- విధి విధానాలతో ముసాయిదా చట్టాన్ని రూపొందించాలి
- రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం
- మహిళలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు
- మంత్రుల బృందం సమావేశంలో నారా లోకేష్
అమరావతి(చైతన్యరథం): సోషల్ మీడియాకు 13 సంవత్సరా ల లోపు బాలలను దూరంగా ఉంచడంపై విధివిధానాలు తయారు చేసి ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేయాల్సిందిగా విద్య, ఐటీì, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశిం చారు. చిన్నపిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేందుకు విధివిధానాల తయారీ, చట్టరూపకల్పనపై ఉండవల్లి నివాసంలో మంత్రుల బృందం గురువారం సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ప్రతినిధులు, అధికారులతో సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ సోషల్ మీడియా దుష్ప్రభావా నికి లోనుకాకుండా 13 నుంచి 16 ఏళ్ల పిల్లలకు వయసు ఆధారి త కంటెంట్‌ను అందుబాటులో ఉంచే విధంగా విధివిధానాలను రూపొందించాలని ఆదేశించారు. సోషల్ మీడియాలో మహిళల పట్ల అవమానకరమైన, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. పిల్లల డిజిటల్ భద్రత, శ్రేయస్సు, లీగల్ మెకానిజం ఫ్రేమ్ వర్క్‌పై ఇతర రాష్ట్రాలు, దేశాల్లో అనుస రిస్తున్న అత్యుత్తమ విధానాలను అధికారులు అధ్యయనం చేయాలని సూచించారు.
ఆ దేశాల్లో విధానాలను అధ్యయనం చేయాలి
పిల్లలను సెన్సిటివ్ కంటెంట్‌కు దూరంగా ఉంచడంపై ఆస్ట్రేలి యా, సింగపూర్, డెన్మార్క్ వంటి దేశాల్లో అమలు చేస్తున్న విధానా లను అధ్యయనం చేయాలని సూచించారు. పిల్లలపై సోషల్ మీడియా ప్రభావంపై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. నో బ్యాగ్ డే రోజున ఉపాధ్యా యులు విద్యార్థులకు, ప్రతిఏటా రెండుసార్లు నిర్వహించే మెగా పిటిఎంలో కూడా తల్లిదండ్రులు, విద్యార్థులకు సోషల్ మీడియా దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తామన్నారు. మహిళల భద్రతపై స్వయం సహాయ సంఘాల మహిళలకు కూడా అవగాహన కల్పిస్తామని తెలిపారు. వయసు నిర్దారణ కోసం డిజిలాకర్‌తో కూడిన ఏజ్ టోకెన్‌ల వినియోగంపై అధ్యయనం చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. ప్రజాభిప్రాయం అనంతరం కేంద్ర ప్రరభుత్వ చట్ట పరిధిలోని అంశాలపై నివేదికను అందజేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సున్నితమైన కంటెంట్‌ను చిన్నపిల్లలకు దూరంగా ఉంచడంపై విధివిధానాలు, ఫిర్యాదులపై తీసుకుంటున్న చర్యలను వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ప్రతినిధులు మంత్రుల బృందానికి వివరించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవకు తమవంతు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని వారు తెలిపారు. ఐటీ చట్టంలోని సెక్షన్- 46 కింద న్యాయ నిర్ణయాధికారిని వెంటనే నియమించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు వంగల పూడి అనిత, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, జిఎడి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలరావు, ఐ అండ్ పీఆర్ డైరెక్టర్ కె.ఎస్ విశ్వనాథన్, ఆకే రవికృష్ణ (ఐజీ, ఈగల్, ఇన్ చార్జ్, సైబర్ క్రైమ్), అదిరాజ్ సింగ్ రానా ఎస్పీ సైబర్ క్రైమ్, పి.కిరణ్‌కుమార్ (జాయింట్ డైరెక్టర్, ఐ అండ్ పీఆర్), పి.జయరావు, చీఫ్ జనరల్ మేనేజర్ (సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, డిజిటల్ కార్పో రేషన్), ఒ.మధుసూదనరావు (చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్, ఐ &పీఆర్), ప్రాసిక్యూషన్ డైరెక్టర్ రామకోటేశ్వరరావు, మెటా డైరక్టర్ నటాషా జోగ్, యూట్యూబ్ పబ్లిక్ పాలసీ మేనేజర్ మీరా స్వామి నాథన్, ఎక్స్ పబ్లిక్ పాలసీ ప్రొఫెషనల్ జప్రీత్ గ్రెవల్, షేర్ చాట్ పాలసీ హెడ్ తమోగా గోస్వామి, జోష్ ప్రాసెస్ మేనేజ్మెంట్ రామా నుజన్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.















