అమరావతి (చైతన్యరథం): పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో మంగళవారం జరిగిన పార్లమెంట్ కమిటీ వర్క్ షాప్‌లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. 25 పార్లమెంట్ కమిటీల నుంచి 1050 మంది కమిటీ సభ్యులు వర్క్‌షాప్‌నకు హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన వర్క్ షాప్ లో సీఎం చంద్రబాబుతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. నాలుగున్నర దశాబ్దాల పార్టీ ప్రయాణం, పార్టీ ఐడియాలజీ, క్యాడర్ మేనేజ్మెంట్, కార్యకర్తలకు ప్రాధాన్యం వంటి అంశాలపై వర్క్ షాప్ జరిగింది. కూటమి ప్రభుత్వ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు, విజన్ ప్రణాళికలు, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ది వంటి అంశాలపై జరిగిన వర్క్ షాప్‌లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఒక్కో పార్లమెంట్ కమిటీలో 42 మంది సభ్యులు చొప్పున మొత్తం 25 పార్లమెంట్లకు కలిపి 1050 మంది వర్క్ షాప్‌లో పాల్గొన్నారు. పార్టీ విధానాలు, ఆలోచనలు, సిద్దాంతాలపై నాయకులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. కూటమి ప్రభుత్వ విజయాలు, భవిష్యత్ ఆలోచనలు వివరించారు. కార్యకర్తే అధినేత అనే పార్టీ సిద్దాంతానికి కట్టుబడి అంతా పని చేయాలని నాయకులకు సీఎం సూచించారు. వర్క్ షాప్‌న కు హాజరైన చంద్రబాబు సాధారణ కార్యకర్తలా సమావేశ మందిరంలో చివర్లో కూర్చోవటం విశేషం.













