- యువగళం నుంచే అగ్రతాంబూలం
- ఆదాయం పెరిగేలా మార్కెటింగ్
- మన లోకేష్ అని చెప్పుకునేలా ప్రస్థానం
అమరావతి(చైతన్యరథం): ఒకప్పుడు అది కేవలం ఒక నియోజ కవర్గం..నేడు ప్రపంచపటంలో హాట్ టాపిక్! ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా మంగళగిరి ప్రజలు, ఇక్కడి చేనేత కార్మికులు గర్వంగా కాలర్ ఎగరేసి “మన మంగళగిరి`మా లోకేష” అని చెప్పుకునేలా సాగుతున్న ఒక అద్భుత ప్రస్థానం ఇది. చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడమే కాదు..మంగళగిరి శాలువాలు, చీరలకు అంతర్జాతీయ బ్రాండింగ్ తెచ్చారు యువనేత.
ప్రధాని మోదీ నుంచి బిల్‌గేట్స్ వరకు మంగళగిరి గౌరవం
నారా లోకేష్-బ్రాహ్మణి దంపతులు తమ ఇంటికి వచ్చిన దేశ ప్రధాని నరేంద్ర మోదీకి మంగళగిరి శాలువా కప్పి స్వాగతం పలి కారు. విశేషం ఏమిటంటే అదే శాలువాతో ప్రధాని బహిరంగ సభలో పాల్గొని మంగళగిరి ఖ్యాతిని దేశానికి చాటారు. అమరా వతి చట్టబద్ధతకు కృతజ్ఞతగా ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా ప్రధానికి మంగళగిరి శాలువానే బహుమతిగా ఇచ్చారు లోకేష్. దావోస్ వెళ్లినా, ఆస్ట్రేలియా వెళ్లినా.. ప్రపంచ పారిశ్రామిక దిగ్గజం బిల్ గేట్స్‌ను సీఎం చంద్రబాబు చేతులమీదుగా సత్కరించినా అక్కడ ఉండేది మన మంగళగిరి శాలువానే. ఆ విధంగా మంగళగిరి చేనేతకు ప్రోత్సాహం ఇస్తూ ప్రమోట్ చేస్తున్నారు యువనేత లోకేష్.
ప్రచారం కల్పిస్తున్న భువనమ్మ, బ్రాహ్మిణి
నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి స్వయంగా మంగళగిరి చేనేత చీరలు ధరిస్తూ దేశవ్యాప్తంగా వీటికి బ్రాండ్ అంబాసి డర్లుగా మారారు. తన ఇంట్లో జరిగే ఆత్మీయ సమావేశాలకు వచ్చే మహిళా అతిథులకు మంగళగిరి పట్టుచీరలు ఇచ్చి గౌర విస్తున్నారు. కేవలం శాలువాలు కప్పడమే కాదు చేనేత వస్త్రాల విక్రయాల కోసం అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదిర్చి నేతన్నల ఆదాయం పెరిగేలా లోకేష్ అడుగులు వేశారు. విశాఖ గ్లోబల్ సమ్మిట్‌లో వచ్చిన మహిళా అతిథులందరికీ చంద్రబాబు మంగళగిరి చీరలనే బహుమతిగా ఇచ్చి నేతన్నపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
రాజకీయాల్లోనూ అగ్రతాంబూలం
సామాన్య కార్యకర్తలకు రాజకీయాల్లో అగ్రతాంబూలం ఇచ్చారు. మంగళగిరి అంటే కేవలం ఓట్లు కురిపించే సీటు కాదు.. ప్రాణం ఇచ్చే కార్యకర్తల కోట. సామాన్యులకు సైతం అత్యున్నత పదవులు ఇచ్చి గౌరవించారు. మంగళగిరి చేనేత వర్గానికి చెందిన గుత్తికొండ ధనుంజయరావుకు తెలుగుదేశం పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి పొలిట్‌బ్యూరోలో స్థానం కల్పించి రాజకీయ అతిరథ మహారథుల పక్కన నిలబెట్టి మంగళగిరి గౌరవాన్ని పెంచారు.నిన్న మొన్న జరిగిన డిజిటల్ మహానాడు ప్రధాన స్టేజ్‌పై ధనుంజయరావును కూర్చోబెట్టడమే కాకుండా.. క్లస్టర్ ఇన్‌చార్జ్ గాదె పిచ్చిరెడ్డి, ఆత్మకూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు తాటి వెంకటరావులతో జెండా వందనం, ఎన్టీఆర్ విగ్రహ నివాళి కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసి స్థానిక లీడర్లకు అగ్రస్థానం కల్పించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే, చిలకలూరిపేట ప్రధాని మోదీ బహిరంగ సభలో మంగళగిరి చేనేత నాయకుడు నందం అబద్దయ్యకు ప్రధానమంత్రికి స్వాగ తం పలికేలా లోకేష్ చొరవ తీసుకున్నారు.
రాష్ట్రపతికి మంగళగిరి శాలువాతో స్వాగతం
మన దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతికి సైతం మంగళగిరి శాలువాతో స్వాగతం పలికి ఇక్కడి నేతన్నల పట్ల తనకున్న భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. నారా లోకేష్ చరిత్ర సృష్టించిన ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభమైన తొలిరోజు నుంచి ప్రతి కీలక మైలురాయిలోనూ మంగళగిరి నాయకులకు, ఇక్కడి ప్రజలకే తొలి ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. గవర్నర్ అయినా, కేంద్ర మంత్రులైనా లోకేష్ ఇంటికి వస్తే మంగళగిరి శాలువా ఉండాల్సిందే. ఒకవైపు మన మంగళగిరి-మన చేనేత పేరుతో ప్రపంచవ్యాప్తంగా బ్రాండింగ్.. మరోవైపు స్థానిక సామాన్య కార్యకర్తలకు దేశ ప్రధాని, రాష్ట్రపతి వేదికలపై గుర్తింపు.. మం గళగిరి ప్రజలు కాలర్ ఎగరేసి మన మంగళగిరి..మన లోకేష్ అని గర్వంగా చెప్పుకునేలా ముందుకు సాగుతున్నారు.
