- ఏపీలో పెయింట్స్ తయారీ యూనిట్ ఏర్పాటుచేయండి
- జెఎస్‌డబ్ల్యు ఎండి పార్థ్ జిందాల్‌తో భేటీలో మంత్రి లోకేష్
దావోస్/స్విట్జర్లాండ్ (చైతన్యరథం): జెఎస్‌డబ్ల్యు సిమెంట్స్ అండ్ పెయింట్స్ విభాగం మేనేజింగ్ డైరెక్టర్ పార్థ్ జిందాల్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం దావోస్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కడపలో జెఎస్‌డబ్ల్యు స్టీల్ ప్లాంట్ కు భూమిపూజ షెడ్యూలుపై చర్చించారు. సాధ్యమైనంత త్వరగా కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభించాలని మంత్రి లోకేష్ కోరారు. పెయింట్స్ తయారీ రంగంలో మేజర్ ప్లేయర్లు అయిన బర్జర్ పెయింట్స్, ఆసియన్ పెయింట్స్ వంటి సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌లో డెకరేటివ్, ఇండస్ట్రియల్ పెయింట్స్ తయారీ సౌకర్యాన్ని ఏర్పాటుచేయండి. భారత్ లో జెఎస్‌డబ్ల్యు – ఎల్ జి భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలని భావిస్తున్న బ్యాటరీ తయారీ యూనిట్ కు అంతర్జాతీయస్థాయి ఎకోసిస్టమ్ కలిగి ఉన్న శ్రీసిటీ లేదా విశాఖను పరిశీలించండి. ఏపీలో ఎంజి మోటార్ బ్రాండ్ ద్వారా కొత్త ఈవీ, ఐసీఈ మ్యానుఫ్యాక్చరింగ్ లైన్‌ను ఏర్పాటు చేయడానికి గల అవకాశాలను అన్వేషించండి. జెఎస్‌డబ్ల్యు గ్రూప్ చేపట్టిన హెరిటేజ్ ఎడాప్షన్ ఇనిషియేటివ్స్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని గండికోట కోట, ఉండవల్లి గుహలు వంటి వారసత్వ ప్రదేశాలను స్వీకరించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు. పార్థ్ జిందాల్ స్పందిస్తూ… ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.













