- ఉద్యోగాలే కాదు.. కంపెనీలు పెట్టేలా సహకారం
- స్టార్టప్లను ప్రోత్సహిస్తూ ఆర్టీఐహెచ్ సేవల వినియోగం
- ఇథనాల్..సెమీ కండక్టర్ల పరిశ్రమలకు ప్రోత్సాహం
- మైక్రో ఇరిగేషన్ ఎక్విప్మెంట్ పార్క్ ఏర్పాటుకు చర్యలు
- పారిశ్రామిక ప్రాంతాల వద్ద తక్కువ ధరలో ఇళ్ల నిర్మాణం
- 18వ ఎస్ఐపీబీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
- 5.30,515 కోట్ల పెట్టుబడులకు బోర్డు ఆమోదం
అమరావతి(చైతన్యరథం): పారిశ్రామికాభివృద్ధి
ఫలాలు పేద, మధ్యతరగతి ప్రజలకు అందేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు ఏపీలో ఏర్పాట య్యే పారిశ్రామిక ఎకో సిస్టంను రూపొందించాలని స్పష్టం చేశా రు. పరిశ్రమలు, కంపెనీలను ధనికులే స్థాపించగలరనే భావన పోయేలా అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. గురువారం సచివాలయంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో 18వ ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ కంపెనీల ఏర్పాటుకు అనుమతులిచ్చారు. మొత్తంగా 50 కంపెనీ లకు సంబంధించి రూ.30,515 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ కంపెనీల ద్వారా మొత్తంగా 29677 ఉద్యోగాలు రానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్దఎత్తున పారిశ్రామికాభివృద్ధి జరుగుతోంది.
అందు లో భాగంగా పేద, మధ్యతరగతి వారికి ఉద్యోగాలు కల్పించడమే కాదు.. సామాన్యులు కూడా కంపెనీలు స్థాపించే అవకాశం కల్పిం చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు స్టార్టప్ కంపెనీలకు పెద్దఎత్తున ప్రోత్సాహం అందిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్టీఐహెచ్ సేవలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆర్టీఐహెచ్ పరిధిలోని స్టార్టప్ కంపెనీల కు వెంచర్ క్యాపిటలిస్టుల నుంచి పెట్టుబడులు వచ్చేలా చూడాలి. ఈ విధానాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలి. దీనికి అనుగుణంగా ఎకో సిస్టం ఏర్పాటు చేసే అంశంపై అధికారులు ఫోకస్ పెట్టాలి. ఇక వచ్చే పరిశ్రమలకు అనుగుణంగా కరిక్యులమ్ తయారుచేసే దిశగా విద్యాశాఖ ఆలోచన చేయాలి. పరిశ్రమలు, ప్రాజెక్టుల్లో ఎలాంటి ట్రెండ్స్ వస్తున్నాయో గమనించి దానికి అనుగుణంగా కరిక్యులమ్ రూపొందించాలి. రోబోటిక్స్ లాంటి ఆధునిక టెక్నాల జీ కోర్సులు కూడా మన విద్యాసంస్థల్లో ఉండాలి. వివిధ ప్రాజెక్టు లకు సంబంధించి నాన్ సీరియస్ ప్లేయర్సు ఏపీలో చోటులేదు. ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చాక వెంటనే పనులు మొదలు పెట్టేలా చూడాలి. పనులు ప్రారంభించని సంస్థలతో టచ్లో ఉం టూ ఫాలో అప్ చేయాలని స్పష్టం చేశారు.
ఆటోమేషన్ పారిశ్రామిక అనుమతులు
ఇథనాల్ తయారీ విషయంలో ముందడుగు వేయాలి. 40 శాతం ఇథనాల్ బ్లెండ్ చేసేందుకు కేంద్రం అంగీకరిచింది. ఇథనాల్ తయారీ పరిశ్రమలను ప్రోత్సహిస్తే రైతులకు ప్రయోజ నం కలుగుతుంది. ఇథనాల్ బేస్డ్ ఇంధనం ఎక్కువగా ఉపయోగిస్తే దిగుమతి చేసుకునే ఇంధన భారం తగ్గుతుంది. బయో ఫ్యూయల్స్ రంగాన్ని మరింత ప్రోత్సహించాల్సి ఉంది. ఈ విషయంపై ఆయిల్ కంపెనీలతో సంప్రదింపులు జరపాలి. అలాగే వివిధ రంగాల్లో ప్రాజెక్టులు తీసుకురావడంతో పాటు విద్యుత్ సరఫరా అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా ప్రాజెక్టులు వచ్చేలా చూడాలి.
