దావోస్/స్వీట్జర్లాండ్ (చైతన్యరథం); హెచ్సీఎల్ సీఈవో, ఎండీ సి. విజయ కుమార్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… గ్లోబల్ డెలివరీ, మేనేజ్డ్ సర్వీసులకు అనుసంధానించి కనీసం 10వేల మంది ఉద్యోగుల సామ ర్థ్యంతో విశాఖపట్నంలో ఒక కొత్త హెచ్సీ ఎల్ టెక్ డెలివరీ సెంటర్ /జీసీసీ సర్వీస్ లైన్ ను ఏర్పాటు చేయాలని కోరారు. హెచ్సీఎల్ టెక్ గన్నవరం క్యాంపస్ను రాబోయే 3-5 ఏళ్లలో 20వేల మంది ఉద్యోగులకు విస్తరించడం ద్వారా ఆంధ్ర ప్రదేశ్లో ప్రధాన డిజిటల్ ఇంజ నీరింగ్, ఐటీ సేవల హబ్ తీర్చిదిద్దండి. హెచ్సీ ఎల్ ఫౌండేషన్ నిర్మాణాత్మక మార్గదర్శ కత్వం, ఇంక్యుబేషన్, ఎంటర్ప్రైజ్ టెక్నా లజీ మార్గదర్శకత్వం, మార్కెట్ యాక్సెస్ ను అందిస్తూ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఏపీలో 100స్టార్టప్లకు మద్దతు ఇవ్వండి. ఏపీలోని ఐఐటీలు, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, నైపుణ్య సంస్థల తో కలిసి ఉమ్మడి ఏఐ ఇన్నోవేషన్, ఎక్టక్ ల్యాబ్ను ఏర్పాటు చేయండి.. ఏపీలోని గ్రామీణ ప్రాంతాలు, టైర్-2 నగరాల్లో యువత కోసం ఏపీఎస్ఎస్ఎసీ తో కలిసి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిం చండి. విశాఖపట్నంలో హెచ్సీఎల్ టెక్ జీసీసీ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తామని హెచ్సీఎల్ సీఈవో చెప్పారు.
















