- దిశగా భారత్ అడుగులు
- ఎక్స్ ట్వీట్‌లో సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి (చైతన్య రథం): “అనకాపల్లి జిల్లాలో ఈ రోజు ‘రిన్యూ’ సంస్థకు శంకుస్థాపన జరగడం, స్వచ్ఛ ఇంధన స్వయం సమృద్ధి దిశగా భారతదేశం సాగిస్తున్న ప్రయాణంలో ఒక ప్రధాన మైలురాయి” అని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెడుతూ.. రూ.5,400 కోట్ల పెట్టుబడితో, ఈ సంస్థ స్వచ్ఛ ఇంధనంతో నడిచే 6.5 గిగావాట్ల సోలార్ ఇంగాట్-వేఫర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ దేశీయ సౌర విద్యుత్ తయారీని ప్రోత్సహించి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, మన యువతకు స్వచ్ఛ ఇంధన ఉద్యోగాలను సృష్టిస్తుంది. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా దేశీయ సౌర విద్యుత్ తయారీని బలోపేతం చేస్తుంది. భారతదేశ స్వచ్ఛ ఇంధన పరివర్తనలో అగ్రగామిగా ఉన్నందుకు ఆంధ్రప్రదేశ్ గర్విస్తోంది. దేశ సుస్థిర భవిష్యత్తులో ఒక నాయకుడిగా ఎదుగుతూనే ఉంది” అని ఆ పోస్టులో పేర్కొన్నారు.















