దావోస్/స్విట్జర్లాండ్ (చైతన్యరథం): కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ సింగిశెట్టి, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ జతిన్ దలాల్, ప్రెసిడెంట్ అమెరికాస్ సూర్య గుమ్మడిలతో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్‌లో మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… విశాఖపట్నంలో కాగ్నిజెంట్ ఐటీ క్యాంపస్ పనులను వేగవంతం చేయాలని కోరారు. తాత్కాలిక సౌకర్యాల ద్వారా ముందస్తు ఉద్యోగుల సంఖ్యను పెంచే అంశాన్ని పరిశీలించండి. ఏఐ, జెన్ ఏఐ, క్లౌడ్, డేటా, డిజిటల్ ఇంజనీరింగ్, సీటీఎస్ నియామక అవసరాలకు విశాఖలో కాగ్నిజెంట్ టెక్నాలజీస్ ఆధ్వర్యాన డెడికేటెడ్ సెంట్రలైజ్డ్ స్కిల్లింగ్ క్యాంపస్ ఏర్పాటు చేయండి. ఆంధ్రప్రదేశ్‌లో ఇన్నోవేషన్స్, స్టార్టప్ లను ప్రోత్సహిస్తున్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH)తో భాగస్వామ్యం వహించండి. దీనిద్వారా ఏఐ, డిజిటల్ ప్రొడక్ట్ స్టార్టప్‌లు, ఎంటర్‌ప్రైజ్ మెంటరింగ్, పైలట్ ప్రాజెక్టుల విస్తరణపై దృష్టి సారించవచ్చు. ఏపీ స్టార్టప్‌లను ఎంటర్‌ప్రైజ్-రెడీ సొల్యూషన్స్‌గా మార్చడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రపంచ అవసరాల కోసం డైరెక్ట్ టాలెంట్ పైప్‌లైన్ అందించేందుకు ఏపీ విశ్వవిద్యాలయాలతో కలిసి ఏఐ ల్యాబ్‌లు, అప్లయ్‌డ్ రీసెర్చి, ఇంటర్న్‌షిప్‌లు, హైర్-లింక్డ్ క్యాప్‌స్టోన్ ప్రోగ్రామ్‌లకు పరిశ్రమ-విద్యా చట్రాన్ని రూపొందించేందుకు ఇండస్ట్రీ-అకడమియా కొలాబరేషన్‌కు ముందుకురావాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.














