్కిల్స్ పెంచి అప్ గ్రేడ్ చేస్తాం. కేర్ అండ్ గ్రో కార్య క్రమం ద్వారా అంగన్వాడీ ఆయాలకు ట్రైనింగ్ ఇస్తాం. రంగం పేట హైస్కూల్, జూనియర్ కాలేజీ కేంద్రంగా ఎడ్యుకేషన్పై దృష్టి పెట్టాం. పర్యాటకంలో భాగంగా తిరుపతి, రూరల్ ప్రాంతంలో హెూం స్టేల కూడా ప్రాధాన్యం ఇస్తాం. తిరుపతి చెరువులకు, విజయవాడ కెనాల్స్క, విశాఖకు బీచకు ప్రసిద్ధి. తిరుపతి రాబోయే రోజుల్లో వెడ్డింగ్ డెస్టినేషన్ హబ్గా మారుతుంది. శెట్టిపల్లి భూ వివాదాన్ని కూడా పరిష్కరించాం. తిరు పతి, విశాఖ, అమరావతిని మెగా సిటీలుగా తీర్చిదిద్దు తాం. గత ప్రభుత్వంలో ఇష్టం లేని వారి భూములు 22ఏలో పెట్టారు. గందరగోళం సృష్టించారు. మేం ఏడాది కాలం లక్ష్యంగా పెట్టుకుని సర్వే పూర్తి చేసి రూపాయి కూడా లేకుండా క్యూఆర్ కోడ్ తో పాసు పుస్తకాలు ఇస్తున్నాం. 2027 నాటికి రెవెన్యూ సమస్య లు పరిష్కరిస్తాం. అదొక్కటే నాకు పెద్ద బాధ్యత. ప్రతి నెలా 9న పట్టాదారు పుస్తకాలు అందిస్తాం. జాయింట్ కలెక్టర్లు ఈరెవెన్యూ సమస్యలపైనే ఈ ఏడాది మొత్తం పని చేసారని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
