ఈ ఏడాది డిమాండ్లో 17 శాతం వృద్ధి నమోదైంది. ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య విభాగాల వినియో గానికి అనుగుణంగా విద్యుత్ ఎంత అవసరం అవుతుందో అంచ నాలు తయారుచేయాలి. సోలార్ విండ్, పంప్డ్ స్టోరేజితో పాటు బెస్(బీఈఎస్ఎస్) టెక్నాలజీకే ఇక భవిష్యత్. 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీకి అనుగుణంగా పంప్డ్ స్టోరేజీ సహా ఇతర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు చేపటాలి. లిథియం అయాన్ బ్యాటరీల ఉత్పత్తిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఈవీలకు ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీలపై దృష్టి పెట్టాలి. బ్యాటరీ టెక్నాలజీపై ఎక్కువ దృష్టి పెట్టండి. డేటా సెంటర్ల ఏర్పాటు విషయంలో విద్యుత్ వినియోగం అనేది అత్యంత కీలకం. డేటా సెంటర్ల అనుమతుల విషయంలో దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సెమీ కండక్టర్లపై ఎక్కువ దృష్టి సారించాలి. దానికి సంబంధించిన ఎకోసిస్టంపై ఎక్కువ ఫోకస్ చేయాలని సూచించారు.
మైక్రో ఇరిగేషన్కు ప్రాధాన్యం
ఇక మైక్రో ఇరిగేషన్ రైతుల కోసం మైక్రో ఇరిగేషన్ ఎక్విప్మెం ట్ పార్క్ ఏర్పాటుకు చర్యలు తీసుకోండి. మైక్రో ఇరిగేషన్ పరిక రాల తయారీ కంపెనీలను ఎంకరేజ్ చేద్దాం. భవిష్యత్తులో హార్టికల్చర్, ఫ్లోరీకల్చర్కు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. దీంతో మైక్రో ఇరిగేషన్కు ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ క్రమంలో మైక్రో ఇరిగేషన్ పరికరాల పరిశ్రమలను ప్రోత్సహించా ల్సిన అవసరం ఉంది. దీని వల్ల రైతులకూ తక్కువ ధరలో మైక్రో ఇరిగేషన్ ఎక్విప్మెంట్ అందుబాటులోకి వస్తుంది. అమరావతిలో ఏఐ, ఆల్గారిథమ్స్ క్వాంటం అప్లికేషన్ల రూపకల్పన మొదలైంది. ప్రాజెక్టుల అనుమతులు, భూ కేటాయింపులు వంటివి సులభత రంగా అందించాలి. దీంతో పాటు రాజకీయ జోక్యం అనేది లేకుం డా చూడాలి. అన్ని నిబంధనలు పాటించిన ప్రాజెక్టులకు ఆటోమో షన్ పద్దతిలో అనుమతులు లభించే విధానాన్ని అనుసరిస్తే రాజకీయ జోక్యం తగ్గిపోతుంది. ఆ దిశగా అధికారులు ఆలోచన లు చేయాలిఅమరావతి క్వాంటం వ్యాలీకి సంబంధించి ఓ ఎకోసిస్టమ్ రావాలి. టవర్లతో పాటు టెక్నాలజీ పార్క్ రావాలి.
