కుప్పం(చైతన్యరథం): కుప్పం నియోజకవర్గం తంబిగనిపల్లి లో కుప్పం మున్సిపల్ చైర్మన్ సెల్వరాజ్ నివాసానికి నారా భువనేశ్వరి వెళ్లారు. కుటుంబసభ్యులను ఆపాయ్యంగా పలకరిం చారు. అనంతరం కుప్పంలో హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో నూతనంగా నిర్మించిన రాయల్ ఇన్ కాంప్లెక్స్ హోటల్‌ను నారా భువనేశ్వరి ప్రారంభించారు.
మాజీ జెడ్పీటీసీ గృహ ప్రవేశానికి హాజరు
కుప్పం మాజీ జెడ్పీటీసీ శేఖర్ రాజ్‌కుమార్ నూతన గృహ ప్రవేశానికి నారా భువనేశ్వరి హాజరయ్యారు. శేఖర్ రాజ్ కుమా ర్ కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దంపతులకు కొత్త బట్టలు పెట్టి ఆశీర్వదించారు.

















