- కేంద్రాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం
- వారికి వేతనాలు పెంచింది టీడీపీ ప్రభుత్వమే
- వైసీపీ పాలనలో అన్ని రకాలుగా నష్టపోయారు
- సమాచార మంత్రి కొలుసు పార్ధసారథి
ఏలూరు/నూజివీడు(చైతన్యరథం): మహిళా శిశు సంక్షేమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నదని గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారథి తెలిపారు. అంగన్వాడీ కేంద్రా లలో మహిళలు పిల్లలకు పూర్తిస్థాయిలో పౌష్టికాహారం అందించ డంతో పాటు వాటికి స్వంత భవనాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి సంబంధించిన అనేక సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం ఎంతో చొరవ చూపుతోంది. ఆర్థిక ప్రయోజనాలు కల్పించడంతో పాటు పని ప్రదేశంలో సౌకర్యాలు మెరుగుపరిచి ప్రమాణాలు పెంపొందించ డానికి గత 20 నెలల్లో ఎన్నో ముందడుగులు పడ్డాయి. గత ప్రభు త్వంలో అంగన్వాడీ సెంటర్లు అత్యంత దయనీయ స్థితిలో ఉండే వి.. సకాలంలో టీచర్లకు జీతాలు చెల్లించే వారు కాదు.. టీచర్లు నానా ఇబ్బందులు పడేవారు..కూటమి ప్రభుత్వంలో అంగన్వాడీ సెంటర్లలో టెలివిజన్, ఆర్వో వాటర్, ఆట వస్తువులు, చార్టులు ఇండక్షన్ స్టవ్, నాణ్యమైన వంట పాత్రలు ఇలా అన్ని వసతులు కల్పించినట్టు చెప్పారు.
మినీ అంగన్వాడీ కార్యకర్తలకు టీచర్లుగా ప్రమోషన్ ఇచ్చింది కూటమి ప్రభుత్వమని తెలిపారు. అంగన్వాడీ టీచర్ల తొమ్మిది డిమాండ్లలో చాలా వరకూ నెరవేర్చామన్నారు. క్రమంగా ప్రతీనెలా ఒకటవ తేదీన జీతాలు చెల్లిస్తున్నామని తెలిపా రు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం రెండు సార్లు జీతాలు పెంచిందని గుర్తుచేశారు. అంగన్వాడీ సెంటర్లలో తాగునీరు మరుగుదొడ్లకు రూ.86.68 లక్షలు ఖర్చు చేశామని తెలిపారు. గతంలో కేవలం అరకొర జీతాలు ఉండగా కూటమి ప్రభుత్వం టీచర్ల జీతాలు పెంచి అంగన్వాడీ టీచర్ల ఆర్ధిక, సంక్షేమాభివృద్ధికి తోడ్పడిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని స్పష్టం చేశారు. సుమారు రూ.75 కోట్లతో 5జీ మొబైల్స్ కొనుగోలు చేసి 58,204 మంది టీచర్ల్లకు అందించామని, సెంట ర్లలో చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు ప్రభుత్వ సేవలు వేగంగా అందుతున్నాయని వివరించారు.