క్వాంటం అప్లికేషన్లతో పాటు క్వాంటం కంప్యూటింగ్ పరికరాలు కూడా రావాలి. మరోవైపు ఆటోమొబైల్ పరిశ్రమలకు శ్రీసిటీ సహా అనంతపురం జిల్లా కూడా కీలకం. తిరుపతి, శ్రీసిటీలు రాయల్ ఎన్ ఫీల్డ్, ఇసుజు, హీరో లాంటి ఆటోమొబైల్ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి. అనంతపురంలో కియా కార్ల ఉత్పత్తి జరుగుతోంది. పుట్టపర్తిలో 5వ జనరేషన్ ఫైటర్ జెట్ తయారీ, టెస్టింగ్ ఫెసిలిటీ కేంద్రం వేగంగా గ్రౌండ్ కావాలి. ఫైటర్ జెట్ తయారీ కేంద్రం పనుల విషయంలో నిరంతరం ఫాలో అప్ చేస్తూ ఉండాలి. కేంద్రా నికీ ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలి. ఏమైనా ఇబ్బందులు వస్తే వెంటనే పరిష్కారం చూపాలి. బెంగుళూరు-పుట్టపర్తి డిఫెన్స్ కారిడార్గా మారుతుంది. ఏరోస్పేస్ కారిడార్గా ఈ ప్రాంతాన్ని మార్చాలి. తాడిపత్రి- అనంతపూర్ మధ్య ఓ ఎయిర్ స్ట్రిప్ వచ్చే లా చూడాలని సూచించారు.
జొన్నగిరి.. స్వర్ణగిరి
పర్యాటకులు ఎక్కువ సమయం రాష్ట్రంలో గడిపేలా హోటళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి. మహీంద్రా క్లబ్ సంస్థ బీచ్ రిసార్ట్స్, పులికాట్ లేక్ వద్ద కూడా ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నారు. అరకు లాంటి ప్రాంతాల్లోనూ ఐటీడీఏ భాగ స్వామ్యంతో మహీంద్రా ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది. టెంపుల్ టూరిజంను ప్రోత్సహించేలా కొత్తగా అభివృద్ధి చెందుతున్న పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రాలను గుర్తించివాటి వద్ద పెట్టుబడులు వచ్చేలా చూడాలి. తిరుపతి, అమరావతి, విశాఖలలో బాబా రామ్ దేవ్ యోగా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. గండికోట, పోలవరం ప్రాజెక్టు, అనంతపురం, కర్నూలు వద్ద పెద్దఎత్తున హోటళ్లు రావాల్సి ఉంది. హార్సిలీ హిల్స్ వద్ద మంచి రిసార్టులు ఏర్పాటు చేస్తే టూరిస్టులు మరింతగా పెరుగుతారు. సూర్యలంక బీచ్ మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి. బెస్ట్ బీచ్ టూరిజం స్పాట్గా సూర్య లంకను తీర్చిదిద్దాలి. పర్యాటక కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరిగేలా చర్యలు చేపట్టాలి. అమరావతిలో వచ్చే పెట్టుబడులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఓ కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేయాలి. డిస్ట్రిక్ట్ కూలింగ్, పైప్డ్ గ్యాస్, విద్యుత్ లాంటివి పూల్గా ఇచ్చే పరిస్థితి వస్తే ప్రాజెక్టుల వ్యయం తగ్గుతుంది.
రేర్ ఎర్త్ మినరల్స్కు ఏపీ కేంద్రంగా మారాలి. రేర్ ఎర్త్ మినరల్సు సంబం ధించిన ఎండ్ టూ ఎండ్ సొల్యూషన్స్ ఏపీలో అందుబాటులో ఉండేలా ఎకోసిస్టమ్ రావాలి. రేర్ ఎర్త్ మినరల్స్పై ఓ ప్రత్యేక విద్యా సంస్థ ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో ఆలోచన చేయాలి. జొన్నగిరి గోల్డ్మెన్ 1000 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. జొన్నగిరి అత్యంత పురాతన చరిత్ర ఉంది. ఒకప్పుడు జొన్నగిరికి స్వర్ణగిరి అని పేరుంది. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ రంగానికి ప్రాధాన్యత, ప్రోత్సాహం ఇవ్వాలి. విశాఖ నగరంలో ప్రస్తుత సదుపాయాలను మరింత మెరుగుపరుస్తూనే శాటిలైట్ టౌన్షిప్లు అభివృద్ధి జరిగేలా చూడాలి. పరిశ్రమలతోపాటు హౌసింగ్ కూడా ఉండాలి. పారిశ్రామిక ప్రాంతాల వద్ద అందుబాటు ధరల్లో గృహ నిర్మాణాలు జరిగేలా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు అచ్చెన్నాయుడు, అనగాని, టీజీ భరత్, కందుల దుర్గేష్, పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్రెడ్డి, సీఎస్ సాయిప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.















