తిరుపతి(చైతన్యరథం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబసభ్యులతో కలిసి స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేష్, బ్రాహ్మణి పాల్గొన్నారు. సంబరాల్లో భాగంగా గ్రామంలోని చిన్నారులకు మ్యూజికల్ చైర్స్, బ్యాలెన్స్ వాకింగ్, గన్నీ బ్యాగ్ రేస్, లెమన్ అండ్ స్పూన్, కాక్ ఫైట్, త్రీలెగ్ రేస్, గ్లాస్ అండ్ బెలూన్ రన్ తదితర క్రీడలను నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఆసక్తిగా తిలకించారు. క్రీడల్లో నందమూరి, నారా మనవళ్లు కూడా పాల్గొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. చిన్నారులతో ఫొటోలు దిగి ఆప్యాయంగా ముచ్చ టించారు. దాదాపు రెండు గంటల సేపు గ్రామస్తులు, చిన్నారులతో గడిపారు. మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి బహుమతులను అందజేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి అర్జీలు తీసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు.
ఆసక్తిగా తిలకించిన లోకేష్
నారావారిపల్లెలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ముందుగా టీటీడీ కళ్యాణ మండ పంలో నిర్వహించిన ముగ్గుల పోటీలను తిలకించారు. అనంతరం స్థానికంగా వివిధ పాఠశాలల విద్యార్థు లకు నిర్వహించిన క్రీడలను వీక్షించారు. విజేతలకు సీఎం చంద్రబాబు, భువనేశ్వరి బహుమతులు అంద జేశారు. వేడుకల్లో భాగస్వాములైన ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిని ఘనంగా సన్మానించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందితో కలిసి గ్రూప్ ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమంలో నారా బ్రాహ్మణి, తేజస్విని, ఎంపీ శ్రీభరత్, నారా రోహిత్, నారా, నందమూరి కుటుంబసభ్యు లతో పాటు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు. తదితరులు పాల్గొన్నారు.















