అమరావతి (చైతన్య రథం): జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఎక్స్లో పోస్టు పెడుతూ.. “రాష్ట్ర అభివృద్ధిలో, తెలుగు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో జనసేన పోషిస్తున్న పాత్ర అభినందనీయం. ప్రజలకు అండగా నిలుస్తూ వారి భవిష్యత్ కోసం పనిచేస్తున్న జనసైనికులకు, వీరమహిళలకు, నేతలకు శుభాభినందనలు” అని పేర్కొన్నారు. పవనన్నకు అభినందనలు జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఎక్స్లో పోస్టు పెడుతూ.. “జనసేన ఏడు సిద్ధాంతాలతో ప్రజాజీవితాల్లో భాగం కావడం చాలా సంతోషం. ఈ శుభసందర్భంలో జనసేనాని పవనన్నకు, నేతలు, కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు” అని పేర్కొన్నారు.