“`
ఒక్క క్లిక్‌తో పోలీస్ సేవలు
‘వైజాగ్ సిటీ పోలీస’ పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్
అందుబాటులోకి తెచ్చిన పోలీస్ కమిషనర్
చోరీలు, నేరాల వివరాలు నమోదు చేస్తే సహాయం
విశాఖపట్నం(చైతన్యరథం): నగర వాసులకు పోలీస్ సేవల ను మరింత చేరువ చేసేందుకు కమిషనర్ శంఖబ్రతబాగ్చి ‘వైజాగ్ సిటీ పోలీస’ పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటు లోకి తెచ్చారు. ఎవరైనా స్మార్ట్ ఫోన్ ద్వారా పోలీస్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి వివరాలను ఎంటర్ చేస్తే సంబంధిత పోలీసులు తక్షణం సహాయం అందజేస్తారు. ఒక సీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బృందం మూడునెలలు శ్రమించి ఈ వెబ్‌సైట్‌ను తీర్చిది ద్దారు. గూగుల్‌లో వైజాగ్ సిటీ పోలీస్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయగానే సర్వీసెస్ ఫర్ సిటిజన్ అనే అప్షన్ వస్తుంది. అందులో ట్రాఫిక్ విభాగానికి సంబంధించి ఈ-చలాన్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిని క్లిక్ చేసిన తర్వాత వాహనం నంబరు ఎంటర్‌చేస్తే ఎన్ని ఈ-చలాన్‌లు ఉన్నాయి, ఎన్ని చెల్లించారు? ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి తెలుస్తుంది. అలాగే సైబర్ క్రైమ్, బ్యాంకింగ్ మోసాలకు గురైతే సైబర్ క్రైమ్ ఆప్షన్‌ను క్లిక్ చేయగానే 1930 హెల్ప్‌లైన్‌తో పాటు డబ్బులు పోగొట్టుకున్న ఖాతా వివరాలు, పోగొట్టుకున్న మొత్తం వంటి వివరాలను నమోదు చేస్తే సంబంధిత విభాగం పోలీసులు, బ్యాంకు అధికా రుల సమన్వయంతో సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన డబ్బు ఏ ఖాతాకు ట్రాన్స్‌ఫర్ అయిందో తెలుసుకుని ఆ అకౌంట్‌ను ఫ్రీజ్ చేయిస్తారు. తర్వాత బాధితులు ఏం చేయాలో నేషనల్ ఏజెన్సీ గైడ్ చేస్తుంది. ఇక, ఏదైనా పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించిన స్థితిగతులు, నిందితుల వివరాలు, అరెస్టులు, రిమాండ్ రిపోర్టు, చార్జిషీట్ ఫైలింగ్ వంటి వివరాలను తెలుసు కోవాలంటే నో యువర్ కేస్ స్టేటస్ అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకుంటే, అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఎవరైనా ఫోన్ పోగొట్టుకున్నా, లేదా చోరీకి గురైనా వెబ్‌సైట్‌లోకి వెళ్లి చాట్ బాట్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకుని పోగొట్టుకున్న ఫోన్ వివరాల ను నమోదుచేస్తే దానిని ట్రాక్ చేసి బాధితులకు అందజేస్తారు. కుటుంబంలో ఎవరైనా సభ్యులు కనిపించకపోయినా, తీర్థ యాత్రలు, రద్దీ ప్రాంతాలకు వెళ్లినప్పుడు పిల్లలు తప్పిపోయినా వారి వివరాలను వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫొటోతో పాటు ఇతర గుర్తులను నమోదు చేస్తే పోలీసులు వాటి ఆధారంగా దర్యాప్తు చేసి పట్టుకుని తిరిగి అప్పగించేందుకు యత్నిస్తారు. వాహనాలు చోరీకి గురైనట్టయితే ఫొటో, వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేస్తే నిఘా పెట్టి పట్టుకునేందుకు యత్నిస్తారు. పోలీస్ సేవలు, ఇతర వివాదాలపై పీజీఆరఎస్‌లో ఫిర్యాదు చేస్తే వాటి వివరాలతోపాటు అధికారులు తీసుకున్న చర్యలు పబ్లిక్ గ్రీవెన్స్ పోర్టల్‌లో పొందు పరుస్తారు. ఎవరైనా తుపాకీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవ డంతో పాటు అధికారులు తీసుకున్న చర్యలను కూడా వెబ్‌సైట్‌లో తెలుసుకునే సదుపాయం కల్పించారు. నగరంలో 22 శాంతి భద్రతల పోలీస్‌స్టేషన్లు ఉండడంతో వాటి పరిధి, ఎవరిని కలవాలి, ఫోన్ నంబర్లు ‘నో యువర్ పోలీస్ స్టేషన’ పోర్టల్‌లో అందుబా టులో ఉంచారు. కమిషనరేట్ పరిధిలో పనిచేసే అధికారుల క్రమం, పేరు, ఫోన్ నంబరు, పాత నేరస్థుల వివరాలు కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.















