తొలిసారిగా రాజధాని అమరావ తిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పరేడ్ను పరిశీ లించి తన సందేశాన్ని అందించారు. పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, ఉప ముఖ్య మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ దంపతులు, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకు న్నాయి. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంగా ఆం ధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ వెల్లడించారు. సుపరి పాలనకు 10 సూత్రాల ఆధారంగా సాధించిన పురోగతిని, రాష్ట్ర దిశను, గమ్యాన్ని నిర్వచిస్తున్న విజయాలు గర్వకారణమని అభి వర్ణించారు. రాజధానిలో గణతంత్ర వేడుకలు చరిత్రాత్మకమని అభివర్ణించారు. తొలిసారిగా ప్రజల రాజధాని అమరావతిలో జాతీయ జెండాను ఎగురవేస్తున్నామని ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలే- ప్రగతికి
నిజమైన శిల్పులని పేర్కొన్నారు.
- తొలిసారి రాజధానిలో గణతంత్ర వేడుకలు
- పాల్గొన్న సీఎం చంద్రబాబు, గవర్నర్ నజీర్
- కవాతులో ఆర్మీ కంటింజెంట్కు మొదటిస్థానం
- ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు, శకటాలు
- 10 సూత్రాలతో విజయ ప్రయాణం
- సాంకేతికతో పాలనతో కొత్త పుంతలు
- ప్రజలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం
అమరావతి(చైతన్యరథం): తొలిసారిగా రాజధాని అమరావతిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పరేడ్ను పరిశీ లించి తన సందేశాన్ని అందించారు. గౌరవ వందనం స్వీకరించా రు. ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ దంపతులు, మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. వేడుకల్లో ఇండి యన్ ఆర్మీ, కర్నూలు ఏపీఎస్పీ సెకండ్ బెటాలియన్, సీఆర్పీఎఫ్, కేరళ రాష్ట్ర పోలీస్, విశాఖపట్టణం ఏపీఎస్పీ 16వ బెటాలియన్, ఎన్సీసీ (బాయ్స్), ఎన్సీసీ (గరల్స్), ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షి యల్ స్కూల్స్ (బాయ్స్ అండ్ గరల్స్), భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ (బాయ్స్ అండ్ గరల్స్), యూత్ రెడ్ క్రాస్ (బాయ్స్) కంటింజెంట్స్ కవాతును నిర్వహించారు.
కవాతులో ఉత్తమ ప్రతిభ కనబరచిన ఇండియన్ ఆర్మీ కంటింజెంట్కు మొదటి స్థానం, విశాఖపట్టణం ఏపీఎస్పీ 16వ బెటాలియన్కు రెండో స్థానం, కాన్సులేషన్ ప్రైజ్ కేరళ రాష్ట్ర పోలీస్ కంటింజెంటు అందించారు. పరేడ్లో ప్రధానంగా బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్ ఆహుతులను అలరించా యి. పరేడు మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ ఐజీపీ బీ.రాజకుమారి నోడల్ ఆఫీసర్గా, డీఐజీ కె.ఫకీరప్ప కోఆర్డినే టింగ్ ఆఫీసర్గా వ్యవహరించారు. పరేడ్ కమాండర్ గా జంగారెడ్డి గూడెం ఏఎస్పీ పరేడ్ కమాండర్ ఆర్. సుస్మిత, పరేడ్ సెకండ్ ఇన్ కమాండ్ ఏపీఎస్సీ మొదటి ఐఆర్ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ టీ.ఎన్.శ్రీనివాసరావు, పరేడ్ అడ్డుటెంట్ కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ ఎం.శివరామకృష్ణ వ్యవహరించారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు రాష్ట్ర ఐక్యత, ప్రజాస్వామ్య విలువలను ప్రతిబింబిస్తూ ఘనంగా ముగిశాయి. పొలిటి కల్ ప్రిన్సిపల్ సెక్రటరీ జే. శ్యామలరావు, గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, ఎస్పీవకుల్ జిందాల్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న శకటాలు.. సాంస్కృతికానికి ప్రథమస్థానం
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి రాజధానిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వేడుకల్లో వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు, సాంస్కృతిక వారసత్వం, సామా జిక అవగాహన అంశాలను ప్రతిబింబించేలా రూపొందించిన శకటాలు కనువిందు చేశాయి. శకటాల్లో వందేమాతరం-150 సంవత్సరాల ఇతివృత్తంగా రూపొందించిన రాష్ట్ర సాంస్కృతిక శాఖ శకటానికి ప్రథమ, మహిళా సంక్షేమమే చంద్రన్న ధ్యేయంతో రూపొందిన సెర్ఫ్ శకటానికి ద్వితీయ, పెట్టుబడుల ద్వారా ఉపాధి ఇతివృత్తంగా రూపొందిన పరిశ్రమల శాఖ శకటానికి తృతీయ స్థానాల్లో నిలిచాయి. వీటితో పాటు జనాభా నిర్వహణ, మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్యా శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, నైపుణ్యం, ఉపాది స్కిల్ డవలప్ మెంట్ కార్పొరేషన్, పాఠశాల విద్యాశాఖ, పర్యాటక శాఖ, జల వనరుల అభివృద్ధి శాఖ, మైక్రో ఇరిగేషన్, అటవీ శాఖలు, రైతు – వ్యవసాయ సాంకేతికతతో వ్యవసాయ శాఖ, మత్స్య శాఖలు, మౌలిక వసతులు పెట్టుబడులు, సముద్ర వైమానిక రంగాలు, సీఆర్డీఏలు, వ్యయ అత్యుత్తమీకరణ (ఖర్చు తగ్గింపు)-శక్తి, ఇంధ నం నెడ్క్యాప్ (ఇంధనం), ఉత్పత్తి పరిపూర్ణత, చేనేత, జౌళి శాఖ, ఉద్యానవన శాఖ, స్వచ్ఛ ఆంధ్ర, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ (స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్), పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, ఆర్టీజీఎస్ శాఖల శకటాలు ప్రభుత్వ సంకల్పం, ప్రజా సంక్షేమ లక్ష్యాలను స్పష్టంగా ఆవిష్కరించాయి. ఆధునిక సాంకేతికతతో పాటు సంప్రదాయ కళారూపాల మేళవింపుతో రూపొందిన శక టాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.















