- యువగళం హామీ అమలుకు అవిశ్రాంత కృషి
- పారిశ్రామికవేత్తలను రప్పించడంలో సఫలీకృతం
- 18 నెలల కూటమి పాలనలో పెట్టుబడుల వరద
అమరావతి (చైతన్యరథం) యువగళం పాదయాత్ర 2023.. ఫిబ్రవరి 12న 17వ రోజు అది. జీడి నెల్లూరు నియోజకవర్గం లో సాగుతుండగా ఓ తల్లి లోకేష్కు తారసపడింది. ఆమె ఆవేదన విన్న తరువాతనే రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే దృఢనిశ్చయానికి వచ్చారు. పాదయాత్రలో లోకేష్ జీడి నెల్లూరు శివారు గ్రామంలో రోడ్డుపక్కన చిన్న టిఫిన్ బడ్డీ నిర్వహిస్తూ కుటుం బాన్ని పోషిస్తున్న మోహన అనే మహిళను కలిశారు. మేం -అధికారంలోకి వచ్చాక మీరు ఏం కోరుకుంటున్నారని ఆమెను అడిగారు. తన భర్త మద్యానికి బానిసై, అప్పులు చేసి ఆత్మహత్య చేసు కున్నాడని, ఆ తర్వాత తానే పాతికేళు _గా కుటుంబాన్ని పోషిస్తు న్నానని తెలిపింది. చదువుకున్న తమ ఇద్దరు బిడ్డలు పొరుగు రాష్ట్రానికి వలసవెళ్లే పనిలేకుండా స్థానికంగా ఉద్యోగాలు లభిస్తే చాలని, తమకు మరేమీ వద్దని తెలిపింది. మోహన మాటలతో చలించిన యువనేత లోకేష్. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నాడు ఇచ్చిన హామీని తూచ తప్పకుండా అమలు చేసేందుకు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నారు. అమెరికా, దావోస్, సింగపూర్, యూకే, ఆస్ట్రేలియాల్లో పర్యటించి పారిశ్రా మికవేత్తలతో విస్తృతంగా చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు గల అనుకూలతలను వివరించి దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి రప్పించడంలో సఫలీకృతులయ్యారు. ఫలితంగా రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి.
18 నెలల కూటమి పాలనలో పరిశ్రమలు క్యూ
దేశ, విదేశాల్లోని ప్రఖ్యాత పారిశ్రామిక సంస్థలను రాష్ట్రానికి రప్పించి యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా యువనేత లోకేష్ పనిచేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధికల్పన సబ్ కమిటీ చైర్మన్ గా మంత్రి లోకేష్ అవిశ్రాంత కృషి, పట్టుదల.. చంద్రబాబునాయుడు బ్రాండింగ్ కారణంగా 18 నెలల్లోనే రాష్ట్రంలో 23.5 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. విశాఖలో సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్లో 613 పారిశ్రామిక సంస్థలు రూ.13.25 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. అంతకుముందు సుమారు 200 పరిశ్రమలు వి120 బిలియన్ డాలర్లు (రూ.10.25 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మొత్తంగా 18 నెలల వ్యవధిలో రాష్ట్రానికి రూ.23.5 లక్షల కోట్లు పెట్టుబడు లు వచ్చాయి. ఇందులో రూ. లక్ష కోట్ల పైబడిన, సమీప భారీ పెట్టుబడులే రూ.10 లక్షల కోట్లకు పైగా ఉండటం విశేషం. దేశ చరిత్రలో భారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి గూగుల్ ఏఐ హట్ వి15 బిలియన్ డాలర్లు (రూ.1.33 లక్షల కోట్లు), దేశంలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ రూ.1.35 లక్షల కోట్లు, రిలయన్స్ డేటా సెంటర్ రూ.1.10 లక్షల కోట్లు, రిలయన్స్ సీబీజీ (రూ.65 వేల కోట్లు, ఏబీసీ క్లీన్ టెక్ రూ.1.10 లక్షల కోట్లు, ఎన్ టీపీసీ గ్రీన్ రూ.1.85 లక్షల కోట్లు, బ్రూక్ ఫీల్డ్ డేటా సెంటర్ 1.10 లక్షల కోట్లు, బీపీసీఎల్ రిఫైనరీ రూ.95 వేల కోట్లు, రెన్యూ పవర్ రూ.82 వేల కోట్లు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో భారీ పెట్టుబడులు
తాజాగా దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు సందర్భంగా మంత్రి లోకేష్ చొరవతో ఆర్ఎం జడ్ సంస్థ 10 బిలియన్ డాలర్లు (రూ.90 వేల కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. కేవలం 9 బడా సంస్థలు రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. గత 18 నెలల కాలంలో నెలకు సగటున రూ.1.40 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు ముందుకు వచ్చాయి. కేవలం ఎంవోయూలతో సరిపెట్టకుండా ప్రతి భారీ పరిశ్రమకు ఒక వాట్సప్ గ్రూప్ను ఏర్పాటు చేసి ఆయా సంస్థలకు అవసరమైన అనుమతులను వెంటపడి క్లియర్ చేస్తున్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, డబుల్ ఇంజన్ సర్కార్ నినాదాలతో లోకేష్ పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పరిశ్రమలకు కేవలం 21 రోజుల్లో అన్ని అనుమతులు లభిస్తాయి. కూటమి ప్రభుత్వం తెచ్చిన 23 పారిశ్రామిక పాలసీలతో ఏపీ వైపు పారిశ్రామి కవేత్తలు చూస్తున్నారు. అలాగే ఎస్క్రో ఎకౌంట్ ద్వారా నేరుగా రాయితీలు పెట్టుబడిదారుల ఖాతాలకు బదిలీ చేస్తామని భాగస్వామ్య సదస్సులో ముఖ్యమంత్రి ప్రకటించారు.
బ్రాండ్ బాబు మార్గదర్శకత్వంలోనే..
పెట్టుబడుల సాధనలో చంద్రబాబునాయుడు జీపీఎస్ అయితే తాము మిసైల్.. ఆయన మార్గదర్శకత్వంలోనే ముందుకు సాగుతు న్నామని యువనేత లోకేష్ పెట్టుబడుల సదస్సులో చెప్పారు. పెట్టుబడుల సాధనలో యువనేత లోకేష్ చూపుతున్న చొరవ, లౌక్యం, వేగంను అంతర్జాతీయ పారిశ్రామిక, మీడియా సంస్థలు ప్రశంసిస్తున్నాయి. కేంద్రంతో భాగస్వామి కావడం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయన మంత్రివర్గంతో సత్సంబంధాలు.. ఏపీకి వచ్చే పెట్టుబడులకు గల అడ్డంకులను తొలగించి బిలియన్ల డాలర్ల ప్రాజెక్టులకు సాధించడంలో లోకేష్ చాతుర్యాన్ని ఇతర రాష్ట్రాల నేతలు సైతం మెచ్చుకుంటున్నారు.















