అమరావతి (చైతన్య రథం): స్మార్ట్ కిచెన్ల ద్వారా ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు మంచి రుచికరమైన భోజనం పెడుతుంటే వైకాపా అధినేత జగన్ ఓర్వలేకపోతున్నారని విద్యాశాఖమంత్రి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా మహిళలు, పేదలకు ఉపాధి కల్పిస్తుంటే జగన్ తట్టుకోలేకపోతున్నారన్నారు. కడప జిల్లాలో ఐదు స్మార్ట్ కిచెన్లను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని.. హెడ్ కుక్స్, అసిస్టెంట్ కుక్స్, హెల్పర్లు, డ్రైవర్లకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. వీటితోపాటు జిల్లాలో 33 స్మార్ట్ కిచెన్లు ఏర్పాటుచేసి.. 392మందికి ఉపాధి కల్పించబోతున్నామని పేర్కొన్నారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుంటే జగన్క్ బాధ ఎందుకని లోకేశ్ ప్రశ్నించారు. పేదలు బాగుపడితే చూడలేకపోతున్నారా? అని నిలదీశారు.















