- ప్రశ్నించిన పాపానికి 74 మందిని హత్య చేశారు
- ఐదేళ్ల పాలనలో ఒక్క బాధితుడిని పరామర్శించలేదు
- బీసీ సంక్షేమ పథకాలు రద్దు.. నిధులు మళ్లించారు
- ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజం
మంగళగిరి(చైతన్యరథం): ఐదేళ్ల పాలనలో బీసీలను మోసం చేసిన జగన్.. ఇప్పుడు బీసీ గర్జన ఎలా నిర్వహిస్తారని ఎక్సైజ్శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రశ్నిం చిన పాపానికి వైసీపీ నేతలు అమర్నాథ్ గౌడ్, తోట చంద్రయ్య, నందం సుబ్బయ్య వంటి 74మంది బీసీ లను హత్య చేశారు.వైవీ సుబ్బారెడ్డి ముందు మోకరిల్లి బీసీల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ నేడు బీసీ గర్జనగురించి మాట్లాడటం సిగ్గుచేటు. ఐదేళ్ల పాలనలో బీసీలపై జరిగిన దాడులకు స్పందించి ఒక్క బాధితుడిని కూడా జగన్ పరామర్శిం చలేదు. బీసీల సంక్షేమానికి చెందిన రూ.75వేల కోట్ల నిధులను దారిమళ్లించి, 34పథకాలను రద్దు చేశారు. రాష్ట్రంలో ఉన్న అనేక వర్సిటీల్లో ఒక్క బీసీని కూడా వీసీగా నియమిం చేందుకు జగన్ను మనసు రాలేదు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34% నుంచి 24%కి తగ్గించి 16,800 మంది బీసీల రాజకీయ హక్కులను కాలరాశారు. గురుకులాలు, బీసీ హాస్టళ్ల ను నిర్లక్ష్యం చేయడం, చేనేతలు, మత్స్యకారుల సంక్షేమాన్ని విస్మరించారని మండిపడ్డారు.
దాడులు, హత్యలు జరిగితే ఎందుకు స్పందించలేదు?
వైసీపీ నాయకులు జోగి రమేష్, విడుదల రజని, చెల్లుబోయిన వేణుగోపాల్ వారి హయాంలో బీసీలపై దాడులు, హత్యలు జరిగినప్పుడు ఎందుకు స్పందించ లేదు. జోగి రమేష్ చేసిన అక్రమాలు, అక్రమ మద్యం వ్యవహారాల వల్ల బలహీన వర్గాలు తలదించుకోవాల్సి వస్తోంది. సీదిరి అప్పలరాజు తన కుమారుడిని కాపా డుకునేందుకు యత్నించారే తప్ప యాదవ సోదరుడిని ఆస్పత్రికి తరలించి కాపాడే ప్రయత్నం చేయలేదు. 18 ఏళ్ల కుర్రాడు ప్రమాదం చేస్తే తప్పు కాదంటూ సమర్థించేలా జగన్రెడ్డి వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు. సొంత కోడలిని అదనపు కట్నం కోసం చిత్రహింసలు పెడితే ఆ తల్లి పోలీసు స్టేషన్ కంప్లైంట్ చేసింది. ఇది మీ నైజం మీ స్వభావమని మండిపడ్డారు.
బీసీ సంక్షేమానికి రెండేళ్లలో రూ.50 వేల కోట్లు
బీసీలను ‘బ్యాక్ బోన్ ఆఫ్ ది సొసైటీ’గా గుర్తించి వారి సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక కృషి చేస్తున్నారు. బీసీ సంక్షేమానికి రెండేళ్ల లోనే రూ.50,001 కోట్లు కేటాయించి ఖర్చు చేస్తున్నాం. రానున్న ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్లతో ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేశాం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను తిరిగి 34%కి పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాల్లో కొత్తగా 10 ఏర్పాటు చేస్తూ అదనంగా 5,000 మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నాం. గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10%, వడ్డెర్లకు క్వారీల కేటాయింపులో 33% రిజర్వేషన్లు కల్పిస్తు న్నాం. చేనేతలకు చేయూత కింద రూ.25 వేల ఆర్థిక సాయం, మగ్గాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. మత్స్యకారులకు రూ.20వేల వేట నిషేధ సాయం అందించడంతో పాటు, బీసీ స్వర్ణకారుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేశాం. బీసీ గర్జన పేరుతో కుట్రలు చేసేందుకు గొడ్డలి పార్టీ ప్రయత్నిస్తోంది. బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పైకి తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు అని ప్రశంసించారు.












