అమరావతి (చైతన్య రథం): యువగళం పాదయాత్రలో ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూసి, ఆనాడు నేను ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈమేరకు ఎక్స్ వేదికపై ట్వీట్ చేస్తూ.. “తమ కులవృత్తిని కొనసాగించేందుకు క్వారీలు కేటాయించాలని పాదయాత్ర సమయంలో వడ్డెర సోదరులు నన్ను కలిసి విన్నవించారు. ఆనాడు నేను ఇచ్చిన హామీ మేరకు క్వారీల్లో 33 శాతం వాటాను వడ్డెరలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.126 జారీ చేసింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది” అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.















